Tuesday, 1 December 2015

కేన్సర్ ను నివారించే పోషకాహారం

పండ్లు, కూరగాయల్లో పోషకాహారం కేన్సర్ ను తగ్గిస్తుంది. కేన్సర్ రాకుండా చూసుకోవడానికి పప్పుధాన్యాలు, బార్లీ, గోధుమ, పండ్లు, కూరగాయలు ఎక్కువగా వాడాలి. ఇలాంటి ఆహారంతో గర్భాశయ, పిండాశయ, రొమ్ము, పొట్ట, గాలితిత్తి, పురీషనాళములకు వచ్చే కేన్సర్ ను నివారించవచ్చు. పోషక విలువలను బట్టి చూస్తే కొవ్వు పదార్థాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. కొందర పశువుల కొవ్వుతో కూడిన పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటూ.. తర్వాత దుష్పరిమాణాలకు బాధితులు అవుతున్నారు.

                పాలీ అన్ శాచ్యురేటెడ్ ఫాటీ యాసిడ్స్ ఉన్న వెజిటబుల్ నూనెలను వాడటం మచిదని అంటున్నారు. కూరగాయల్లో కొన్ని ఎంజైమ్ లు పెంచే విటమిన్లకు కారకమైన కూరగాయలను వాడటం మంచిది. ఈ విధంగా శరీరంలోకి తీసుకునే కొవ్వును తగ్గించి రొమ్ము, పిట్యూటరీ కేన్సర్ ను నివారించవచ్చు. 
           

No comments:

Post a Comment