Monday 31 October 2016

లంగ్ కేన్సర్ అవేర్ నెస్ మంత్ నవంబర్



నవంబర్ ను లంగ్ కేన్సర్ అవేర్ నెస్ మంత్ గా జరుపుకుంటున్నారు. కేన్సర్‌ మూలంగా చనిపోవడానికి కారణం ఆలస్యంగా వ్యాధి నిర్ధారణ జరగడమే. తొలిదశలో గుర్తిస్తే కేన్సర్‌ను జయించే అవకాశాలు 99 శాతం ఉంటాయి. అయితే కొన్ని కేన్సర్లలో వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడవు. వ్యాధి నిర్ధారణ చేయడానికి అవసరమైన పరీక్షలు కూడా కష్టంగా ఉంటాయి. అలాంటి వాటిలో లంగ్‌ కేన్సర్‌ కూడా ఒకటి. అయితే ఈ కేన్సర్‌ను పసిగట్టేందుకు ఓ కొత్త మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో కేన్సర్‌ నిర్ధారణలో ఉపయోగించే బాధాకరమైన పద్ధతులకు వీడ్కోలు పలకవచ్చని వారు భావిస్తున్నారు.


                         లంగ్‌ కేన్సర్‌ బాధితులలో తాజాగా గుర్తించిన ఓ బయోమార్కర్‌ ద్వారా కేన్సర్‌ను ఖచ్చితంగా గుర్తించవచ్చని కనుగొన్నారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల కేన్సర్‌ నిర్ధారణకు ఉపయోగించే బ్రోంకోస్కోపీ పరీక్ష ఖర్చుతో కూడుకోవడంతో పాటు బాధాకరమైంది కూడా. ఈ నేపథ్యంలో కేన్సర్‌ సోకిందేమోననే అనుమానం కలిగితే వైద్యులు ఈ కొత్త విధానం ద్వారా తక్కువ ఖర్చుతో తేలిగ్గా వ్యాధినిర్ధారణ చేయవచ్చు.





Wednesday 12 October 2016

స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ తో కంటి కేన్సర్ గుర్తింపు

ఐదేళ్లలోపు చిన్నారులలో కంటి కేన్సర్‌ బాధితులను స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతో గుర్తించవచ్చని కేన్సర్‌ నిపుణులు చెబుతున్నారు. రెటినోబ్లాస్టోమాగా వ్యవహరించే ఐ కేన్సర్‌ను స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఫ్లాష్‌ ద్వారా పసిగట్టవచ్చని చైల్డ్‌హుడ్‌ ఐ కేన్సర్‌ సెంటర్‌ పరిశోధకులు పేర్కొన్నారు. రెటీనాపై పడిన ఫ్లాష్‌ వల్ల కనుగుడ్డు తెల్లగా కనిపిస్తుందని, దీన్ని ఫొటోలో స్పష్టంగా గుర్తించవచ్చన్నారు.


   కంటి లోపల పెరిగే ఆర్‌బీ కేన్సర్‌ కణితి చూపుతో పాటు ప్రాణాలనూ హరిస్తుంది. అయితే దీన్ని తొలిదశలో గుర్తించడం కష్టమని చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ కెమెరా సాయంతో ఆర్‌బీని ప్రారంభ దశలో గుర్తించగలిగితే ఆ చిన్నారి ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు.

Sunday 2 October 2016

కేన్సర్ అవేర్ నెస్ మంత్ అక్టోబర్

రొమ్ము కేన్సర్‌ను అడ్వాన్స్డ్‌ స్టేజీ వచ్చేంత వరకు గుర్తించడం లేదు. మన దేశంలో కేవలం 5 శాతం మంది మాత్రమే స్ర్కీనింగ్‌ చేయించుకుంటున్నారు. మిగతా వారిలో 65శాతం మహిళల్లో అడ్వాన్స్డ్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌ బయట పడుతోంది.
ఈ లెక్కన మన దేశంలో ప్రతి వెయ్యి మందికి ఒక మహిళ బ్రెస్ట్‌ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఏటా 1.50 లక్షల మంది రొమ్ము కేన్సర్‌ బాధితులను గుర్తిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన బ్రెస్ట్‌ స్ర్కీనింగ్‌ క్యాంప్‌లను జాతీయ స్థాయిలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. 
     
        
చాలా మంది మహిళలు రొమ్ములో 5 సెంటీమీటర్ల వరకు కణతి పెరిగేంత జబ్బును గుర్తించలేకపోతున్నారని, అయితే 1.52 సెంటీర్లు ఉన్నప్పుడే గుర్తిస్తే తొలిదశలోనే కేన్సర్‌ను అరికట్టవచ్చునన్నారు. మహిళలు మోమెగ్రమీ పరీక్షలు చేయించుకోవడానికి ముందుకురావడం లేదని, దీనివల్లనే బ్రెస్ట్‌ కేన్సర్‌ను తొలిదశలో గుర్తించడం లేదన్నారు. అంతర్జాతీయ రొమ్ము కేన్సర్‌ అవగాహన పేరుతో కలర్‌తో చారిత్రక కట్టడాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.