రొమ్ము కేన్సర్‌ను
అడ్వాన్స్డ్ స్టేజీ వచ్చేంత వరకు గుర్తించడం లేదు. మన దేశంలో కేవలం 5 శాతం
మంది మాత్రమే స్ర్కీనింగ్ చేయించుకుంటున్నారు. మిగతా వారిలో 65శాతం
మహిళల్లో అడ్వాన్స్డ్ బ్రెస్ట్ కేన్సర్ బయట పడుతోంది.
ఈ
లెక్కన మన దేశంలో ప్రతి వెయ్యి మందికి ఒక మహిళ బ్రెస్ట్ కేన్సర్‌తో
బాధపడుతున్నారు. ఏటా 1.50 లక్షల మంది రొమ్ము కేన్సర్ బాధితులను
గుర్తిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన బ్రెస్ట్
స్ర్కీనింగ్ క్యాంప్‌లను జాతీయ స్థాయిలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం
సుముఖత వ్యక్తం చేసింది.
చాలా
మంది మహిళలు రొమ్ములో 5 సెంటీమీటర్ల వరకు కణతి పెరిగేంత జబ్బును
గుర్తించలేకపోతున్నారని, అయితే 1.52 సెంటీర్లు ఉన్నప్పుడే గుర్తిస్తే
తొలిదశలోనే కేన్సర్‌ను అరికట్టవచ్చునన్నారు. మహిళలు మోమెగ్రమీ పరీక్షలు
చేయించుకోవడానికి ముందుకురావడం లేదని, దీనివల్లనే బ్రెస్ట్ కేన్సర్‌ను
తొలిదశలో గుర్తించడం లేదన్నారు. అంతర్జాతీయ
రొమ్ము కేన్సర్ అవగాహన పేరుతో కలర్‌తో చారిత్రక కట్టడాల ద్వారా ప్రచారం
నిర్వహిస్తున్నారు.
No comments:
Post a Comment