Tuesday 31 January 2017

అతిగా వేయించిన చిప్స్ తింటున్నారా ?

ఈ రోజుల్లో స్నాక్స్ గా చిప్స్ తినడం మామూలు అయిపోయింది. అయితే మరి ఎక్కువ వేయించిన బ్రెడ్ ,ఆలు చిప్స్ లో ప్రాణంతక కేన్సర్ రసాయనం ఉందని వాటిని తింటే కేన్సర్ ని కొని తెచ్చుకున్నట్లే అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పిండి పదార్దాలను అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి తింటే అక్రిలామైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ ప్రయోగం జంతువులపై జరిపిన ప్రయోగాల్లో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. వంటకాలను బంగారు వర్ణం వచ్చే వరకు మాత్రమే ఫ్రై చెయ్యాలి అని సూచించారు.



             కాబట్టి ఈసారి చిప్స్ తినే ముందు వాటి కలర్ చూసి తినండి. ఎందుకంటే బాగా వేయించిన చిప్స్ తో కేనస్ర్ వచ్చే ప్రమాదం ఉంది. మన ప్రమేయం లేకుండానే కేన్సర్ వచ్చే ఛాన్స్ ఎలాగో ఉంది. దీనికి తోడు మనం కేన్సర్ ను కొనితెచ్చుకోవడం అవసరం అంటారా. చెప్పండి. ఒక్క చిప్సే కాదు ఏ పదార్థమైనా అతిగా వేయించడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

Monday 30 January 2017

ప్రొస్టేట్ కేన్సర్ రిస్క్ తగ్గాలంటే ?


 20 మంది మహిళలలతో పురుషుడు సెక్సులో పాల్గొంటే అతడికి ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం 28% మేర తగ్గిపోతుందట. ఈ అధ్యయనం కెనడాకు సంబంధించిన పరిశోధకులు చేసి, పలువురు పురుషులను పరిశీలించిన అనంతరం వెల్లడించినట్లు కేన్సర్ ఎపిడమాలజీ జర్నల్ తెలిపింది. దీనికి కారణం అంతమంది మహిళలతో సెక్సులో పాల్గొనేవారు ఎక్కువసార్లు వీర్యాన్ని స్ఖలిస్తారు కనుక వీర్యంలో ప్రొస్టేట్ కేన్సర్ కారక ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుందని వారు తెలుసుకున్నారు. అయితే కొన్ని దేశాల్లో ఇలా ఎక్కువమంది స్త్రీలతో సెక్స్ చేసే పరిస్థితి ఉండదనీ, అలాంటి దేశాల్లో మగవారు హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారని చెపుతున్నారు.



అధ్యయనంలో భాగంగా సెక్స్ పరీక్షల్లో పాల్గొన్న పురుషుల్లో ఎక్కువమంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో ప్రొస్టేట్ కేన్సర్ అవకాశాలు తక్కువగా కనబడగా భాగస్వామితో మాత్రమే సెక్స్ సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో కొంతమందికి ఈ వ్యాధి లక్షణాలున్నట్లు తేలింది. ఐతే ఇది కొన్ని దేశాలకు మాత్రమే వర్తిస్తుందని పరిశోధకుల మాటలను బట్టి తెలుస్తుంది.

Sunday 29 January 2017

అక్కడి నీరు త్రాగితే కేన్సర్ గ్యారెంటీ

నీరు.. పంచభూతాల్లో ఒకటి. మనిషికి అత్యంత అవసరమైన వనరు. ఇదిలేకుండా మనిషి ఉండలేడు. సాధారణంగా ఎవరైనా ఒక ఇంటిని నిర్మించుకున్నాముందు నీటితోనే ప్రారంభిస్తారు. అంటే ఇంటి నిర్మాణానికి ముఖ్యమైన వాటిలో నీరు కూడా ఒకటి కనుక. కానీ ఇక్కడ మనం త్రాగే నీటి గురించి మాట్లాడుకుంటే, ఏదైనా అద్దె ఇంటికి వెళితే అక్కడ నీటి సౌకర్యం ఎలా ఉంటుందని ఆరా తీస్తారు. అందరూ మంచినీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కొన్ని చోట్ల మంచినీరు లేకపోతే వస్తున్న నీటినే పలు విధాలుగా శుభ్రం చేసుకుని త్రాగుతారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ మంచినీరు లభ్యం కాకపోవడంతో అక్కడి ప్రజలు ప్రమాదం అంచున జీవిస్తున్నారనే చెప్పాలి. దీని వలన వారు తరచూ అనారోగ్యాలకు గురి కావడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.


చాలా పెద్ద నగరాలు, పట్టణాలు సైతం నీటి కాలుష్యంలో కూరుకుపోవడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు కొన్ని ప్రధాన పట్టణాల్లో నీటిని త్రాగితే ఆ నీటి వలన ప్రజలు ప్రాణాంతక వ్యాధులకు గురి కావచ్చనేది విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్.. దక్షిణాదిలోని ఈ నాలుగు ప్రధాన నగరాల్లో నీళ్లు తాగితే కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేసిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైంది. ఈ నాలుగు నగరాల్లో ఉన్న భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ అనే విషపదార్థం చాలా ఎక్కువ స్థాయిలో ఉందని, ఎక్కువ కాలం పాటు ఈ నీళ్లు వాడటం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు ఎక్కువవుతాయని అన్నారు.

Saturday 28 January 2017

వృషణాలపై కంతులు ప్రమాదం


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పురుషుల్లో వృషణాలపై ఏర్పడే కంతులు,Testicular Tumours- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి .



                        పురుషులకు మాత్రమే పరిమితమైన సమస్య .. వృషణాలపై కంతులు ఏర్పడటం. వృషణాలపై ఏర్పడే కంతులు కేన్సర్‌ కానివి కావచ్చు.లేదా కేన్సర్‌ కంతులైనా కావచ్చు. వృషణాలపై కంతులు ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశాలున్నప్పటికీ, సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. లేదా యుక్తవయస్సులోకి త్వరగా అడు గిడిన మగపిల్లల్లో కనిపిస్తాయి.వృషణాలపై ఏర్పడే ఈ కంతుల్లో అత్యధిక శాతం కేన్సర్‌ కాని కంతులే ఉంటాయి.

Friday 27 January 2017

గ్రీన్ టీ తో కేన్సర్ పరార్

ప్రపంచంలో నీరు తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం టీ మాత్రమే. ఇటీవలి కాలంలో గ్రీన్ టీ విస్తృత ప్రచారంలో ఉంది. ఇప్పుడు గ్రీన్ టీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతున్నారు సైంటిస్టులు. గ్రీన్ టీ ఓ అద్భుత ఆరోగ్య సంపద. ఏకంగా కేన్సర్ లాండి డెడ్లీ డిసీజెస్ కూడా గ్రీన్ టీ పేరు చెబితే ఆమడ దూరం పారిపోతాయట. గ్రీన్ టీ లో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.





             
 అయితే ఈ ప్రయోజనాలన్నీ దక్కాలంటే టీ సరిగ్గా చేయాలంటున్నారు నిపుణులు. కప్పు టీ కోసం ఓ టీ బ్యాగ్ లేదా నాలుగు గ్రాముల టీ పొడి వాడాలి. రోజుకు మూడు కప్పుల గ్రీన్ టీ తాగిన పురుషుల జోలికి కేన్సర్ రాలేదట. ఇక నాలుగు కప్పుల గ్రీన్ టీ తో రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ కూడా మాయమౌతుంది. ఐదు కంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ మళ్లీ రాకపోవడమే కాకుండా.. వ్యాధి వ్యాప్తి చెందే సమయం కూడా బాగా తగ్గినట్లు గుర్తించారు పరిశోధకులు.

Thursday 26 January 2017

గర్భ నిరోధక మాత్రలతో కేన్సర్‌ నుంచి రక్షణ

 గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల మహిళలకు అండాశయ కేన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 2002 నుంచి 2012 మధ్య అండాశయ కేన్సర్‌ వల్ల చనిపోయే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిందని, గర్భనిరోధక మాత్రలు వాడటమే ముఖ్య కారణమని ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిలన్‌ పరిశోధకులు వెల్లడించారు.

అమెరికా, ఈయూ, బ్రిటన్‌, జపాన్‌, తదితర దేశాల్లో 1970 నుంచి జరిగిన పలు అధ్యయనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. ఈ కేన్సర్‌ మరణాల రేటు బాగా తగ్గిందని గుర్తించారు. 2002-12 మధ్య ఈ కేన్సర్‌ మరణాల రేటు ఈయూలో 10 శాతం, అమెరికాలో 16 శాతం, కెనడాలో 8 శాతం, జపాన్‌లో 2 శాతం, ఆసే్ట్రలియా, న్యూజీలాండ్‌లలో 12 శాతం, బ్రిటన్‌లో 22 శాతం తగ్గినట్లు గుర్తించారు.

కొబ్బరినూనె కేన్సర్ కు దివ్య ఔషధం

కొబ్బరినూనె దివ్య ఔషధం అంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. అవును, కొబ్బరినూనె వాడితే రోజుల వ్యవధిలోనే 90శాతం పేగు కేన్సర్ దూరమవుతుందట. అమెరికన్ కేన్సర్ సొసైటీ ఆధ్వర్యంలో 95, 270 కేసుల్ని పరిశోధించన వైద్యులు, ఆపరేషన్, రేడియేషన్, కీమోథెరపీ కంటే కొబ్బరినూనె వాడకమే మేలని నిర్థారించారు. రేడియేషన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ కొబ్బరి నూనె వాడకం ద్వారా రావని తేలింది. కొబ్బరి నూనెతో చేసిన ప్రకృతి సిద్ధమైన వైద్యానికి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కేన్సర్ సెల్స్ నాశనం అయ్యాయి. కొబ్బరినూనెలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని అమెరికన్ శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు. బాగా పెరిగిన కొబ్బరికాయ కంటే, పెరిగీ పెరగకుండా ఉండే కొబ్బరికాయనుంచి తీసే ఆయిల్ ఇంకా శక్తిమంతంగా పనిచేస్తుంది.



కొబ్బరినూనెలోని లారిక్ యాసిడ్ కేన్సర్ నాశక గుణాలను కలిగి ఉంటుంది. ఈ లారిక్ యాసిడ్ తల్లిపాలలో కూడా కనపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణం కూడా దీనికి ఉంది. కేన్సర్ నిరోధక గుణాలే కాకుండా, ఫంగస్, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిముల వల్ల కలిగే వ్యాధుల్ని అరికట్టే గుణం కొబ్బరినూనెకు ఉందని తేలింది. చక్కెర వ్యాధినే కాకుండా రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను కూడా కొబ్బరినూనె క్రమబద్ధీకరిస్తుందని అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గుండె జబ్బులను కూడా ఇది సమర్థవంతంగా నివారించగలదని చెబుతున్నారు. యూనివర్సిటి ఆఫ్ అడిలైడ్ లో కొబ్బరినూనెపై చేసిన శాస్త్ర పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగు చూశాయి. అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ నిర్వహించిన పరిశోధనల్లో కూడా కొబ్బరినూనె అనేక దివ్య ఔషధ గుణాలను కలిగి ఉందని కనుగొన్నారు.

Tuesday 24 January 2017

పిత్తాశయ కేన్సర్‌ రోగుల జీవితకాలం పెంచొచ్చు!

పిత్తాశయ కేన్సర్‌ బాధితులకు శస్త్రచికిత్స, ఆపై కీమోథెరపీ చికిత్స అందించడం ద్వారా వారి జీవిత కాలాన్ని మూడు రెట్లు పెంచవచ్చని సంజయ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, లఖ్‌నవ్‌  పరిశోధకులు తెలిపారు. గంగా సింధూ నదీతీర ప్రాంతాల్లో నివసించే మహిళల్లో పిత్తాశయ కేన్సర్‌ సాధారణంగా ఎక్కువన్నారు. ఈమేరకు మూడేళ్లపాటూ జరిగిన సుదీర్ఘ పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని ఇనిస్టిట్యూట్‌కు చెందిన రాజన్‌ సక్సేనా తెలిపారు. ఈ బాధితులకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కేన్సర్‌ కణుతులను తొలగిస్తామని వివరించారు.

అయితే, కేన్సర్‌ కణితిని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని తెలిపారు. పిత్తాశయం నుంచి ఇతర అవయవాలకు విస్తరించిన సందర్భాలలో ఇది మరింత క్లిష్టంగా మారుతుందని వివరించారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స తర్వాత మిగిలిపోయిన కేన్సర్‌ కణుతులను అణిచేసేందుకు కీమోథెరపీ ఉపయోగపడుతుందని, తద్వారా బాధితుల జీవితకాలం పెరుగుతుందని సక్సేనా వివరించారు.

Monday 23 January 2017

లివర్ కేన్సర్ కు పవర్ ఫుల్ వైద్యం

శరీరంలోని కీలక అవయవాల్లోకెల్లా అతి పెద్దది, అతి ముఖ్యమైనది కాలేయం. ఆ అవయవమే కేన్సర్ బారిన పడితే? ఒకప్పుడైతే ఇది కలవరపెట్టే విషయమే. కానీ, ఆధునిక వైద్య విధానాలు ప్రవేశించాక ఇప్పుడా సమస్య మునుపటిలా కలవరపెట్టే అంశం కాకుండా పోయింది. ప్రత్యేకించి సర్జరీలోనూ, కీమో, రేడియేషన్ థెరపీల్లో
వచ్చిన ఆధునిక రీతులు కాలేయ సంబంధమైన కేన్సర్‌ను అధిగమించడం సులభతరం చేశాయి. కాకపోతే, లివర్ కేన్సర్ అనగానే డిప్రెషన్‌లోకి జారిపోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, విధిగా వైద్య చికిత్సలు తీసుకుంటే లివర్ కేన్సర్ నుంచి సంపూర్ణంగా విముక్తి పొందడం సాధ్యమేనంటున్నారు కేన్సర్ వ్యాధి నిపుణులు.



         కేన్సర్ వ్యాపించిన పరిధిని అనుసరించి వేరు వేరు సర్జరీ విధానాలు ఉంటాయి. కాకపోతే, లివర్ కేన్సర్ వచ్చిన వారిలో ఎక్కువ మంది సిరోసిస్ సమస్య ఉన్నవారే ఉంటారు. వారిలో లివర్‌లోని మిగతా భాగం కూడా దెబ్బ తినిపోయి ఉంటుంది. పైగా రక్తస్రావానికి సంబంధించి, రక్తం గడ్డ క ట్టడానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉంటాయి. అందుకే వీరిలో చాలా మందికి శస్త్ర చికిత్స చేయలేం. సర్జరీ ద్వారా కణితినీ, దెబ్బ తిన్న భాగాన్నంతా తొలగిస్తే మిగతా లివర్ శరీరానికి సరిపోదు. ఇలాంటి స్థితిలో లివర్ మార్పిడి చికిత్సే మార్గంగా ఉంటుంది. ఒకవేళ కేన్సర్ కణితి ఉన్నా, మిగతా లివర్ అంతా బాగానే ఉంటే అప్పుడు ఆ కణితిని మాత్రమే తొలగించే హెపాటిక్ రిసెక్షన్ సరిపోతుంది.

సిటీ లేడీస్ కే కేన్సర్ ఎక్కువ

కేన్సర్ అనేది ఒక వ్యాధి కాదు. ఇది సోకిందని తెలిసే నాటికే దాని తీవ్రత పెరిగి ఉండడం కేన్సర్ వ్యాధికి ఉన్న ప్రధాన లక్షణం. శరీరంలోని ట్రిగ్గర్ కణాలు కణవిభజనపై నియంత్రణ కోల్పోవడంతో కేన్సర్ ప్రారంభమవుతుంది. సంబంధిత పరీక్షల ఆధారంగా వ్యాధి ఉందని, అవయవం ఆధారంగా రకాన్ని తెలుసుకొని సరైన చికిత్స అందిస్తే కేన్సర్‌ను అరికట్టొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. కేన్సర్ అనేది అనేక వ్యాధుల సముదాయం. వాటన్నింటికి ఒకే సాధరణ     టాయి. శరీరంలోని  ఏ భాగం నుంచి కేన్సర్ వచ్చిందో దాని ఆధారంగా వైద్యులు కేన్సర్ రకాన్ని నిర్ధారిస్తారు. తీవ్ర ఒత్తిడికి గురవ్వడం, పొగ తాగడం, ప్రతికూల పరిసరాల ప్రభావం, కొన్ని అంటువ్యాధులు, జన్యుపరంగా వచ్చే కొన్ని లక్షణాలు కేన్సర్‌కి కారణమవుతాయి.



                 ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 8లక్షల మంది మహిళలు గర్భాశయ, రొమ్ము కేన్సర్ భారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2030నాటికి ఏడాదికి 3.2మిలియన్ల మంది మహిళలు గర్భాశయ కేన్సర్ భారిన పడే అవకాశం ఉందని ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. మనదేశంలో మోనోపాజ్ దశ దాటకముందే మహిళల్లో రొమ్ము కేన్సర్ వస్తున్నట్లు గుర్తించారు. లక్షకు 102 కొత్త కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు. పల్లెల కంటే పట్టణాల్లోనే ఎక్కువ మంది కేన్సర్ భారిన పడుతున్నారు. మన దేశంలోను, చైనాలోనూ, రొమ్ము కేన్సర్ బాధితులు అధిక సంఖ్యలో నమోదవుతున్నారు. ఒకప్పుడు సంతానం లేని మహిళలకు, మోనోపాజ్ తరువాత బరువు ఎక్కువగా పెరిగే మహిళల్లో కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉండేది. కానీ నేడు గర్భాశయ కేన్సర్ గతంలో కంటే 25శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని, దీనిపై ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే మహిళల మనుగడకు ముప్పేనని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

Sunday 22 January 2017

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్

సర్వైకల్ కేన్సర్ ప్రపంచంలో మరెక్కడా లేనంతగా భారతదేశంలో మహిళలను హతమారుస్తోంది. కేన్సర్ రాకుండా వాక్సిన్ ద్వారా ముందుగానే నిరోధించే అవకాశం రూపొందిన తొలి కేన్సర్ రకం ఇదే. ఇందుకుగాను ఒకటి కాదు రెండు వ్యాక్సీన్లు ఉన్నాయి. అయినా కూడా భారతదేశంలో ఇది ఏటా 1,32,000 మంది మహిళలకు సోకుతోందని, ఇందులో 72వేల మంది దీనితో పోరాటంలో చనువు చాలిస్తున్నట్టు సర్వైకల్ కేన్సర్ ప్రీ కొలియేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని పూర్తిగా నిరోధించలేనప్పటికీ చక్కటి అవగాహన పెంపొందించుకోవడం ద్వారా దీనివల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.




        దేశంలో ఏటా 7 లక్షల మేరకు కేన్సర్ నూతన కేసులు బయటపడుతుండగా 3.5 లక్షలమంది కేన్సర్ కారణంగా మరణిస్తున్నారు. ఈ 7 లక్షల నూతన కేసుల్లో 2.3 లక్షలకుపైగా కేసులు పొగాకు వినియోగానికి సంబంధించినవి. గర్భాశయాన్ని మరియు జననాంగాన్ని కలిపే సెర్విక్స్ యొక్క కణజాలంలో చోటుచేసుకునే కేన్సర్‌ను సర్వైకల్ కేన్సర్ అని అంటారు. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఎలాంటి లక్షణాలను కనబరచకపోవచ్చు. క్రమం తప్పని పాప్ టెస్ట్‌ల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్‌ఫెక్షన్ దీనికి ప్రధాన కారణం.

Saturday 21 January 2017

పని ఒత్తిడితో కేన్సర్‌ ముప్పు!

 దీర్ఘకాలం పని ఒత్తిడితో ఉద్యోగం చేయడం వల్ల పురుషులలో కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. అగ్నిమాపక సిబ్బంది, కర్మాగారాలల్లో పనిచేసే ఇంజనీర్లు, ఏరోస్పేస్‌ ఇంజనీర్లు, మెకానిక్‌ ఫోర్‌మెన్లు, రైల్వే ఎక్వి్‌పమెంట్‌ రిపేర్‌ వర్కర్లకు కేన్సర్‌ ముప్పు అధికమని కెనడాలోని మోంట్రియల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం వారు కొంతమంది వ్యక్తులపై పరిశోధనలు జరిపారు.


        15-30 సంవత్సరాలు, 30 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం ఒత్తిడితో ఉద్యోగం చేసినవారు కేన్సర్‌ బారిన పడ్డారని, 15 సంవత్సరాల కన్నా తక్కువ కాలం ఉద్యోగం చేసిన వారిలో కేన్సర్‌ లక్షణాలు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో వృత్తిపరమైన బాధ్యతలు, అభద్రతా భావం, పోటీతత్వం, ప్రమాదకరమైన పరిస్థితులు, సవాళ్లు వంటి అంశాలు కూడా వారిలో కేన్సర్‌ ముప్పుకు దోహదం చేస్తున్నాయని చెప్పారు.

Friday 20 January 2017

పిత్తాశయ కేన్సర్ రోగులకు గుడ్ న్యూస్

పిత్తాశయ కేన్సర్‌ బాధితులకు శస్త్రచికిత్స, ఆపై కీమోథెరపీ చికిత్స అందించడం ద్వారా వారి జీవిత కాలాన్ని మూడు రెట్లు పెంచవచ్చని సంజయ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, లఖ్‌నవ్‌  పరిశోధకులు తెలిపారు. గంగా సింధూ నదీతీర ప్రాంతాల్లో నివసించే మహిళల్లో పిత్తాశయ కేన్సర్‌ సాధారణంగా ఎక్కువన్నారు. ఈమేరకు మూడేళ్లపాటూ జరిగిన సుదీర్ఘ పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని ఇనిస్టిట్యూట్‌కు చెందిన రాజన్‌ సక్సేనా తెలిపారు. ఈ బాధితులకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కేన్సర్‌ కణుతులను తొలగిస్తామని వివరించారు.

అయితే, కేన్సర్‌ కణితిని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని తెలిపారు. పిత్తాశయం నుంచి ఇతర అవయవాలకు విస్తరించిన సందర్భాలలో ఇది మరింత క్లిష్టంగా మారుతుందని వివరించారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స తర్వాత మిగిలిపోయిన కేన్సర్‌ కణుతులను అణిచేసేందుకు కీమోథెరపీ ఉపయోగపడుతుందని, తద్వారా బాధితుల జీవితకాలం పెరుగుతుందని సక్సేనా వివరించారు.

Thursday 19 January 2017

ఓరల్‌ సెక్స్‌తో హెడ్‌ కేన్సర్‌!

ఓరల్‌ సెక్స్‌ అనేది సెక్స్‌లో ఒక రకం. అంగాన్ని నోట్లో పెట్టుకొని ఛూషణ చేయడం లేదా నాలుకతో, నోటితో అంగాన్ని ఛూషించడం వంటి విధానాలను ఓరల్‌ సెక్స్‌ అంటారు. నిజానికి ఈ తరహా లైంగిక విధానంలో సంతృప్తి ఎక్కువగా వుంటుందని చెపుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. పలుమార్లు ఓరల్‌ సెక్స్‌ చేయడం వల్ల హెడ్‌ కేన్సర్‌, అలాగే నెక్‌ కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం వుందని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది.


             ఓరల్‌ సెక్స్‌ చేయడం వల్ల హ్యూమన్‌ పపిల్లోమావైరస్‌ అనే ప్రాణాంతక వైరస్‌ శరీరంలో ప్రవేశిస్తుందని పరిశోధకులు తెలిపారు. హ్యూమన్‌ పపిల్లోమావైరస్‌ కు, హెడ్‌ కేన్సర్‌ లేదా నెక్‌ కేన్సర్‌లకు దగ్గరి సంబంధం వుందని తేల్చిచెప్పారు. 97,000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. దీంతో తేలిందేంటంటే, హ్యూమన్‌ పపిలోమావైరస్‌  ఏ విధంగానైనా, ఏ మనిషికైనా సోకవచ్చని, అయితే ఓరల్‌ సెక్స్‌ చేసేవారిలో ఏడు రెట్లు వేగవంతంగా ఈ వైరస్‌ సోకి, ప్రాణాలను హరిస్తుందని నిర్ధారించారు.

Wednesday 18 January 2017

రాష్ర్టాన్ని కేన్సర్‌ కమ్మేస్తోంది

తినే తిండి కల్తీ! పీల్చే గాలి కల్తీ! తాగే నీరు కూడా కల్తీ! వీటితోపాటు అనారోగ్యకరమైన జీవనశైలి! కారణమేదైనా గానీ.. తెలంగాణ రాష్ట్రంలో కేన్సర్‌ రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతుందన్నది మాత్రం చేదునిజం! ఆరోగ్యశ్రీ పథకంలో కేన్సర్‌ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ప్రభుత్వం గత నెలలో నిర్వహించిన బ్రెస్ట్‌కేన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష ల్లోనూ కేన్సర్‌ రోగులు పెరుగుతున్నట్లు తేలుతోంది. మరోవైపు కేన్సర్‌ చికిత్సల వల్ల ప్రజలపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా ఆర్థికంగా భారం అధికం అవుతోంది.


                రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లోని మహిళలకు బ్రెస్ట్‌ కేన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే.. రాష్ట్రంలో కేన్సర్‌ వ్యాధి ఆందోళన కలిగించేలా విస్తరిస్తోందని తెలుస్తోంది. 

Tuesday 17 January 2017

ప్రోస్టేట్‌ కేన్సర్‌కు సరికొత్త చికిత్స

ప్రోస్టేట్‌ కేన్సర్‌ మరణాలను నియంత్రించే ఓ కొత్త వ్యవస్థను శాస్త్రవేత్తలు అభిృద్ధి చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలు కొంతమంది రోగులపై పనిచేయడం లేదు.. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటనే విషయం వైద్యులకు అంతుపట్టడం లేదు. ఈ నేపథ్యంలో కణాలలో సిగ్నలింగ్‌ సర్క్యూట్‌ను లక్ష్యంగా చికిత్స చేస్తే ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న కేన్సర్‌ మరణాలలో ప్రోస్టేట్‌ కేన్సర్‌ రెండో స్థానంలో ఉంది.


 ఊపిరితిత్తుల కేన్సర్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. ప్రోస్టేట్‌ కేన్సర్‌ దాని తరువాతి స్థానంలో ఉంది. ఈ క్రమంలో కొత్త ఆవిష్కరణ ద్వారా ప్రోస్టేట్‌ కేన్సర్‌ బాధితులకు చికిత్స అందించవచ్చని ‘ది స్ర్కిప్స్‌ పరిశోధక సంస్థ’ పేర్కొంది. ఈ సర్క్యూట్‌లోని ఎన్‌ఎఫ్‌-కేబి ప్రొటీన్‌ కేన్సర్‌ కణితి పెరుగుదలకు తోడ్పడుతుందని కనుగొన్నట్లు స్ర్కిప్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జున్‌ లి లుయో తెలిపారు. గతంలో ఈ కేన్సర్‌ కణితికి అందే పోషకాలను నియంత్రించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని చెప్పారు. కొంతకాలం తర్వాత కేన్సర్‌ కణితి దీనికి నిరోధకత సంతరించుకుంటుందని, ఫలితంగా వ్యాధి నియంత్రణ కష్టంగా మారుతుందని జున్‌ వివరించారు. తాజా అధ్యయనంలో ఈ ఇబ్బందిని తొలగించే మార్గాన్ని కనుగొన్నట్లు వారు తెలిపారు.

Sunday 15 January 2017

పట్టణాల్లోని మహిళలకే కేన్సర్ ముప్పు

కేన్సర్ వ్యాధి ప్రాణాంతకమైందని తరచూ వింటాం. అయితే ఈ వ్యాధి నుంచి కాపాడుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ అవకాశాలపై సరైన అవగాహన ఉంటే కేన్సర్ భయం లేకుండా హాయిగా జీవించొచ్చు. కేన్సర్ వ్యాధి తొలిదశలో కనిపించే లక్షణాలకు సంబంధించిన పరిజ్ఞానం, ఆ లక్షణాలు కనిపించిన తరువాత తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, చికిత్సల గురించి చాలా మందికి తెలియదు. కేన్సర్ లక్షణాలను పసిగట్ట లేక అవేవో ఇతర వ్యాధి లక్షణాలుగా భావించడంతో ప్రాణం మీదకొస్తుంది.
         


కేన్సర్ అనేది ఒక వ్యాధి కాదు. ఇది సోకిందని తెలిసే నాటికే దాని తీవ్రత పెరిగి ఉండడం కేన్సర్ వ్యాధికి ఉన్న ప్రధాన లక్షణం. శరీరంలోని ట్రిగ్గర్ కణాలు కణవిభజనపై నియంత్రణ కోల్పోవడంతో కేన్సర్ ప్రారంభమవుతుంది. సంబంధిత పరీక్షల ఆధారంగా వ్యాధి ఉందని, అవయవం ఆధారంగా రకాన్ని తెలుసుకొని సరైన చికిత్స అందిస్తే కేన్సర్‌ను అరికట్టొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. కేన్సర్ అనేది అనేక వ్యాధుల సముదాయం. వాటన్నింటికి ఒకే సాధరణ లక్షణాలుంటాయి. శరీరంలోని ఏ భాగం నుంచి కేన్సర్ వచ్చిందో దాని ఆధారంగా వైద్యులు కేన్సర్ రకాన్ని నిర్ధారిస్తారు.

Saturday 14 January 2017

రోజుకో మాత్రతో కేన్సర్‌ ఔట్‌

ప్రాణాంతక కేన్సర్‌కు చికిత్స లభించిందా? ఒళ్లు గుల్ల చేసే థెరపీలు లేకుండానే రోజుకో మాత్రతో నయమవుతుందా? ఈ ప్రశ్నలకు ఆస్ట్రేలి యా శాస్త్రవేత్తలు ఔననే సమాధానమే ఇస్తున్నారు. వెన్‌క్లెక్‌స్టా పేరుతో తాము తయారు చేసిన ఈ మా త్రలను రోజుకొకటి వేసుకుంటే చాలు.. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుం డానే కేన్సర్‌ను మటుమాయం చేయవచ్చని మెల్‌బోర్న్‌ కేంద్రంగా పనిచే స్తున్న వెనెటోక్లాక్స్‌ కంపెనీ ప్రకటించింది. ఈ ఔషధానికి ఆస్ట్రేలియా థెరప్యూటిక్‌ రెగ్యులేటరీ అథారిటీ  అనుమతి కూడా లభించిందట. కేన్సర్‌కు శస్త్రచికిత్స, కీమో, రేడియోథెరపీల వంటి వైద్య విధానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.



         ఇవన్నీ వ్యయ, ప్రయాసలతో కూడుకున్నవే. ఈ నేపథ్యంలో వెనెటోక్లాక్స్‌ ఆవిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంది. కేన్సర్‌ కణాల్లో బీసీఎల్‌–2 ప్రొటీన్‌ ఉంటుంది. వ్యాధి కారక కణాలు బతికి ఉండేందుకు ఈ ప్రొటీనే కారణం. దాన్ని నిర్వీర్యం చేసేందుకు 30 ఏళ్లుగా  ప్రయత్నాలు జరుగుతున్నా.. ఫలితం రాలేదు. అయితే వెనెటోక్లాక్స్‌కు చెందిన డాక్టర్‌ డేవిడ్‌ హువాంగ్‌ ఈ విషయంలో విజయం సాధించారు. బీసీఎల్‌–2 ప్రొటీన్‌ పనిచేయకుండా చేయడమే కాకుండా.. కేన్సర్‌ కణం  మరణించేలా ఔషధాన్ని రూపొందించారు. దీన్ని రోజుకో మాత్ర రూపంలో తీసుకుంటే సరిపోతుందని హువాంగ్‌ అంటున్నారు.

Friday 13 January 2017

మహిళల పాలిట శాపం బ్రెస్ట్ కేన్సర్

రొమ్ము కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపంగా పరిణమించింది. ఎందుకు, ఎప్పుడు వస్తుందో కారణాలు తెలియడం లేదు. ఒకప్పుడు నలభై ఐదేళ్లు దాటితేగానీ మహిళల్లో రొమ్ము కేన్సర్ పెద్దగా కనిపించేది కాదు. ఇప్పుడు ముప్ఫై దాటితే చాలు వస్తోంది. మన దేశంలో ఏటా రెండు లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలోనూ రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతోంది.


           ముఖ్యంగా రొమ్ము కేన్సర్ బాధితులు నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రొమ్ము కేన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కొద్దిపాటి అవగాహన ఉంటే చాలని అంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర కారణంగా వచ్చే అవకాశాలున్నాయి. పొగతాగడం, మద్యం సేవించే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. చిన్నవయసులోనే పెళ్లిళ్లు, పిల్లలు పుట్టడం వల్ల కూడా ఈ ప్రభావం ఉంటుంది.

Thursday 12 January 2017

కాల్చిన మాంసంతో రొమ్ము కేన్సర్

రొమ్ము కేన్సర్‌ బారినపడి కోలుకున్న వారికి కాల్చిన మాంసం  ప్రాణాంతకంగా మారుతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ మేరకు 1508 మందిపై జరిపిన ఆధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో భాగంగా వలంటీర్ల ఆహారపు ఆలవాట్లను తెలుసుకునేందుకు ఓ ప్రశ్నపప్రతాన్ని తయారు చేశారు. దీనిని బాధితులకు ఇచ్చి సమాధానాలు రాబట్టారు.


ఆపై ఫలితాలను విశ్లేషించగా, అత్యధిక  ఉష్ణోగ్రతల వద్ద కాల్చిన మాసం తీసుకున్న వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని తేలిందన్నారు. అందరూ ఇష్టంగా తినే గ్రిల్డ్ చికెన్ కు కేన్సర్ రోగులు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కేన్సర్ నుంచి కోలుకున్నవాళ్లు కూడా వెంటనే గ్రిల్డ్ చికెన్ తింటే డేంజరే అంటున్నారు.

Wednesday 11 January 2017

బ్లడ్ కేన్సర్ కు సరైన మందు

అత్యంత ప్రమాదకర బ్లడ్ కేన్సర్ నయం చేయడానికి అద్భుతమైన మత్ర త్వరలోనే ప్రపంచ మార్కెట్లోకి రాబోతోంది. మెల్ బోర్న్ వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ ఈ మాత్రను రూపొందించి వెనటోక్లాక్స్ అని పేరు పెట్టింది. ఈ మాత్రను డోసేజ్ ప్రకారం వాడితే కేన్సర్ కణాలు కరిగిపోతాయి. వాస్తవానికి ఈ మందు 1980లోనే కనిపెట్టినా.. ముందు జంతువులపై ప్రయోగాలు జరిపి, కేన్సర్ రోగులపై కూడా ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించడానికి ఇంతకాలం పట్టింది.




          కేన్సర్ కణాలను ప్రోత్సహించే బీసీఎల్-2 ప్రోటీన్ ను నాశనం చేయడం ద్వారా తమ డ్రగ్ కేన్సర్ కణాలను కరిగిపోయేలా చేస్తుందని మాత్రను తయారుచేసిన నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి మందులతో కూడా కేన్సర్ నయంకాని లింపోటిక్ లుకేమియాతో బాథపడుతున్న 116 మంది రోగులను ఎంపిక చేసుకుని వెనెటోక్లాక్స్ మాత్రలను రెండేళ్ల పాటు ఇచ్చి చూశామని, దాదాపు 80 శాతం మందికి కేన్సర్ తగ్గిపోయిందంటున్నారు పరిశోధకులు.

వైట్ వైన్ తో కేన్సర్ గ్యారెంటీ

వైట్‌ వైన్‌ తాగే అలవాటు ఉందా? అయితే దానికి స్వస్తి చెప్పండి. మద్యం ముఖ్యంగా వైట్‌ వైన్‌ తాగేవారికి చర్మ సంబంధమైన కేన్సర్‌ వస్తుందిట. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎండవేడిమి తగలని భాగాలపై ఈ రిస్కు మరింత ఎక్కువగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెప్పారు. వైట్‌ వైన్‌ తాగే వారికి మెలనొమా కేన్సర్‌ రిస్కు ఎక్కువగా పొంచి ఉందట. అమెరికాలోని రోడె ఐలండ్స్‌లోని వారల్‌ అల్‌పర్ట్‌ మెడికల్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ యూనీయంగ్‌ ఛో ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు.


ప్రపంచ వ్యాప్తంగా 3.6 శాతం కేన్సర్‌ కేసులు ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల వస్తున్నాయి. ఆల్కహాల్‌ వినియోగం వల్ల డిఎన్‌ఎ దెబ్బతినడమే కాకుండా డెన్‌ఎ రిపైర్‌ కూడా అసాధ్యమవుతుందిట. రోజూ వైట్‌వైన్‌ తీసుకుంటే మెలనోమా కేన్సర్‌ బారినపడే అవకాశం 13 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Monday 9 January 2017

క్యాన్సర్ అంటే ఏంటి..?

క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది దగ్గరి సంబంధం వున్న అనేక వ్యాధుల సముదాయం. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాల సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరము. కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.... శరీరానికి అవసరం లేక పోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాల సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపారకరమైనవికాదు. కొన్ని నిరపాయకరమైనవి కూడా వుంటాయి.




నిరపాయకరమైన కంతులను క్యాన్సరు గడ్డలు అనరు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు. ఇవి సాధారణంగా తిరగబెట్టవు. ఈ గడ్డలోని కణాలు శరీరంలోని వేరే అవయవాలకు వ్యాపించవు. అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇవి ప్రాణాంతకం కాదు. అపాయకరమైన కంతులలోని కణాలు అసాధారణంగా వుంటాయి. ఇంకా ఇవి నియంత్రణ లేకుండా విభజన చెందుతూ పోతాయి. ఇవి తమ చుట్టూ వున్న కణజాలం లోనికి చొచ్చుకొనిపోయి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ క్యాన్సరు కణాలు కంతుల నుంచి విడిపోయి దూరంగా రక్తస్రావం లోకి లేదా శోషరస వ్యవస్థలోకి చేరుతాయి. రక్తనాళాల చివరి నిర్మాణంలో రక్తనాళికలు, సిరలు ధమనులు అన్ని కలిసి వుంటాయి. వీటి ద్వారానే రక్తం శరీరంలోని అన్నిభాగాలకూ వెళుతుంది.

కేన్సర్ కు ఎన్నో కారణాలు

కణాలలోని జన్యువులలో కలిగే మార్పుల వలన సాధారణంగా కణాలు కలిగే మార్పుల వలన సాధారణంగా కణాల విభజన, పెరుగుదల, క్షీణించడం వంటి అంశాలపై నియంత్రణ కోల్పోతాయి. కొన్ని రకాల జీవిత విధానాలు, వాతావరణ మార్పుల మూలంగా సాధారణంగా వుండవలసిన జన్యువులు క్యాన్సరు పెరగడానికి అనుమతించేవిగా మారుతాయి. ఈ విధమైన జన్యు మార్పులకు ధూమపానం, ఆహారపుటలవాట్లు, సూర్యరశ్మిలోని అయనీకరణ వికిరణాలు క్యాన్సరుకు కారణమయ్యే కొన్ని పదార్థాలు.



         అనువంశికంగా జన్యువులలో వచ్చే మార్పుల వల్ల తప్పనిసరిగా అపాయకరమైన గడ్డలు ఏర్పడతాయని ఖచ్చితంగా చెప్పలేము కానీ, వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పవచ్చు. శాస్త్రజ్ఞులు ఈ విషయమై క్యాన్సరు వచ్చే అవకాశాలు ఎక్కువ లేక తక్కువ చేసే అంశాలను ఇంకా పరిశోధిస్తున్నారు. కొన్ని వైరసుల సూక్ష్మక్రిమి సంపర్కం మూలంగా క్యాన్సరు వచ్చే అవకాశాలు, అపాయం ఎక్కువ కావచ్చును కానీ, క్యాన్సరు అంటువ్యాధి కాదు. క్యాన్సరు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. గాయాలు, కందిపోయిన భాగం నుంచి క్యాన్సరు పుట్టదు.

Sunday 8 January 2017

బోన్ కేన్సర్‌తో ముప్పే లేదు


బోన్ కేన్సర్లు అంటే అవి కేవలం ఎముకల్లో పుట్టేవి మాత్రమే కాదు. కొన్ని సార్లు ఇతర భాగాల్లో ఉన్న కేన్సర్లు కూడా ఎముకలకు పాకవచ్చు. అలాగే ఎముకల్లో పుట్టిన కేన్సర్ ఇతర భాగాలకూ పాకవచ్చు . అయితే ఈ కేన్సర్లు అన్నింటికీ చాలా వేగంగా వ్యాపించే లక్షణం ఒక టుంది. ఎప్పుడైనా పిల్లలు ఎక్కువ రోజులు కుంటుతూ నడుస్తూ ఉంటే, ఏదోలే అనుకుంటే ఒక్కోసారి ప్రమాదం ముంచుకు రావచ్చు.అప్పుడెప్పుడో దెబ్బ తగిలిన తాలూకు నొప్పే అనుకుంటే అది ఆ తరువాత బాగా ముదిరిపోయిన బోన్ కేన్సర్ కావచ్చు అందుకే ఈ విషయమై ఎంత తొందరగా డాక్టర్‌ను సంప్రదిస్తే, అంత శ్రేయస్కరం.



ఎముకల్లో రెండు రకాల కేన్సర్ కణుతులు వస్తూ ఉంటాయి. వీటిని ప్రైమరీ, సెకండరీ బోన్ కేన్సర్స్ అంటూ ఉంటాం. ఎముకల్లో పుట్టేవి ఒక రకమైతే, శరీరంలోని ఇతర భాగాల్లో పుట్టి ఎముకల్లోకి పాకేవి రెండో రకం. అయితే ఎముకల్లో పుట్టే కేన్సర్ కణుతులు తక్కువే కాని. బయట ఎక్కడో పుట్టి, ఎముకల్లోకి విస్తరించేవే ఎక్కువ.
నిజానికి అన్ని రకాల కేన్సర్లూ ఎముకలకు పాకవచ్చు.అయితే కొన్నిరకాల కేన్సర్లు ప్రత్యేకించి, ప్రొస్టేట్ కేన్సర్ చాలా వేగంగా పాకుతుంది. అందుకే ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు తేలిన వారికి వెంటనే బోన్ స్కాన్ చేయించడం తప్పనిసరి అవుతుంది. అలాగే కిడ్నీ కేన్సర్, లంగ్ కేన్సర్, థైరాయిడ్ కేన్సర్, రొమ్ముకేన్సర్‌లు కూడా ఎముక లకు పాకే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ కారణంగానే రొమ్ము కేన్సర్‌కు వైద్యచికిత్సలు తీసుకున్న తరువాత కూడా ప్రతి ఏటా బోన్‌స్కాన్ సూచిస్తారు.

Saturday 7 January 2017

స్క్రీనింగ్ పరీక్షలతో కేన్సర్ చెక్



కేన్సర్‌ను ఆదిలోనే గుర్తించడం కన్నా గొప్ప ప్రయోజనం మరొకటి లేదు. ఒకప్పుడైతే, అలా ముందే గుర్తించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అందుకే కేన్సర్‌ బారిన పడిన ఎంతో మంది అర్థాంతరంగా తమ ప్రాణాలు కోల్పోయారు . అయితే, కేన్సర్‌ను తొలిదశలోనే అంటే లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షించే డైగ్నాసిస్‌ విధానాలు, లక్షణాలు కనిపించకముందే ఆ పరిస్థితుల్ని ముందే గుర్తించే స్ర్కీనింగ్‌ విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

                కేన్సర్‌ను జయించాలంటే కేన్సర్‌ను చాలా ముందుగా గుర్తించాలి. అలా ముందుగా గుర్తించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. వాటిలో కేన్సర్‌ మొదలైన తొలిదశలోనే గుర్తించే డైగ్నాసిస్‌ విధానాలు. రెండవది కేన్సర్‌ రాకముందే పరీక్షలు చేసే స్ర్కీనింగ్‌ విధానాలు.ఇందులో భాగంగా కేన్సర్‌ వ్యాధికి సంబంధించిన ముందస్తు హెచ్చరికల గురించిన అవగాహన పెంచుకోవడం, ఒకవేళ ఆ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం. ముందు ఫ్యామిలీ ఫిజిషియన్‌ను సంప్రదించి, అది కేన్సర్‌ అవునో కాదో ఒక నిర్ధారణకు రావడం చాలా ముఖ్యం. లక్షణాలు పదే పదే కనిపిస్తున్నప్పుడు మళ్లీ మళ్లీ పరీక్షలు చేయించుకోవడం అవసరం.

Friday 6 January 2017

పసుపుతో కేన్సర్ పరార్



పసుపుతో సర్వైకల్ కేన్సర్ ను నిరోధించే అద్భుతమైన మందును కోల్ కతాలోని చిత్తరంజన్ జాతీయ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు రూపొందించారు. పసుపులో ఉండే సర్కుమిన్ అనే రసాయనం హ్యూమన్ పాపిలోమా వైరస్ ను నిరోధిస్తుందని, ఒకవేళ ఆ వైరస్ బారినపడినా దాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ మహిళల్లో సర్వైకల్ కేన్సర్ కు కారణమవుతుంది.


హ్యూమన్ పాపిలోమా వైరస్, సర్వైకల్ కేన్సర్ తో బాధపడుతున్న 400 మంది మహిళలపై ఐదేళ్ల పాటు పరిశోధన చేశారు. పసుపు నుంచి సర్కుమిన్ ను తాము రూపొందించామని, ఇది వైరల్, హ్యూమన్ పాపిలోమా వైరస్ నిరోధకంగా పనిచేస్తుందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త పార్థాబసు తెలిపారు.

Thursday 5 January 2017

అమ్మో కేన్సర్..!

 ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 8లక్షల మంది మహిళలు గర్భాశయ, రొమ్ము కేన్సర్ భారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2030నాటికి ఏడాదికి 3.2మిలియన్ల మంది మహిళలు గర్భాశయ కేన్సర్ భారిన పడే అవకాశం ఉందని ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. మనదేశంలో మోనోపాజ్ దశ దాటకముందే మహిళల్లో రొమ్ము కేన్సర్ వస్తున్నట్లు గుర్తించారు. లక్షకు 102 కొత్త కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు.

       పల్లెల కంటే పట్టణాల్లోనే ఎక్కువ మంది కేన్సర్ భారిన పడుతున్నారు. మన దేశంలోను, చైనాలోనూ, రొమ్ము కేన్సర్ బాధితులు అధిక సంఖ్యలో నమోదవుతున్నారు. ఒకప్పుడు సంతానం లేని మహిళలకు, మోనోపాజ్ తరువాత బరువు ఎక్కువగా పెరిగే మహిళల్లో కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉండేది. కానీ నేడు గర్భాశయ కేన్సర్ గతంలో కంటే 25శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని, దీనిపై ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే మహిళల మనుగడకు ముప్పేనని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

Wednesday 4 January 2017

వాక్సిన్‌తో గర్భాశయ కేన్సర్‌ నివారణ



కేన్సర్‌ ప్రాణాంతక వ్యాధే అయినా అది రాకుండా అడ్డుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ ప్రయత్నాలు చేసే వారే తక్కువ. మిగతా కేన్సర్ల మాట ఎలా ఉన్నా, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ రాకుండా నిరోధించే వాక్సిన్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది. కాకపోతే ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందుకే వాక్సిన్లు తీసుకునే వారి సంఖ్య ఈ రోజుకీ చాలా తక్కువే ఉంది.


            ఇండియాలో వేగంగా విస్తరిస్తోన్న కేన్సర్‌లలో గర్భాశయ ముఖ ్దద్వార కేన్సర్‌ ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కేన్సర్‌ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు మెనోపాజ్‌ తరువాత కనిపించే ఈ కేన్సర్‌ ఇప్పుడు యుక్తవయస్సుల్లోనూ కనిపిస్తోంది. సర్వైకల్‌ కేన్సర్‌ నివారణకు వాక్సినేషన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే  వాక్సిన్‌పై చాలా మందికి అవగాహన లేదు. నిజానికి ఈ వాక్సిన్‌ వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. చాలా సురక్షితమైనది. ఈ వాక్సిన్‌ను పెళ్లికి ముందు తీసుకుంటే చాలా మంచిది.  9 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సులో బాలికలకు ఇప్పిస్తే వారు సర్వైకల్‌ కేన్సర్‌ బారినపడకుండా ఉంటారు. 40 ఏళ్ల వయస్సు లోపు వారు కూడా వాక్సిన్‌ తీసుకోవచ్చు.

Tuesday 3 January 2017

ప్రాణాంతక మహమ్మారి...కేన్సర్


కేన్సర్ అనేది ఒక వ్యాధి కాదు. ఇది సోకిందని తెలిసే నాటికే దాని తీవ్రత పెరిగి ఉండడం కేన్సర్ వ్యాధికి ఉన్న ప్రధాన లక్షణం. శరీరంలోని ట్రిగ్గర్ కణాలు కణవిభజనపై నియంత్రణ కోల్పోవడంతో కేన్సర్ ప్రారంభమవుతుంది. సంబంధిత పరీక్షల ఆధారంగా వ్యాధి ఉందని, అవయవం ఆధారంగా రకాన్ని తెలుసుకొని సరైన చికిత్స అందిస్తే కేన్సర్‌ను అరికట్టొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.





              కేన్సర్ అనేది అనేక వ్యాధుల సముదాయం. వాటన్నింటికి ఒకే సాధరణ లక్షణాలుంటాయి. శరీరంలోని ఏ భాగం నుంచి కేన్సర్ వచ్చిందో దాని ఆధారంగా వైద్యులు కేన్సర్ రకాన్ని నిర్ధారిస్తారు. తీవ్ర ఒత్తిడికి గురవ్వడం, పొగ తాగడం, ప్రతికూల పరిసరాల ప్రభావం, కొన్ని అంటువ్యాధులు, జన్యుపరంగా వచ్చే కొన్ని లక్షణాలు కేన్సర్‌కి కారణమవుతాయి.


Monday 2 January 2017

పురుషులకూ సర్వైకల్ కేన్సర్ టీకా



గర్భాశయ ముఖద్వార కేన్సర్ నిరోధక వ్యాక్సిన్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో మహా ప్రయత్నం జరగాలని నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ హరాల్డ్ జూర్ హాసెన్ పిలుపునిచ్చారు. సర్వైకల్ కేన్సర్‌కు హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణమని గుర్తించారు. హాసెన్ పరిశోధనలు ఆసరాగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్ అభివృద్ధి చెందింది. సర్వైకల్ కేన్సర్‌తోపాటు కొన్ని ఇతర రకాల కేన్సర్ల నివారణకు మల్టీవాలెంట్  వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.





            సర్వైకల్ కేన్సర్ నిరోధక వ్యాక్సిన్‌ను 15-30 ఏళ్ల మధ్య వయసు వారందరికీ వేస్తే ఫలితాలు బాగుంటాయన్నారు. ఈ వయసు పురుషులకు లైంగిక భాగస్వాములు ఎక్కువగా ఉండటం వల్ల వీరి ద్వారా హెచ్‌పీవీ వైరస్ ఎక్కువమంది మహిళలకు వ్యాపించే అవకాశముండటం దీనికి కారణమని వివరించారు. అందువల్ల ఈ వయసు పురుషులకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లయితే హెచ్‌పీవీ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.