Wednesday, 11 January 2017

బ్లడ్ కేన్సర్ కు సరైన మందు

అత్యంత ప్రమాదకర బ్లడ్ కేన్సర్ నయం చేయడానికి అద్భుతమైన మత్ర త్వరలోనే ప్రపంచ మార్కెట్లోకి రాబోతోంది. మెల్ బోర్న్ వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ ఈ మాత్రను రూపొందించి వెనటోక్లాక్స్ అని పేరు పెట్టింది. ఈ మాత్రను డోసేజ్ ప్రకారం వాడితే కేన్సర్ కణాలు కరిగిపోతాయి. వాస్తవానికి ఈ మందు 1980లోనే కనిపెట్టినా.. ముందు జంతువులపై ప్రయోగాలు జరిపి, కేన్సర్ రోగులపై కూడా ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించడానికి ఇంతకాలం పట్టింది.




          కేన్సర్ కణాలను ప్రోత్సహించే బీసీఎల్-2 ప్రోటీన్ ను నాశనం చేయడం ద్వారా తమ డ్రగ్ కేన్సర్ కణాలను కరిగిపోయేలా చేస్తుందని మాత్రను తయారుచేసిన నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి మందులతో కూడా కేన్సర్ నయంకాని లింపోటిక్ లుకేమియాతో బాథపడుతున్న 116 మంది రోగులను ఎంపిక చేసుకుని వెనెటోక్లాక్స్ మాత్రలను రెండేళ్ల పాటు ఇచ్చి చూశామని, దాదాపు 80 శాతం మందికి కేన్సర్ తగ్గిపోయిందంటున్నారు పరిశోధకులు.

No comments:

Post a Comment