Thursday, 12 January 2017

కాల్చిన మాంసంతో రొమ్ము కేన్సర్

రొమ్ము కేన్సర్‌ బారినపడి కోలుకున్న వారికి కాల్చిన మాంసం  ప్రాణాంతకంగా మారుతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ మేరకు 1508 మందిపై జరిపిన ఆధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో భాగంగా వలంటీర్ల ఆహారపు ఆలవాట్లను తెలుసుకునేందుకు ఓ ప్రశ్నపప్రతాన్ని తయారు చేశారు. దీనిని బాధితులకు ఇచ్చి సమాధానాలు రాబట్టారు.


ఆపై ఫలితాలను విశ్లేషించగా, అత్యధిక  ఉష్ణోగ్రతల వద్ద కాల్చిన మాసం తీసుకున్న వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని తేలిందన్నారు. అందరూ ఇష్టంగా తినే గ్రిల్డ్ చికెన్ కు కేన్సర్ రోగులు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కేన్సర్ నుంచి కోలుకున్నవాళ్లు కూడా వెంటనే గ్రిల్డ్ చికెన్ తింటే డేంజరే అంటున్నారు.

No comments:

Post a Comment