Friday, 20 January 2017

పిత్తాశయ కేన్సర్ రోగులకు గుడ్ న్యూస్

పిత్తాశయ కేన్సర్‌ బాధితులకు శస్త్రచికిత్స, ఆపై కీమోథెరపీ చికిత్స అందించడం ద్వారా వారి జీవిత కాలాన్ని మూడు రెట్లు పెంచవచ్చని సంజయ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, లఖ్‌నవ్‌  పరిశోధకులు తెలిపారు. గంగా సింధూ నదీతీర ప్రాంతాల్లో నివసించే మహిళల్లో పిత్తాశయ కేన్సర్‌ సాధారణంగా ఎక్కువన్నారు. ఈమేరకు మూడేళ్లపాటూ జరిగిన సుదీర్ఘ పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని ఇనిస్టిట్యూట్‌కు చెందిన రాజన్‌ సక్సేనా తెలిపారు. ఈ బాధితులకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కేన్సర్‌ కణుతులను తొలగిస్తామని వివరించారు.

అయితే, కేన్సర్‌ కణితిని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని తెలిపారు. పిత్తాశయం నుంచి ఇతర అవయవాలకు విస్తరించిన సందర్భాలలో ఇది మరింత క్లిష్టంగా మారుతుందని వివరించారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స తర్వాత మిగిలిపోయిన కేన్సర్‌ కణుతులను అణిచేసేందుకు కీమోథెరపీ ఉపయోగపడుతుందని, తద్వారా బాధితుల జీవితకాలం పెరుగుతుందని సక్సేనా వివరించారు.

No comments:

Post a Comment