Thursday, 5 January 2017

అమ్మో కేన్సర్..!

 ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 8లక్షల మంది మహిళలు గర్భాశయ, రొమ్ము కేన్సర్ భారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2030నాటికి ఏడాదికి 3.2మిలియన్ల మంది మహిళలు గర్భాశయ కేన్సర్ భారిన పడే అవకాశం ఉందని ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. మనదేశంలో మోనోపాజ్ దశ దాటకముందే మహిళల్లో రొమ్ము కేన్సర్ వస్తున్నట్లు గుర్తించారు. లక్షకు 102 కొత్త కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు.

       పల్లెల కంటే పట్టణాల్లోనే ఎక్కువ మంది కేన్సర్ భారిన పడుతున్నారు. మన దేశంలోను, చైనాలోనూ, రొమ్ము కేన్సర్ బాధితులు అధిక సంఖ్యలో నమోదవుతున్నారు. ఒకప్పుడు సంతానం లేని మహిళలకు, మోనోపాజ్ తరువాత బరువు ఎక్కువగా పెరిగే మహిళల్లో కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉండేది. కానీ నేడు గర్భాశయ కేన్సర్ గతంలో కంటే 25శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని, దీనిపై ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే మహిళల మనుగడకు ముప్పేనని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment