Monday, 2 January 2017

పురుషులకూ సర్వైకల్ కేన్సర్ టీకా



గర్భాశయ ముఖద్వార కేన్సర్ నిరోధక వ్యాక్సిన్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో మహా ప్రయత్నం జరగాలని నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ హరాల్డ్ జూర్ హాసెన్ పిలుపునిచ్చారు. సర్వైకల్ కేన్సర్‌కు హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణమని గుర్తించారు. హాసెన్ పరిశోధనలు ఆసరాగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్ అభివృద్ధి చెందింది. సర్వైకల్ కేన్సర్‌తోపాటు కొన్ని ఇతర రకాల కేన్సర్ల నివారణకు మల్టీవాలెంట్  వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.





            సర్వైకల్ కేన్సర్ నిరోధక వ్యాక్సిన్‌ను 15-30 ఏళ్ల మధ్య వయసు వారందరికీ వేస్తే ఫలితాలు బాగుంటాయన్నారు. ఈ వయసు పురుషులకు లైంగిక భాగస్వాములు ఎక్కువగా ఉండటం వల్ల వీరి ద్వారా హెచ్‌పీవీ వైరస్ ఎక్కువమంది మహిళలకు వ్యాపించే అవకాశముండటం దీనికి కారణమని వివరించారు. అందువల్ల ఈ వయసు పురుషులకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లయితే హెచ్‌పీవీ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

No comments:

Post a Comment