Wednesday 20 April 2016

నేలమర్రితో కేన్సర్ కు చెక్

కేన్సర్‌ అంటే వారికి తెలియదు. కానీ ఆదివాసీలు రొమ్ముపై వచ్చే గడ్డలను తగ్గించుకోవ డానికి  నేలమర్రి  ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను నూరి ముద్దచేసిపెట్టి కట్టు కడతారు. కొన్ని రోజుల్లోనే గడ్డలు తగ్గిపోతాయి. ఆధునిక పరిశోధకులు ఈ నేలమర్రి ఆకులను పరీక్షల నిమిత్తం అమెరికన్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి పంపారు. వారు నేలమర్రి ఆకులకు కేన్సర్‌ తగ్గించే గుణాలు ఉన్నాయని తెలియచేస్తూ ప్రాథమిక నివేదిక ఇచ్చారు.


                అలాగే మధుమేహం వ్యాధికి కూడా మూలికల ద్వారా అద్భుతమైన చికిత్స అందిస్తున్నారు గిరిజనులు. పాతాళ గరుడి, మారేడు చెట్టు, పొడపత్రి తీగ, ఇండుప చెట్టు- వీటి వేర్లతో పాటు ఆలం నేరేడు పిక్కలు, చండ్రచెట్టు పట్ట తీసుకుని యెండబెట్టి సమపాళ్లలో చూర్ణం చేసి, వన్త్రగాలితం చేసి చిటికెడు చూర్ణం చొప్పున రోజుకొకసారి వాడితే మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది.
               

నిత్య శృంగారంతో ప్రోస్టేట్ కేన్సర్ కు చెక్


మీరు ప్రొస్టేట్‌ కేన్సర్‌కు దూరంగా ఉందామనుకుంటున్నారా? ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్షా డబ్బై వేల మంది ఈ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని “వరల్డ్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ ఫండ్‌ సంస్థ” తెలియజేసింది. తాజాగ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ పై చేసిన పరిశోదనలో ప్రతి రోజు శృంగారంలో పాల్గొంటే ప్రొస్టేట్‌ క్యాన్సర్ ను నివారించవచ్చు అంటున్నారు వైద్యులు.

నెలలో దాదాపు 21 సార్లు వీర్య స్ఖలనం చేసే వారిలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 23 శాతం వరకు తగ్గుతుందని హార్వర్డ్‌ పరిశోధకులు ఇటీవల వెల్లడించారు. రోజూ వీర్యం బయటకు పోతుండడంతోపాటు ఆక్సిటోసిన్‌, సెరటోనిన్‌, ప్రోలాక్టిన్‌ వంటి హార్మోన్ల విడుదల ప్రొస్టేట్‌ కేన్సర్‌ను అడ్డుకుంటాయని వారు తెలిపారు. అయితే, ఈ సరస శృంగారాలను మీ జీవితభాగస్వామితో మాత్రమే  నెరపడం,సురక్షితం అని వైద్యులు సూచిస్తున్నారు.

Tuesday 19 April 2016

పచ్చకామెర్లతో కేన్సర్ ముప్పు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము .


పచ్చకామెర్లను జాండిస్‌ అని వ్యవహరిస్తారు. నిరంతరం రక్తంలోని ఎర్రకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురూబిన్‌ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురూబిన్‌ పరిమాణం రెట్టింపు అయితే కామెర్లు అని నిర్ధారిస్తారు. వీరి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి. పచ్చకామెర్లను నిర్లక్ష్యం చేస్తే కేన్సర్ కు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వాయుకాలుష్యంతో కేన్సర్

వాయు కాలుష్యంతో కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.  ఈ ముప్పు ఆగ్నేయ ఆసియా దేశాల్లో అధికంగా ఉందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20 కాలుష్య నగరాల్లో ఆగ్నేయాసియాలో 14 ఉన్నాయి. ప్రపంచంలో ఏటా 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నాని, వీటిల్లో మూడింట రెండో వంతు మరణాలు మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల్లోనే ఉన్నాయంది. మరణాల్లో 22 శాతం పొగాకు, దాని ఉత్పత్తులు వాడకంతో సంభవిస్తున్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా రీజియన్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, డీపీఆర్ కొరియా, ఇండోనేసియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఉన్నాయి.

ఈ ప్రాంతంలోని పరిశ్రమల్లో కార్మికులకు సూర్య కిరణాలు, కేన్సర్ కారక రసాయనాల నుంచి  రక్షణ లేదు. మద్యపానం, అనారోగ్యకర ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. పొగాకు, మద్యం వాడకం తగ్గించే దిశగా, పర్యావరణ పరిస్థితుల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేలా కఠిన చట్టాలు తేవాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా డెరైక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ చెప్పారు. ప్రపంచ కేన్సర్ దినం సందర్భంగా ఆమె ఈ వివరాలు వెల్లడించారు. అలాగే హ్యూమన్ పాపిలోమ వైరస్ (హెపీవీ), హెపటైటిస్ బి, సీ, హెలికోబక్టర్ పైలోరి వల్ల వచ్చే   వ్యాధులు కేన్సర్‌కు కారణాలుగా ఉన్నాయన్నారు.

 

Monday 18 April 2016

నాగాలాండ్ లో పెరుగుతున్న కేన్సర్ కేసులు

నాగాలాండ్‌లో ప్రతి ఏటా కొత్తగా 600 కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. 2009-2014 మధ్య కాలంలో మొత్తంగా 3338 కేసులు నమోదయ్యాయి. నాగాలాండ్‌ పాపులేషన్‌ బేస్డ్‌ కేన్సర్‌ రిజిస్ట్రీ ప్రధాన దర్యాప్తు అధికారి డా.వి.ఖామో ఈ విషయాన్ని తెలిపారు.

వీరిలో 2034మంది పురుషులుండగా 1314మంది మహిళలు వున్నారు. నాగాలాండ్‌, మణిపూర్‌ల్లో గొంతు కేన్సర్‌ ఎక్కువగా వుంటోంది. తర్వాత స్థానంలో పొట్ట కేన్సర్‌ వుందని ఆమె చెప్పారు. అంతర్జాతీయంగా 2.5కోట్ల కేన్సర్‌ కేసులు నమోదవగా, భారత్‌ 25లక్షల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

సంతాన చికిత్సలతో రొమ్ము కేన్సర్

సంతానం కలగని దంపతుల కోసం ఐవీఎఫ్‌ సహా పలు చికిత్సలు నేడు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ చికిత్సలతో రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతోందని తాజా అధ్యయనంలో తేలింది. స్వీడన్‌లోని కరొలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.


 సంతానం కోసం చాలా కాలం పాటు ఎదురుచూసిన తర్వాత దంపతులు వైద్యులను ఆశ్రయిస్తారు. ఆధునిక వైద్య పరిజ్ఞానంతో తల్లిదండ్రులుగా మారాలని నిర్ణయించుకోవడం, ఐవీఎఫ్‌ తదితర హార్మోనల్‌ చికిత్స తీసుకోవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సందర్భంగా.. హార్మోనల్‌ చికిత్సతో రొమ్ము కణజాలం ఎదుగుదలపై శరీరం నియంత్రణ కోల్పోతుందన్నారు. ఇది కేన్సర్‌ కణితుల పెరుగుదలకు కారణమవుతుందని చెప్పారు. సాధారణ మహిళలతో పోలిస్తే ఈ కణజాలం పెద్దగా ఉన్నవారిలో రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువని ఈ పరిశోధనలో పాల్గొన్న ఫ్రిదా లండ్‌బర్గ్‌ వివరించారు.

Sunday 17 April 2016

కేన్సర్ పై కసి తీర్చుకున్న వృద్ధురాలు

ఎందరో జీవితాలను చిద్రం చేస్తున్న కేన్సర్ మహమ్మారిపై తన కక్ష్యను తీర్చుకునేందుకు మాజీ కేన్సర్ బాధితురాలికి డెట్రాయిట్లోని హెన్రీఫోర్డ్ కేన్సర్ ఆసుపత్రి వినూత్నమైన అవకాశాన్ని కల్పించింది. త్రీడీ పరిజ్ఞానంతో రూపొందించిన కేన్సర్ కణితి నమూనాను అందరి ముందూ సుత్తితో చితక్కొట్టి ఆ వృద్ధురాలు తన కోపాన్ని తీర్చుకునేలా సాయపడింది. మిషిగాన్ ప్రాంతానికి చెందిన షీలా స్కై కాస్సెల్మాన్ అనే 75 ఏళ్ల వృద్ధురాలికి చాలాకాలంగా కేన్సర్ ఉంది. ఆమె క్లోమంలో ఎదిగిన గడ్డ వల్ల ఆమె జీవితం అతలాకుతలమైపోయింది. ఇక చావే శరణ్యం అనుకున్న పరిస్థితిలో వైద్యనిపుణులు ఆమెకు పునర్జీవితాన్ని ప్రసాదించారు.

ప్రస్తుతం కేన్సర్ సోకితే ఇక వారి జీవితాలు అంతమైపోయినట్లేననే ప్రచారం ఉంది. కానీ అది వాస్తవం కాదని కేన్సర్ నిపుణులు ఎప్పటినుండో చెపుతున్నారు. ఇందుకోసం పాశ్చాత్యదేశాల్లో ప్రచార కార్యక్రమాలు చురుకుగా సాగుతుంటాయి. అందులో భాగంగా ''క్రషింగ్ కేన్సర్'' అనే ప్రచార కార్యక్రమాన్ని హెన్రీఫోర్డ్ ఆసుపత్రి ప్రారంభించింది. కేన్సర్ నుండి విముక్తురాలయిన షీలాకు ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా తన కేన్సర్ కణితిని చితకకొట్టి నుజ్జునుజ్జు చేసే అవకాశం దక్కింది. తొలుత ఆమె ఒక బేస్ బాల్ బ్యాట్ తో ఆ కణితిని చితకకొట్టాలని భావించినా ఆ తరువాత మనసు మార్చుకుని సుత్తి ఎంచుకున్నారు. షీలాకు మహిళకు క్లోమసంబందిత కేన్సర్ సోకింది. కేన్సర్ పుణ్యమా అంటూ అప్పట్లో మహిళ పడిన కష్టాలు ఇన్నీ అన్నీ కావు.

నిద్ర తక్కువైతే.. కేన్సర్ ప్రమాదం..!



మానవుడికి పరిపూర్ణమైన ఆరోగ్యం నిద్ర వల్లనే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎన్ని కసరత్తులు చేసినప్పటికీ రాని ఆరోగ్యం నిద్ర వల్ల వస్తుందట. నిద్ర గనుక ఏమాత్రం తక్కువైతే మాత్రం కేన్సర్ కోరల్లో చిక్కుకోక తప్పదంటున్నారు అమెరికన్ పరిశోధకులు. ప్రతిరోజూ వ్యాయామం చేసే మహిళలతో పోలిస్తే... ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోయే మహిళలలో బ్రెస్ట్ కేన్సర్ లేదా కలోన్ కేన్సర్ వచ్చే అవకాశాలు 47 శాతం ఎక్కువగా ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వారంటున్నారు.


                    వాషింగ్టన్‌లో జరిగిన అమెరికన్ అసోసియేషన్ సమావేశంలో పరిశోధనల వివరాలను వెల్లడించారు. ఈ పరిశోధనల్లో కనుగొన్న విషయాల గురించి అమెరికా జాతీయ కేన్సర్‌ సంస్థకు చెందిన జేమ్స్ మెక్‌క్లెయిన్ మాట్లాడుతూ... పరిశోధనా వివరాలు తమని ఆశ్చర్యానికి గురి చేశాయని, ఏమైనప్పటికీ దీనిపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. తక్కువ నిద్రతో కేన్సర్ ఎలా వస్తుందో తమకు పూర్తిగా అర్థంకాని విషయంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Saturday 16 April 2016

కేన్సర్‌ను చంపే కణాలు మీలోనే!

కేన్సర్ బాధితుల వ్యాధి నిరోధక కణాలతోనే.. కేన్సర్‌ను సమర్థంగా నియంత్రించే విధానాన్ని అమెరికాకు చెందిన నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సాధారణ కణాలు కేన్సర్ కణాలుగా మారడం వల్ల విడుదలయ్యే ఒక ప్రొటీన్‌ను గుర్తించగలిగే వ్యాధినిరోధక కణాలను  వారు గుర్తించారు. సాధారణంగా మానవ చర్మంలోని మెలనోమా కణితుల్లో ఈ టీఐఎల్‌లు ఉంటాయి.

ఒక ఊపిరితిత్తులు, కాలేయ కేన్సర్లతో బాధపడుతున్న మహిళ నుంచి ఈ కణాలను సేకరించిన శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో భారీ సంఖ్యలో అభివృద్ధి చేసి, తిరిగి ఆమె శరీరంలో ప్రవేశపెట్టారు. కొద్ది రోజుల అనంతరం పరిశీలించగా ఆమె ఊపిరితిత్తులు, కాలేయంలోని కేన్సర్ కణితులు.. కొంతవరకూ కుచించుకుపోయినట్లు గుర్తించారు. ఆరు నెలల అనంతరం మళ్లీ ఇదే తరహా చికిత్స చేసి చూడగా.. మరింత అద్భుతమైన ఫలితాలు వచ్చాయని పరిశోధనకు నేతృత్వం వహించిన స్టీవెన్ రోసెన్‌బర్గ్ చెప్పారు. దీనిని మరింతగా అభివృద్ధి చేసి, మెరుగైన చికిత్సను రూపొందిస్తామని… కేన్సర్ చికిత్సలో ఇదొక గొప్ప ముందడుగని పేర్కొన్నారు.

కేన్సర్ అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది?


కేన్సరు అనేది కొత్త వ్యాధికాదు. పురాతనకాలంలో దీన్ని రాచపుండు అని అనేవారు. అయితే సామాన్యులకు కాక రాజులకే ఎందుకు వస్తుంది? బహుశా రాజుల భోగలాలస జీవితం వలనేమో. ఇంకొకటైనా కావచ్చు. రాజులకొస్తే అది ప్రజలందరికీ వార్తా విశేషం, కాని సామాన్య పౌరుడికొస్తే ఎవరు పట్టించుకుంటారు. అదలా వుంచితే, కేన్సర్ అనే పదానికి గ్రీకులో యెండ్రకాయ లేదా పీత అని అర్థం. పీతకు ఎలా అయితే శరీరం మధ్యనుండి నలువైపులా విస్తరించినట్లు కాళ్ళు ఉంటాయో, కేన్సరు అదే పద్ధతిలో వ్యాప్తిచెందటం వలన దానిని కేన్సరు గా నామకరణం చేసారు. కర్కాటక రాశిని ఆంగ్లంలో కేన్సర్ అంటారు, దాని రాశిగుర్తు పీత. హిప్పోక్రేట్స్ అనే గ్రీకు తత్వవేత్త దీన్ని కార్కినోమా అని వర్ణించాడు. ఈ పదాన్నే ఆంగ్లంలో కార్సినోమా అంటారు.

          నిద్రాణంగా వున్న వికృత కణాలకు సరియైన కేన్సరు ప్రేరకాలు పురికొల్పడం వలన అవి విపరీతంగా స్పందించి అసందర్భ కణ విభజనకు లోనవుతాయి. ఇటువంటి కణ విభజనను ప్రొలిఫిరేషన్ అంటారు.  కొవ్వు పదార్థాలు , అత్యధికమైన కేలరీలు ఈ నిద్రాణమైన కణాలను స్పందింపజేసి వాటిని అనియంత్రితంగా విభజన చెందించి, కణజాల పరిమాణాన్ని పెంచి ముందుగా వాపు లా కనిపిస్తాయి. వీటి పరిమాణం ఇంకాపెరిగినాక దీన్నే ట్యూమర్ లేదా కంతి అంటాం. ఎక్కువ శాతం కేన్సర్లు రసాయన పదార్థాలు మనశరీరం లో చేరిన తరువాత సంభవిస్తాయి.మొత్తానికి మనకు జన్యు-పర్యావరణల పరస్పర సంబంధం వలన ఎక్కువగా కేన్సర్లు వస్తాయి అని చాల పరిశోధనలవలన తెలిసింది. 

Friday 15 April 2016

కేన్సర్ చికిత్స కోసం కొత్త పరికరం

కేన్సర్‌ చికిత్సలో కీమోథెరపీ మందులకున్న ప్రాధాన్యం తెలిసిందే! సాధారణంగా ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్ల రూపంలో ఈ మందులను రోగి శరీరంలోకి పంపిస్తారు. ఈ పద్ధతిలో మందు కేన్సర్‌ కణితిని చేరడానికి ఎక్కువ సమయం పట్టడంతో దాని ప్రభావం పూర్తిస్థాయిలో ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కీమోథెరపీ మందును నేరుగా కేన్సర్‌ కణితికి చేరవేస్తే మరింత మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

 ఇందుకోసం పేస్‌మేకర్‌ తరహాలో శరీరంలోకి ప్రవేశపెట్టే పరికరాన్ని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశా రు. దీని సాయంతో పాంక్రియాటిక్‌ కేన్సర్లలో పెరిగిన కణితిని కుచించుకు పోయేలా చేయవచ్చన్నారు. ఆపై శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చని ఎంఐటీకి చెందిన లారా ఇండోల్ఫి తెలిపారు. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాలలో తాజా ఆవిష్కరణతో 12 రెట్లు మెరుగైన ఫలితాలు సాధించినట్లు లారా వివరించారు.

కప్పు కాఫీతో కేన్సర్ కు చెక్

సాధారణంగా కాఫీ తాగితే మూడ్స్ మెరుగుపడి… కాస్తంత రిలాక్స్‌గా ఉంటుందని మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే, కాఫీ అతిగా తాగితే నానా ఆరోగ్య సమస్యలు వస్తాయని, అందువల్ల మితంగా మాత్రమే కాఫీ సేవనం కావించాలని వైద్య నిపుణులు చేసే హెచ్చరికలూ మనకు తెలుసు. అయితే, కాఫీ తాగే వారు ఇవేమీ పట్టించుకోనక్కర్లేదు.

మూడ్ బాగా లేకపోయినా, తలనొప్పిగా ఉన్నా మొహమాటం లేకుండా కాఫీ సేవించవచ్చు. ఎందుకంటే కాఫీ తాగితే కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
ముఖ్యంగా.. రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగే వారికి కేన్సర్ సోకే అవకాశాలు మిగిలిన వారితో పోలిస్తే 30 శాతం తక్కువగా ఉంటాయని ఇంగ్లండ్ పరిశోధకులు చెబుతున్నారు. కాఫీ సేవనంపై తమ పరిశోధన సారాంశాన్ని వారు ‘న్యూ ఇంగ్ల్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో పొందుపరిచారు.

Thursday 14 April 2016

చేప విషంతో కేన్సర్ కు చెక్

కొన్ని చేపలు విషాన్ని కలిగి ఉంటాయి. కేన్సర్‌ నివారణకు ఆ విషంలోని కణాలు ఉపయోగపడేలా శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని కనుగొన్నారు. యార్సీనియా జాతికి చెందిని చేపలు ప్లేగు, ఇతర వ్యాధులను కలగజేస్తాయి. వీటిపై ఇద్దరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

ఈ యార్సీనియా చేపల్లోని విషంలో కేన్సర్‌ నివారణ కణాలు ఉన్నాయని గుర్తించారు. ఇది కేన్సర్‌ నివారణకు చికిత్సావిధానంగా ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.

కొత్తరూపంలో కేన్సర్ మహమ్మారి

జన్యువులలో వంశపారంపర్యంగా వచ్చే పరివర్తనాలు 12 రకాల కేన్సర్లకు దారితీస్తున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. జన్యుపరమైన మార్పులతో కేన్సర్‌ వస్తుందనే విషయం గతంలోనే వెల్లడైంది. అయితే, ఈ పరివర్తనాలు అకస్మాత్తుగా రావడం లేదని, తరాల తరబడి వీటి ప్రభావం కొనసాగుతోందని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కో తరంలో డీఎన్‌ఏలో నిర్ధుష్టంగా జరుగుతున్న మార్పులు చివరకు కేన్సర్‌కు దారితీస్తున్నాయని వివరించారు. ప్రధానంగా వీటిలో అండాశయ, స్టమక్‌, రొమ్ము, ప్రోస్టేట్‌, లంగ్‌ (రెండు రకాలు), గ్లియోమా, తల మరియు మెడ, ఎండోమెట్రియల్‌, కిడ్నీ, గ్లియోబ్లాస్టోమా, అక్యూట్‌ మైలాయిడ్‌ లుకేమియా కేన్సర్లకు కారణం వంశపారంపర్యంగా వచ్చే డీఎన్‌ఏ మార్పులేనని స్పష్టం చేశారు.

 బీఆర్‌సీఏ1, 2 పరివర్తనాలవల్ల రొమ్ము, అండాశయ కేన్సర్ల బారిన పడాల్సివస్తుందని అన్నారు. వీటితో స్టమక్‌, ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు కనుక్కున్నారు. దీంతో కేన్సర్‌ రిస్క్‌ను నిర్ధారించే జన్యు పరీక్షలకు మరింత కచ్చితత్వం చేకూరనుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, రొమ్ము, అండాశయ కేన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయని తెలిసిందే! అయితే కేన్సర్‌ జీనోమ్‌ అట్లాస్‌ ప్రాజెక్టులో భాగంగా.. 4 వేల మంది కేన్సర్‌ బాధితులను పరిశీలించాక కొత్త విషయాలు వెల్లడయ్యాయి.

Wednesday 13 April 2016

దేశంలో పెరుగుతున్న కేన్సర్ మరణాలు

భారత దేశంలో అత్య‌ధిక మ‌ర‌ణాలు కేన్సర్ వ్యాధి వ‌ల్ల‌నే సంభ‌విస్తున్నాయి.  ఆడవారిలో గతంలో గర్భాశయ కేన్సర్ వల్ల ఎక్కువమంది చనిపోతుండే వారు. ఇప్పుడు బ్రెస్ట్ కేన్సర్ తో చాలామంది చనిపోతున్నారు. ఇక మగవారిలో లంగ్ క్యాన్సర్ ఎక్కువమంది మరణాలకు కార‌ణ‌మ‌వుతోంది. భారత దేశంలో కాలేయ  కేన్సర్ గత 23 ఏళ్ళల్లో 88 శాతం పెరిగింది. జీర్ణకోశ సంబంధ కేన్సర్ 64 శాతం పెరిగింది.

                        అంతర్జాతీయ పరిణామాలే మన  దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్  వ్యాప్తికి దారితీస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం భారత్ లో గర్భాశయ, నోటి కేన్సర్ లు కూడా ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి.  గర్భాశయ కేన్సర్ ను అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా వాక్సినేషన్, నిర్బంధ ఆరోగ్య  పరీక్షల ద్వారా అదుపు చేస్తున్నారు. పొగాకు నమలడం మన దేశంలో నోటి కేన్సర్ కు ఎక్కువగా దారితీస్తోంది.

ఓరల్ సెక్స్ తో కేన్సర్ ముప్పు

 ఓరల్‌ సెక్స్‌ అనేది సెక్స్‌లో ఒక రకం. అంగాన్ని నోట్లో పెట్టుకొని ఛూషణ చేయడం లేదా నాలుకతో, నోటితో అంగాన్ని ఛూషించడం వంటి విధానాలను ఓరల్‌ సెక్స్‌ అంటారు. నిజానికి ఈ తరహా లైంగిక విధానంలో సంతృప్తి ఎక్కువగా వుంటుందని చెపుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. పలుమార్లు ఓరల్‌ సెక్స్‌ చేయడం వల్ల హెడ్‌ కేన్సర్‌, అలాగే నెక్‌ కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం వుందని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మేరకు ఈ వైద్యకళాశాల ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది.

                                 ఓరల్‌ సెక్స్‌ చేయడం వల్ల హ్యూమన్‌ పపిల్లోమావైరస్‌ అనే ప్రాణాంతక వైరస్‌ శరీరంలో ప్రవేశిస్తుందని పరిశోధకులు తెలిపారు. హ్యూమన్‌ పపిల్లోమావైరస్‌ కు, హెడ్‌ కేన్సర్‌ లేదా నెక్‌ కేన్సర్‌లకు దగ్గరి సంబంధం వుందని తేల్చిచెప్పారు. 97,000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. దీంతో తేలిందేంటంటే, హ్యూమన్‌ పపిలోమావైరస్‌  ఏ విధంగానైనా, ఏ మనిషికౖౖెనా సోకవచ్చని, అయితే ఓరల్‌ సెక్స్‌ చేసేవారిలో ఏడు రెట్లు వేగవంతంగా ఈ వైరస్‌ సోకి, ప్రాణాలను హరిస్తుందని నిర్ధారించారు.

Tuesday 12 April 2016

హైటెక్కువుంటే కేన్సర్ ముప్పు

పొడుగ్గా ఉండేవాళ్ల గురించి పరిశోధకులు ఓ కొత్త విషయాన్ని కనిపెట్టారు. వారిలో గుండె జబ్బులు, టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం చాలా తక్కువట. కానీ మిగతావారితో పోలిస్తే కేన్సర్‌ ముప్పు మాత్రం వీరికే ఎక్కువట! సగటున 6.5 సెంటీమీటర్ల ఎత్తుకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6 శాతం తగ్గుతుందని, అదే సమయంలో కేన్సర్‌ ముప్పు 4 శాతం పెరుగుతుందని జర్మన్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు తెలిపారు.

కాగా, సాధారణ యాంటాసిడ్‌లలో ఉపయోగించే నానోపార్టికల్స్‌తో కేన్సర్‌ కణితి ఎదుగుదలను అడ్డుకోవచ్చని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకుల బృందం తెలిపింది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా ఉన్నారు.

జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ తో కేన్సర్

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి అతి పెద్ద షాక్ తగిలింది. ఈ కంపెనీ తయారుచేసిన బేబీ పౌడర్, ప్రిక్లీ హీట్ పౌడర్‌లను కొన్ని దశాబ్దాల పాటు వాడిన ఓ మహిళ అండాశయ ముఖద్వార కేన్సర్‌తో మరణించడంతో.. ఆమె కుటుంబానికి సుమారు రూ. 493 కోట్ల పరిహారం చెల్లించాలని అమెరికా కోర్టు తీర్పు చెప్పింది.

మిస్సౌరీ రాష్ట్ర జ్యూరీలోని 60 మంది సభ్యులుగల సెయింట్ లూయిస్ సర్క్యూట్ కోర్ట్ ఈ సంచలన తీర్పును ప్రకటించింది. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉత్పత్తుల నాణ్యత‌ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Monday 11 April 2016

ముందస్తు పరీక్షలతో కేన్సర్ కు చెక్

జన్యుపరంగా అనారోగ్యకరమైన జీవన విధానం వలన, ఇన్‌ఫెక్షన్‌ల ద్వారా, మద్యం,పొగకు ఉత్పత్తుల వాడకం వలన కేన్సర్‌ వస్తుంది.  ప్రస్తుతం లక్ష మందిలో ఒకరు కేన్సర్‌ బారిన పడుతు న్నారు.  శుభ్రత లేకపోవడం వలన 50 శాతం మంది కేన్సర్‌ బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలోనే కేన్సర్‌ను గుర్తిస్తే సరైన వైద్యం ద్వారా కేన్సర్‌ను జయించవచ్చు. సాధారణంగా మానవ శరీరంలో ఉండే కణాలు ఒక క్రమపద్దతిలో నియంత్రించ బడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదల నియంత్రణ లేకపోవటం వలన అస్తవ్యస్తంగా విభజన చెంది కణుతులుగా ఏర్పాడతాయి. ఈ కణుతు లు రెండు రకాలుగా ఉంటాయి.ప్రమాదకరమైన కణుతుల వలన కేన్సర్‌ వస్తుంది.
                                               
                      శరీరానికి తగినంత వ్యా యామం లేకపోవుట, జంగ్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినుట వంటి అహర అలవాట్ల వలన కూడా కేన్సర్‌ వచ్చే అవకాశముంది.  కేన్సర్‌గా గుర్తించడానికి లక్షణాలు మానని పుండు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న కణితి, తగ్గని దగ్గు, గొంతు బొంగురు పోవటం, మలంలో రక్తం, విసర్జన వేళల్లో మార్పు, మింగటం కష్టంగా మారటం, పుట్టుమచ్చలలో మార్పు, అసాధారణ రక్త హీనత, బరువు/ఆకలి తగ్గటం వంటి లక్షణాలు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళా ప్రతి సంవత్సరం మెమో గ్రామ్‌ తీయించుకొని బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండ జాగ్రత్త తీసుకోవాలి.అదే విధంగా మగ వారు 60 సంవత్సరాలు దాటిన వారు 3 సంవత్సరాలకొక సారి ప్రోటెస్ట్‌ కేన్సర్‌ రాకుండా ఎస్‌.పి.ఎస్‌.ఎ అనే టెస్ట్‌ చెయించుకోవాలి.

కేన్సర్ ఫ్రీ గోధుమలు

గోధుమ గడ్డి రసం ఆరోగ్య ప్రదాయిని  దీనిని అనేక రోగాలకు నివారిణిగాఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో ‘ఎ’ విటమిన్‌, బి కాంప్లెక్స, సి,ఇ,కెవిటమిన్లు, కాల్షియం, ఐరన్‌,మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సెలీనియమ్‌,సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలోకొలెస్ట్రాల్‌ ఉండదు ఒక గ్లాసులోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది. దీనిని కేవలంగడ్డి రసం అని తీసి పారేయలేము  గోధుమ మొలకలను న్యూట్రిషనల్‌ రిజర్వాయర్‌గాపౌష్టికాహార నిపుణులు గుర్తిం చారు.

                               ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు గోధుమ గడ్డి రసం  తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుటపడుతుంది. గోధుమ గడ్డి రసంలో ప్రొటీన్లు, ఎంజైమ్స్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉన్న కారణానంగా ఈ రసాన్నిసేవించిన వారికి శక్తిని చేకూరుస్తుంది. గోధుమ గడ్డిలో క్లోరోఫిల్‌ ఉండటంవలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనో త్తేజం కలిగిస్తుంది. గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైటోన్యూట్రియంట్స్‌,బీటా కెరోటిన్‌, బయో ఫ్లావో నాయిడ్‌, బి,సి,ఇ విటమిన్లకారణాన క్యా న్సర్‌ కణాలను నశింపచేస్తుంది. రోగ నివారణా శక్తిని పెంచి ఎర్రరక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.


Sunday 10 April 2016

డయాబెటిస్ మెడిసిన్ తో కేన్సర్

మధుమేహానికి వాడే ఓ ఔషధం మూత్రకోశ కేన్సర్ ముప్పును అధికం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రించే థయాజోలిడినెడియోన్స్ తరగతికి చెందిన పియోగ్లిటాజోన్‌ను ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదం ఉందని కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.            
           
                ఇతర యాంటీబయోటిక్స్‌తో పోల్చినప్పుడు టైప్-2 మధుమేహ రోగుల్లో పియోగ్లిటాజోన్ వాడకం వల్ల బ్లాడర్ కేన్సర్ అవకాశాలు 63% పెరుగుతున్నాయంది. బ్రిటన్ ‘క్లినికల్ ప్రాక్టీస్ రీసెర్చ్ డేటాబేస్’ నుంచి సేకరించిన వివరాలపై అధ్యయనం చేసిన వర్సిటీ ఈ నిర్ధారణకు వచ్చింది. టైప్2 మధుమేహులకు చెమట ద్వారా గ్లూకోజు స్థాయిలను పసిగట్టి తగిన మోతాదులో ఇన్సులిన్‌ను సూక్ష్మసూదుల ద్వారా శరీరంలోకి పంపే ‘డయాబెటిక్ కంట్రోల్
స్కిన్‌ప్యాచ్’ను కొరియా బృందం అభివృద్ధిచేసింది. దీనిపై శాస్త్ర ప్రపంచంలో ఆనందం వ్యక్తమవుతోంది.

స్మార్ట్ ఫోన్ తో నో కేన్సర్

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడితే దాని రేడియేషన్ వల్ల చర్మ కేన్సర్ వస్తుందని ఇన్నాళ్లూ రకరకాల భయాలు ఉండేవి. కానీ, అలా భయపడక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా పిల్లలకు ఇది ముప్పేనని అంటున్నారు. మొబైల్ ఫోన్ వాడకంతో పాటు ఇతర రేడియో ఫ్రీక్వెన్సీ విద్యదయస్కాంత క్షేత్రాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొంతకాలం క్రితం ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ చెప్పింది. అయితే దాన్ని నిర్ధారించడానికి పరిశోధన మాత్రం జరగలేదని తెలిపింది.


                    ఒకే కాల్ ఎక్కువ సేపు ఉండటం.. లేదా ఎక్కువ సంఖ్యలో కాల్స్ మాట్లాడటం వల్ల మాత్రం ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొబైల్ ఫోన్ల వల్ల కేన్సర్ రావడం గానీ, అప్పటికే ఉన్న ట్యూమర్లు మరింత ఎక్కువగా పెరగడం గానీ జరగదని పరస్ ఆస్పత్రి సీనియర్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ ఇందు బన్సల్ అగర్వాల్ తెలిపారు. సెల్‌ఫోన్ల వల్ల కొంత వేడి పుడుతుంది గానీ, అది శరీర ఉష్ణోగ్రతను పెంచేంతగా ఉండదని బీఎల్‌కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన రేడియేషన్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్. హుక్కు చెప్పారు. అయితే స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల మెలటోనిన్ హార్మోన్ స్థాయి తగ్గుతుందని, దానివల్ల భావి జీవితంలో న్యూరో డీజనరేటివ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Saturday 9 April 2016

శృంగారమే కేన్సర్ కు మందు

మీరు ప్రోస్టేట్ కేన్సర్ ను దూరంగా ఉంచాలనుకుంటున్నారా. అయితే రోజూ శృంగారంలో పాల్గొనాల్సిందే. రోజూ వీర్యస్ఖలనం చేసేవారికి ప్రోస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం తక్కువట. మానవ ప్రత్యత్పత్తి వ్యవస్థలో కీలకమైన ప్రోస్టేట్ గ్రంథి ఈ కేన్సర్ కు గురవుతుంది. నెలలో దాదాపు 21సార్లు వీర్యస్ఖలనం చేసే వారిలో ప్రోస్టేటే కేన్సర్ వచ్చే అవకాశం 23 శాతం వరకూ తగ్గుతుందట.

          హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల పరిశోధనలో ఇది తేలింది. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా లక్షా డెబ్భై వేల మంది ప్రోస్టేటే క్న్సర్ తో బాథపడుతున్నారని వాల్డ్ కేన్సర్ రీసెర్చ్ ఫండ్ తెలిపింది. రోజూ వీర్యం బయటికి పోతుండటంతో ఆక్సిటోసిన్, సెరటోనిన్, ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ల విడుదల ప్రోస్టేటే కేన్సర్ ను అడ్డుకుంటాయని తెలుస్తోంది. అయితే ఈ సరస శృంగారాలను మీ జీవిత భాగస్వామికి మాత్రమే పరిమితం చేయడం ఉత్తమమని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు.

డీ విటమిన్ తో కేన్సర్ దూరం

రక్తంలో విటమిన్‌ డి స్థాయులు ఎక్కువగా ఉంటే కేన్సర్‌ వచ్చే ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. విటమిన్‌-డి కొరత పేగు కేన్సర్‌కు దారితీస్తుందనే విషయం గతంలోనే వెల్లడైంది. ఒక్క పేగు కేన్సర్‌ మాత్రమే కాదు రొమ్ము, ఊపిరితిత్తులు, బ్లాడర్‌ కేన్సర్లతోనూ విటమిన్‌-డికి సంబంధం ఉందని కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్‌ సెడ్రిక్‌ గార్లాండ్‌ తెలిపారు.


విటమిన్‌-డి కొరత పలు రకాల కేన్సర్లకు కారణమవుతోందని, అయితే.. తగు మోతాదులో ఉంటే ఇదే వాటిని తగ్గిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో రక్తంలో విటమిన్‌-డి మార్కర్‌ 25-హైడ్రాక్సి విటమిన్‌ డి (25(ఓహెచ్‌)డి) స్థాయులను పరీక్షించడం ద్వారా ఈ ముప్పును అంచనా వేయవచ్చన్నారు. రక్తంలో 25(ఓహెచ్‌)డి స్థాయులు 40 నానోగ్రామ్స్‌ ఫర్‌ మిల్లీలీటర్‌, అంతకన్నా ఎక్కువగా ఉన్న వారిలో కేన్సర్ల ముప్పు 67 శాతం తక్కువగా ఉందని తేలిందన్నారు

Friday 8 April 2016

శాకాహారంతో కేన్సర్ దూరం

శాకాహారం మంచిదని మన పెద్దలు చెప్పిన మాట అక్షరాలా నిజమని పలు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ముప్పయ్యేళ్లు నిండిన తర్వాత పూర్తిగా శాకాహారులుగా మారితే పురుషులు ప్రొస్టేట్ కేన్సర్ బారిన పడకుండా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.


 పాల ఉత్పత్తులు, గుడ్లు సహా జంతు సంబంధ ఆహారాన్ని పూర్తిగా మానేసి, శాకాహారం తీసుకుంటున్నట్లయితే, ప్రొస్టేట్ కేన్సర్ సోకే అవకాశాలు 35 శాతం మేరకు తగ్గుతాయని కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దురదృష్టవంతులకే కేన్సర్‌ వస్తుందా?

ఇప్పటి వరకూ కేన్సర్‌ ఎందుకు వస్తుందీ అనే ప్రశ్నకు అనేక మంది అనేక సమాధానాలు ఇచ్చారు కానీ –జాన్స్‌ హాప్‌కిన్స్‌విశ్వవిద్యాలయం వైద్య కళాశాల పరిశోధకులు కుండబద్దలు కొట్టి ని•జం చెబుతున్నారు. కేవలం దురదృష్టం కొద్దీ కేన్సర్‌ వస్తుందని ఒక అధ్యయనం ద్వారా కనుగొన్నారు. ప్రతీ ముగ్గురు కేన్సర్‌ పేషంట్లలో ఇద్దరికి కేవలం దురదుదృష్టం వలన కేన్సర్‌ వస్తుందని వారు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ అనేక మంది వైద్యులు విశ్వసిస్తున్నట్లు వ్యక్తిగత అలవాట్లు వల్లే కేన్సర్‌ వస్తుందనే వాదనను వారు తిప్పికొడుతున్నారు. కణం విభజ•న
పొందేటప్పుడు కణంలోని ప్రధానమైన డిఎన్‌ఏలో వచ్చే పరివర్తనా లోపాలే కేన్సర్‌కు మూలకారణాలు. శరీరంలోని అనేక కణ–జాలాల మూలకణ పరివర్తనాలను అధ్యయనం చేశారు.


                 31 రకాల కేన్సర్లు అధ్యయనం చేశారు. వారి అధ్యయనంలో 65 శాతం మందికి కేవలం కణ విభ•న లోపాల వల్లే కేన్సర్‌ వచ్చిందని తెలుసుకున్నారు. వంశపారం పర్యత, పర్యావరణం కారణంగా కేవలం 35 శాతం మందికి మాత్రమే కేన్సర్‌ వస్తుందని అంటున్నారు. వీరి అంచనాల ప్రకారం కేవలం దురదృష్టం వల్ల వచ్చే కేన్సర్‌లలో మెదడు, తలా – మెడా, థైరాయిడ్‌, ఊపరితిత్తులు, ఎముకలు, కాలేయం, పాన్‌క్రియాస్‌, చర్మం, గర్భాశయం, వృషణాల కేన్సర్లు ఉన్నాయి. వ్యక్తిగత అలవాట్ల వచ్చే కేన్సర్లలో కొన్ని రకాల చర్మ, గొంతు, థైరాయిడ్‌, పొగతాగే
వాళ్లకు ఊపిరితిత్తులు, తాగేవాళ్లకు కాలేయం, పీఠభాగాలకు వచ్చే కేన్సర్లు ఉన్నాయని నివేదికలో ప్రచురించారు.
ఈ అధ్యయనం ప్రచురించగానే ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది తీవ్రస్థాయిలో ప్రతిస్పందింగారు. కేన్సర్‌ రావడాన్ని అదృష్టం – దురదృష్టంతో ముడిపెట్టడాన్ని అనేక మంది వైద్యులు దుయ్యబట్టారు.

Thursday 7 April 2016

కార్బైడ్ పండ్లతో కేన్సర్ ఖాయం

ఏ కాయనైనా రసాయనాలతో మగ్గబెట్టి మార్కెట్‌లో విక్రయిస్తున్న అక్రమార్కులు తాజాగా అరటిపండ్లపై దృష్టి పెట్టారు. అరటికాయలను పండ్లుగా మార్చేందుకు కొన్ని రసాయనాలు వినియోగిస్తున్నా, నాలుగైదు రోజులపాటు నిగనిగలాడుతూ ఉండేందుకు విషతుల్యమైన కార్బన్‌ డైజన్‌తో కడుగుతున్నారు. మనుషులు వాడరాదని సీసాలపై ఉన్నా…అరటికాయలను పండ్లుగా మగ్గబెట్టేందుకు వ్యాపారులు అతి ప్రమాదకరమైన పద్ధతులను వినియోగిస్తున్నారు. కొత్త పంటల కోసం దాచిన విత్తనాలు బూజు పట్టకుండా వాడే ఫంగిసైడ్‌ను అరటికాయలు
మగ్గబెట్టడానికి వినియోగిస్తున్నారు. దీంతోపాటు విషతుల్యమైన రసాయనాలతో పిచికారీ చేస్తున్నారు. వ్యాపారులు వినియోగిస్తున్న క్రిమి సంహారక మందుల సీసాలపై మనుషులు వాడకూడదన్న హెచ్చరికలు, విషపు తీవ్రత తెలిపే సూచికలున్నా బేఖాతరు చేస్తున్నారు.


                  కార్బన్ డైజిన్ రసాయనం పండ్లలోకి వెళ్లి తినేవారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్బైడ్ పండ్లతో అల్సర్‌తో పాటు జీర్ణాశయ సమస్యలు, కేన్సర్‌ కూడా వచ్చేఅవకాశాలున్నాయని చెబుతున్నారు.

దమ్ము కొట్టాలంటే.. ఇకపై టెర్రరే..!

దమ్ముకొట్టాలంటే ఇకపై దమ్ముండాలి. స్మోక్ చేయడమే కాదు.. జస్ట్ చూస్తేనే భయపడేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. పొగాకు ఉత్పత్తులపై పిక్టోరియల్ వార్నింగ్ చిత్రాలు 85శాతం పెంచుతూ జారీ చేసిన జీవో అమల్లోకి వచ్చేసింది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టూ హెల్త్.. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. సిగరెట్ ప్యాకెట్లపైనా, బీడీ కట్టలపైనా, ఇతర టొబాకో ప్రొడక్ట్స్ పైనా ఇది ప్రింట్ చేసి ఉంటుంది. అటు సినిమా హాళ్లలో కంపల్సరీగా దీన్ని పబ్లిసిటీ చేస్తున్నారు. అయినా పొగాకు వాడకానికి దూరంగా ఉండటంపై కొందరిలో ఇంకా అవేర్ నెస్ రావడం లేదు.
విపరీతంగా స్మోక్ చేస్తూ, గుట్కా పాన్ మసాల వంటివి తీసుకుంటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు టొబాకో యూజర్స్. రేట్లు పెంచితే పరిస్థితి మారుతుందని ఏటా పొగాకు ఉత్పత్తులపై సర్కార్ ట్యాక్స్ బాదేస్తుంది. అయినా నో చేంజ్. ఇక దీంతో సీరియస్ డెసీషన్ కు వచ్చింది కేంద్ర సర్కార్.

                   పొగాకు వాడకంతో ఏటా 10 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారిన పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక బొమ్మల సైజు పెంచితే అన్నా ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో.. కేంద్రం ఈ నిర్ణం తీసుకుంది. కేంద్రం నిర్ణయంపై డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ విధానాలతో పాటు ప్రజల్లో సామాజిక అవగాహన వచ్చినప్పుడే కేన్సర్ రోగులు తగ్గుతారని చెబుతున్నారు.

Wednesday 6 April 2016

ఈసారి వాల్డ్ హెల్త్ డే థీమ్ డయాబెటిస్

ప్రతి రోజూ ఉరుకులు, పరుగులు. డైలీ లైఫ్ లో ఎన్నో సవాళ్లు…. బిజీలో పడిపోయి లైఫ్ ని డేంజర్ లో పడేసుకుంటున్నారు జనాలు. హెల్త్ కేర్ అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కసారిగా వచ్చే అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్నఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ – WHO యేటా వాల్డ్ హెల్త్ డే ను నిర్వహిస్తుంది. ఏవ్రీ ఇయర్ ఓ థీమ్ ను ఎంచుకుని దానిపై పబ్లిక్ లో అవేర్ నెస్ కల్పిస్తోంది. ఇవాళ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ యేడాది దీర్ఘకాలిక వ్యాదుల్లో
ప్రధానమైన డయాబెటిస్ ను థీమ్ గా ఎంపిక చేసింది WHO. వ్యాధి బారిన పడుతున్న కారణాలు, డయాబెటిస్ రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలంటూ సెమినార్స్ నిర్వహిస్తోంది.


            ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కోట్లమంది షుగర్ వ్యాధి బారిన పడుతుండగా..ఒక్క ఇండియాలోనే 7 కోట్లమంది టైప్1,టైప్ 2 డయాబెటీక్ వ్యాదికి గురయ్యారని  లెక్కలుచెబుతున్నాయి.  డయాబెటీస్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులైన  B.P, థైరాయిడ్ సమస్యతో జనం అనారోగ్యానికి గురవుతున్నారు. అన్నింటికి మించి..మనం తీసుకుంటున్న ఆహారం పొల్యూట్ అవడం హెల్త్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. పండ్లు, కూరగాయలు కూడా రసాయనాలతో పండించినవి తినాల్సిరావడం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అవుతుందంటున్నారు డాక్టర్లు. క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ డిసీజెస్ పై అవేర్ నెస్ పెరగాలంటున్నారు. ఆరోగ్యమే..మహాభాగ్యం. హెల్త్ బాగుంటేనే అన్నీ సెట్ అవుతాయి. సో ఎంత బిజీ లైఫ్ అయినా హెల్త్ పై కేర్ తప్పనిసరి అంటోంది WHO

సన్నని నడుముతో కేన్సర్ దూరం

సన్నని నడుం అందానికి చిహ్నమ‌నుకుంటాం. ముఖ్యంగా నాజూకైన నడుము మగువల అందానికి తార్కాణంగా భావిస్తుంటాం. అందానికే కాదు ఆరోగ్యానికి కూడా నడుము సన్నగానే ఉండాలంటున్నారు పరిశోధకులు. నడుము లావుగా పెరిగితే న‌డి వయసులో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకనే జీవన రీతులను మెరుగుపరుచుకుని, ఆహారపు అలవాట్లను నియంత్రించుకుని, శారీరక వ్యాయామం చేస్తూ  నడుము లావు
కాకుండా చూసుకోవాలని బ్రిటన్ లోని న్యూ కేస్ట్లే యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ జాన్ మెతెర్స్ సూచిస్తున్నారు.



                నడుము లావు ఐదు శాతం పెరిగితే కేన్సర్ ప్రమాదం 18 శాతం పెరిగిన‌ట్లు పరిశోధకులు కనుగొన్నారు. మగవారికి పదేళ్ళ కాలంలో న‌డుము కనీసం 10 సెంటీమీట‌ర్లు లావు పెరిగితే కేన్సర్ ప్రమాదం 60 శాతం పెరుగుతుందని నిర్ధారణకు వచ్చారు.

ఆవునెయ్యితో కేన్సర్ దూరం

ఆవునెయ్యిలో అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, డి, ఇ మరియు కే వంటి విటమిన్స్ లభిస్తాయి. కాబట్టి భోజనంలో కొంత నెయ్యిని జోడిస్తే.. రోజుకు అవసరమయ్యే విటమిన్లు  అందుతాయి. ఆవునెయ్యిని రెగ్యులర్ గా తక్కువ మోతాదులో ఉపయోగిస్తే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఓ టీస్పూన్ నెయ్యిని రోటీపై రాసుకుని తింటే.. ఆకలిని అదుపులో ఉంచడమే కాకుండా.. ఇమ్యూనిటీని పెంచుతుంది. అరచేతులు, అరికాళ్లు మంటలకు
ఆవునెయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి.  ఎక్కిళ్లు తగ్గాలంటే అరచెంచా ఆవునెయ్యి తీసుకుంటే సరిపోతుంది.


         ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది. బ్రెస్ట్ కేన్సర్, పేగుల కేన్సర్ ను ఇది నిరోదిస్తుంది. హృద్రోగులకు ఆవునెయ్యి వరం వంటిది. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలంగా ఉంటారు. ఆవునెయ్యి వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరుగుతారు. ఆవుపాలల్లో పంచదార, మిరియాల పొడి కలుపుకుని తాగితే.. కంటి సమస్యలు తగ్గుతాయి.