Monday, 18 April 2016

సంతాన చికిత్సలతో రొమ్ము కేన్సర్

సంతానం కలగని దంపతుల కోసం ఐవీఎఫ్‌ సహా పలు చికిత్సలు నేడు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ చికిత్సలతో రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతోందని తాజా అధ్యయనంలో తేలింది. స్వీడన్‌లోని కరొలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.


 సంతానం కోసం చాలా కాలం పాటు ఎదురుచూసిన తర్వాత దంపతులు వైద్యులను ఆశ్రయిస్తారు. ఆధునిక వైద్య పరిజ్ఞానంతో తల్లిదండ్రులుగా మారాలని నిర్ణయించుకోవడం, ఐవీఎఫ్‌ తదితర హార్మోనల్‌ చికిత్స తీసుకోవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సందర్భంగా.. హార్మోనల్‌ చికిత్సతో రొమ్ము కణజాలం ఎదుగుదలపై శరీరం నియంత్రణ కోల్పోతుందన్నారు. ఇది కేన్సర్‌ కణితుల పెరుగుదలకు కారణమవుతుందని చెప్పారు. సాధారణ మహిళలతో పోలిస్తే ఈ కణజాలం పెద్దగా ఉన్నవారిలో రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువని ఈ పరిశోధనలో పాల్గొన్న ఫ్రిదా లండ్‌బర్గ్‌ వివరించారు.

No comments:

Post a Comment