Sunday, 17 April 2016

కేన్సర్ పై కసి తీర్చుకున్న వృద్ధురాలు

ఎందరో జీవితాలను చిద్రం చేస్తున్న కేన్సర్ మహమ్మారిపై తన కక్ష్యను తీర్చుకునేందుకు మాజీ కేన్సర్ బాధితురాలికి డెట్రాయిట్లోని హెన్రీఫోర్డ్ కేన్సర్ ఆసుపత్రి వినూత్నమైన అవకాశాన్ని కల్పించింది. త్రీడీ పరిజ్ఞానంతో రూపొందించిన కేన్సర్ కణితి నమూనాను అందరి ముందూ సుత్తితో చితక్కొట్టి ఆ వృద్ధురాలు తన కోపాన్ని తీర్చుకునేలా సాయపడింది. మిషిగాన్ ప్రాంతానికి చెందిన షీలా స్కై కాస్సెల్మాన్ అనే 75 ఏళ్ల వృద్ధురాలికి చాలాకాలంగా కేన్సర్ ఉంది. ఆమె క్లోమంలో ఎదిగిన గడ్డ వల్ల ఆమె జీవితం అతలాకుతలమైపోయింది. ఇక చావే శరణ్యం అనుకున్న పరిస్థితిలో వైద్యనిపుణులు ఆమెకు పునర్జీవితాన్ని ప్రసాదించారు.

ప్రస్తుతం కేన్సర్ సోకితే ఇక వారి జీవితాలు అంతమైపోయినట్లేననే ప్రచారం ఉంది. కానీ అది వాస్తవం కాదని కేన్సర్ నిపుణులు ఎప్పటినుండో చెపుతున్నారు. ఇందుకోసం పాశ్చాత్యదేశాల్లో ప్రచార కార్యక్రమాలు చురుకుగా సాగుతుంటాయి. అందులో భాగంగా ''క్రషింగ్ కేన్సర్'' అనే ప్రచార కార్యక్రమాన్ని హెన్రీఫోర్డ్ ఆసుపత్రి ప్రారంభించింది. కేన్సర్ నుండి విముక్తురాలయిన షీలాకు ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా తన కేన్సర్ కణితిని చితకకొట్టి నుజ్జునుజ్జు చేసే అవకాశం దక్కింది. తొలుత ఆమె ఒక బేస్ బాల్ బ్యాట్ తో ఆ కణితిని చితకకొట్టాలని భావించినా ఆ తరువాత మనసు మార్చుకుని సుత్తి ఎంచుకున్నారు. షీలాకు మహిళకు క్లోమసంబందిత కేన్సర్ సోకింది. కేన్సర్ పుణ్యమా అంటూ అప్పట్లో మహిళ పడిన కష్టాలు ఇన్నీ అన్నీ కావు.

No comments:

Post a Comment