Tuesday 30 August 2016

కలుపు మందుతో కేన్సర్

గ్లైఫొసేట్.. ఇది అత్యంత ప్రభావశీలి అయిన కలుపు మందు. ప్రపంచంలో వాడుకలో ఉన్న కలుపునాశిని రసాయనాల్లోకెల్లా అగ్రగామి. దీన్ని వాడని దేశం లేదు. ఇది మన దేశంలోనూ విరివిగా వాడుతున్న కలుపు మందు కూడా. ఇది సురక్షితమైన కలుపు మందుగా పరిగణించబడినది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కేన్సర్ కారకంగా గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం మొదలైంది. నెదర్లాండ్స్ దీనిపై వెంటనే నిషేధం విధించింది. మరికొన్ని దేశాలు ఇదే బాటను అనుసరించే దిశగా పయనిస్తున్నాయంటున్నారు.


 వ్యవసాయంలో కూలీల కొరత ముంచుకొస్తున్నకొద్దీ గ్లైఫొసేట్ గడ్డి మందు వాడకం బాగా పెరిగింది. గ్లైఫొసేట్ అంతర్వాహక చర్య కలిగిన ప్రభావశీలమైన కలుపు నాశక రసాయనం. ఈ కలుపు మందు చెట్టు మీద పడిన వెంటనే మొక్కల శిఖర భాగాలకు.. అంటే నేలలోని పీచు వేళ్ల నుంచి, చిటారు కొమ్మల చిగుళ్ల దాకా చేరుతుంది. చెట్టుకు అత్యంత ఆవశ్యకమైన అమైనో ఆమ్లాల తయారీని అడ్డుకొని కొన్ని రోజులకు పూర్తిగా చంపేస్తుంది.

Monday 29 August 2016

ఆవునెయ్యితో కేన్సర్ దూరం

ఆవునెయ్యి అన్నిరకాలా మంచిదని మన పెద్దలు చెప్పే మాటల్లో నిజం ఉంది. నెయ్యిలో అనేక విటమిన్లు ఉంటాయి. అందుకే రోజువారీ భోజనంలో ఆవునెయ్యిని చేరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆవునెయ్యిలో రోజూ తక్కువమోతాదులో ఉపయోగిస్తే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అరచేయి. అరికాలి మంటలు తగ్గుతాయి. ఆవునెయ్యి కేన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. బ్రెస్ట్ కేన్సర్, పేగు కేన్సర్ ను నివారిస్తుంది.
       


 ఆవునెయ్యి చిన్నపిల్లలకు మంచిది. పురుషుల్లో వీర్యం పెంచుతుంది. హృద్రోగులకు కూడా ఆవునెయ్యి వరం. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో ఆవునెయ్యి వేసుకుని తాగితే.. అప్పటిదాకా ఉన్న అలసట పోయి.. ఉత్సాహాన్ని సంతరించుకుంటారు. ఆవునెయ్యి బరువును కూడా సమపాళ్లలో ఉంచుతుంది. బరువు తక్కువ ఉన్నవాళ్లు బరువు పెరగాలన్నా, ఊబకాయం తగ్గాలన్నా ఆవునెయ్యికి మించింది లేదు.
ఆవుపాలలో మిరియాల పొడి, పంచదార కలిపి తాగితే.. కంటి సమస్యలు తగ్గుతాయి. 

Sunday 28 August 2016

అల్సరా..? కేన్సరా..?

కడుపులో మంట అనగానే అల్సర్ అని చాలా మంది అనుకుంటారు. ఏవో తెలిసిన నాలుగు మాత్రలు వేసేసుకుంటారు. కానీ అది కేన్సర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి అడ్వాన్స్ స్టేజ్‌కు చేరుకుని చికిత్స అందించినా ఫలితం ఉండని పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఏ కాస్త ఆకలి తగ్గినా, అరుగుదల తగ్గినా, మంటగా ఉన్నా వైద్యులను సంప్రదించి తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలంటున్నారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. టి.ఎల్.వి.డి ప్రసాద్‌బాబు.


ఒక్కోసారి సాధారణ లక్షణాలను గుర్తించడంలో పొరపాటు చేస్తే అది బాగా ముదిరిపోయిన దశలో కేన్సర్‌గా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్నవాహిక, జీర్ణకోశం, పెద్దపేగుకు వచ్చే కేన్సర్లలో ఈ అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఈ కేన్సర్ల బారినపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. 60లో వచ్చే కేన్సర్ ఇప్పుడు 40లోనే కనిపిస్తోంది.

Friday 26 August 2016

బ్లూబెర్రీతో కేన్సర్ దూరం

బ్లూబెర్రీ చాలా రుచికరంగా ఉంటాయి, దీనితో పాటుగా బ్లూబెర్రీ వలన చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇది సాధారణంగా అమెరికా, యూరప్, కెనడా మరియు ఆసియాలో పెరుగుతాయి. బ్లూబెర్రీ పెరిగే పొదల ఆధారంగా 3 రకాలుగా అభివర్ణించారు. బ్లూబెర్రీ చర్మాన్ని మృదువుగా, శక్తిని మెదడు పెంచుతాయి మరియు కేన్సర్ వ్యాధిని కూడా తగ్గించి వేస్తాయి. బ్లూబెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు అకాల వృద్దాప్యాన్ని అడ్డుకుంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడు పనితీరు స్థిరీకరిస్తాయి.



            బ్లూబెర్రీలకు నీలి రంగును ఆపాదించే ఆంతోసైనిన్ లు కేన్సర్ కారకపు ఫ్రీ రాడికల్ పై దాడి చేసి, ట్యూమర్ పెరుగుదలను నియంత్రిస్తాయని అర్బానా- కాంపైన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఎట్ ఇల్లినాయిస్ పరిశోధకులు తెలిపారు. కాబట్టి కోలన్ కేన్సర్ లేదా ఇతర కేన్సర్ లను కలిగి ఉన్న వారు రోజు బ్లూబెర్రీలను తింటే కేన్సర్ కు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. 

Thursday 25 August 2016

విశృంఖల శృంగారమే కేన్సర్ కు మందు

20 మంది మహిళలలతో పురుషుడు సెక్సులో పాల్గొంటే అతడికి ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం 28% మేర తగ్గిపోతుందట. ఈ అధ్యయనం కెనడాకు సంబంధించిన పరిశోధకులు చేసి, పలువురు పురుషులను పరిశీలించిన అనంతరం వెల్లడించినట్లు కేన్సర్ ఎపిడమాలజీ జర్నల్ తెలిపింది. దీనికి కారణం అంతమంది మహిళలతో సెక్సులో పాల్గొనేవారు ఎక్కువసార్లు వీర్యాన్ని స్ఖలిస్తారు కనుక వీర్యంలో ప్రొస్టేట్ కేన్సర్ కారక ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుందని వారు తెలుసుకున్నారు.

       

అయితే కొన్ని దేశాల్లో ఇలా ఎక్కువమంది స్త్రీలతో సెక్స్ చేసే పరిస్థితి ఉండదనీ, అలాంటి దేశాల్లో మగవారు హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారని చెపుతున్నారు. అధ్యయనంలో భాగంగా సెక్స్ పరీక్షల్లో పాల్గొన్న పురుషుల్లో ఎక్కువమంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో ప్రొస్టేట్ కేన్సర్ అవకాశాలు తక్కువగా కనబడగా భాగస్వామితో మాత్రమే సెక్స్ సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో కొంతమందికి ఈ వ్యాధి లక్షణాలున్నట్లు తేలింది. ఐతే ఇది కొన్ని దేశాలకు మాత్రమే వర్తిస్తుందని పరిశోధకుల మాటలను బట్టి తెలుస్తుంది.

Wednesday 24 August 2016

లేజర్ తో కేన్సర్ ముప్పు

వెంట్రుకలను తొలగించే లేజర్‌ ట్రీట్‌మెంట్లు కేన్సర్‌కు దారి తీస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేసేటప్పుడు విడుదలయ్యే పొగ వల్ల ఈ ప్రమాదం ఉంటుందట. రోజూ ఈ పొగను పీల్చేవాళ్లకయితే ప్రమాదం మరీ ఎక్కువట. వెంట్రుకలు కాలడం వల్ల వచ్చే పొగలో గాలిని కాలుష్యం చేసే రసాయనిక కారకాలున్నాయి. ఇవే కేన్సర్‌కు దారితీస్తాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. సరైన శిక్షణ లేని ప్రొఫెషనల్స్‌తో లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించడం వల్ల, కావలసిన పరికరాలు లేకపోవడం వల్ల చాలామంది పేషెంట్లు కేన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. 
                  



 ఎయిర్‌ ఫిల్టరైజేషన్‌ సిస్టమ్‌, స్మోక్‌ ఎవాక్యుయేటర్‌లు ఉన్నచోట లేజర్‌ ట్రీట్‌మెంట్‌ను నిర్వహించాలని పరిశోధకులు చెబుతున్నారు. ఇద్దరు వలంటీర్ల నుంచి హెయిర్‌ శాంపిల్స్‌ను సేకరించి, వాటిని గాజు సీసాల్లో ఉంచి సీల్‌ చేశారు. తర్వాత ఆ వలంటీర్లకు లేజర్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. ఆ సమయంలో 30 సెకండ్ల ఫ్యూమ్‌ను సేకరించారు. దానిలో మొత్తం 377 రసాయన కారకాలు ఉన్నాయి. వాటిల్లో పర్యావరణానికి హాని కలిగించే కార్బన్‌ మోనాక్సైడ్‌లాంటి 20 రకాల టాక్సిన్స్‌ కూడా ఉన్నాయి. 13 రకాల కెమికల్స్‌లో కేన్సర్‌ కారకాలు ఉన్నాయని వెల్లడైంది.

Tuesday 23 August 2016

స్మార్ట్ ఫోన్ తో కేన్సర్ రాదు

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడితే దాని రేడియేషన్ వల్ల చర్మ కేన్సర్ వస్తుందని ఇన్నాళ్లూ రకరకాల భయాలు ఉండేవి. కానీ, అలా భయపడక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా పిల్లలకు ఇది ముప్పేనని అంటున్నారు. మొబైల్ ఫోన్ వాడకంతో పాటు ఇతర రేడియో ఫ్రీక్వెన్సీ విద్యదయస్కాంత క్షేత్రాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొంతకాలం క్రితం ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ చెప్పింది. అయితే దాన్ని నిర్ధారించడానికి పరిశోధన మాత్రం జరగలేదని తెలిపింది.
       


స్మార్ట్ ఫోన్లతో కేన్సర్ రాకపోయినా.. అతిగా వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మొబైల్స్ కు ఎడిక్టైన యూత్.. మానసిక సమస్యలతో బాథపడుతున్నారని హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ క్వాలిటీని బట్టి కూడా రేడియేషన్ ఆధారపడి ఉంటుందని మరికొందరంటున్నారు. సాధారణ స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే.. బ్రాండెడ్ మొబైల్స్ రేడియేషన్ ఎక్కువగా విడుదల చేయవని తెలుస్తోంది. 

Monday 22 August 2016

లివర్ కేన్సర్ కు పవర్ ఫుల్ వైద్యం



శరీరంలోని కీలక అవయవాల్లోకెల్లా అతి పెద్దది, అతి ముఖ్యమైనది కాలేయం. ఆ అవయవమే కేన్సర్ బారిన పడితే? ఒకప్పుడైతే ఇది కలవరపెట్టే విషయమే. కానీ, ఆధునిక వైద్య విధానాలు ప్రవేశించాక ఇప్పుడా సమస్య మునుపటిలా కలవరపెట్టే అంశం కాకుండా పోయింది. ప్రత్యేకించి సర్జరీలోనూ, కీమో, రేడియేషన్ థెరపీల్లో వచ్చిన ఆధునిక రీతులు కాలేయ సంబంధమైన కేన్సర్‌ను అధిగమించడం సులభతరం చేశాయి. కాకపోతే, లివర్ కేన్సర్ అనగానే డిప్రెషన్‌లోకి జారిపోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, విధిగా వైద్య చికిత్సలు తీసుకుంటే లివర్ కేన్సర్ నుంచి సంపూర్ణంగా విముక్తి పొందడం సాధ్యమేనంటున్నారు కేన్సర్ వ్యాధి నిపుణులు
         

ఈ రోజుల్లో కేన్సర్ బారిన పడి మృత్యువు పాలైన వారిలో ఎక్కువ మంది వ్యాధిని ముందే గుర్తించి, వైద్య చికిత్సలకు వెళ్లడంలో నిర్లక్ష్యం చేసినవారే. కాకపోతే వైద్య చికిత్సలో ఎంతో నైపుణ్యం కూడా అవసరం అవుతుంది. ఎందువల్ల అంటే, లివర్ కేన్సర్లన్నీ ఒకే రకం కాదు. అందువల్ల వాటికి చేసే చికిత్సలు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. కేన్సర్ రకాన్ని అనుసరించి, చికిత్సలు కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రధానంగా లివర్‌లో వచ్చే కేన్సర్ కణుతులు ప్రైమరీస్, సెకండరీస్ అంటూ రెండు రకాలుగా ఉంటాయి. లివర్‌లోనే పుట్టిన కణుతులను ప్రైమరీ లివర్ ట్యూమర్స్ అనీ, మిగతా భాగాల్లో అంటే, శ్వాసకోశాల్లో గానీ, పెద్ద పేగుల్లో గానీ, క్లోమగ్రం«థిలో గానీ, కిడ్నీలో గానీ, ఎముకల్లోగానీ కణుతులు పుట్టి అవి కాలేయానికి పాకే రకాన్ని సెకండరీ లివర్ ట్యూమర్స్ అనీ అంటాం. నిజానికి ప్రైమరీ లివర్ ట్యూమర్ల కంటే, ఈ సెకండరీ లివర్ ట్యూమర్లే ఎక్కువగా వస్తాయి.

శృంగారమే దివ్యౌషధం

ప్రపంచంలో చాలామంది పురుషుల్ని పట్టి పీడిస్తున్న ప్రొస్టేట్ కేన్సర్ కు శృంగారమే పరమౌషధమని పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ శృంగారంలో పాల్గొంటే ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని తేలింది. నెలలో 21 రోజులు శృంగారంలో పాల్గొనే పురుషులకు.. ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం 23 శాతం తగ్గుతోందట. అయితే శృంగారంలో కేవలం జీవిత భాగస్వామికే పరిమితమవ్వాలని, విశృంఖల శృంగారం కొత్త సమస్యలకు దారితీస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
       



రోజూ శృంగారంలో పాల్గొనడం కారణంగా ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయని. ఈ హార్మోన్లు కేన్సర్ ను నిరోధిస్తాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షా డెబ్భై వేల మంది కేన్సర్ తో బాథపడుతున్నారు. రోజూ వీర్యం బయటికి పోతుంటే.. శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు వస్తాయని అంటున్నారు. కాబట్టి ఇకపై శృంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని సైంటిస్టులు సూచిస్తున్నారు. 

Saturday 20 August 2016

కాఫీతో కేన్సర్ గ్యారెంటీ




పొద్దున లేవగానే కాఫీ తాగనిదే పూటగడవని పరిస్థితి.ఇది చాలామందికి అలవాటుగా మారింది.  మరీ వేడివేడి కాఫీ
తాగితే కేన్సర్ ఖాయమంటున్నారు పరిశోధకులు.  ఐరాసకు చెందిన అంతర్జాతీయ సంస్థ చేసిన పరిశోధనలో పలు కీలక విషయాలు వెల్లడించింది. కాఫీ వంటి పానీయాలతో అన్నవాహిక కేన్సర్ తలెత్తే  అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోదకులు తేల్చిచెప్పారు.



               65 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ వేడి ఉన్న పదార్థాలను అన్నవాహిక ద్వారా తాగితే కొన్ని రకాల కేన్సర్ లకు దారితీస్తున్నట్టు ఇందులో వెల్లడైంది.

Friday 19 August 2016

కేన్సర్ గుర్తింపు చిటికెలో పని

పట్టుమని పదినిమిషాల్లో నోటి కేన్సర్‌ కణాలను గుర్తించే మైక్రోఫ్లూడిక్స్‌ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఈ డివైజ్‌ డెంటిస్ట్‌లకు సులభతరంగా, వ్యయపరంగా కూడా అందుబాటులో ఉంటుందని వారంటున్నారు. సర్వికల్‌ కేన్సర్‌తో సహా ఇతర కేన్సర్‌లను పరీక్షించేందుకు కూడా ఈ డివైజ్‌ ఉపకరిస్తుంది. లాబ్‌లో పెరిగే కేన్సర్‌ కణాలపై ఇది సమర్ధవంతంగా పనిచేస్తోంది. నోటి కేన్సర్‌ రోగుల నుండి బయోప్సిస్‌పై ప్రస్తుతం దీన్ని పరీక్షిస్తున్నారు.
                   

 చాలా వరకూ ఓరల్‌ కేన్సర్‌లు ప్రాథమిక దశలో నొప్పి ఉండకపోవడంతో రోగులు, వైద్యులు వాటిని గుర్తించలేకపోతారని నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆన్‌ డెఫ్‌నెస్‌ అండ్‌ అదర్‌ కమ్యూనికేషన్‌ డిజార్డర్స్‌లో హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ విభాగం అధిపతి కార్టర్‌ వాన్‌ వేస్‌ అంటున్నారు. ఈ ఏడాది 22,560 మందిలో ఓరల్‌ కేన్సర్‌ గుర్తించవచ్చని, 5000 మంది ఈ వ్యాధితో మరణించవచ్చని నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ గుర్తించింది. అస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ జాన్‌ మెక్‌డెవిట్‌ ఈ పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 

Thursday 18 August 2016

పొగ తాగితే కేన్సర్ ఖాయం

పన్నెండు రకాల కేన్సర్లు.. లక్షా అరవై ఏడు వేల మరణాలు.. కారణం మాత్రం ఒక్కటే. పొగత్రాగడం వల్ల కలిగే దుష్పరిణామాలే ఇవన్నీ.. అమెరికాలో ఏటా కేన్సర్‌తో మరణిస్తున్న వారిలో దాదాపు సగంమంది ఊపిరితిత్తులు, శ్వాసనాళం, స్వరపేటికకు సంబంధించిన కేన్సర్లతోనే పోతున్నారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. వీటిలో చాలా మరణాలు కొని తెచ్చుకున్నవేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.  అట్లాంటాలోని అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సిగరెట్‌ పొగ వల్ల 12 రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇందులో ఊపిరితిత్తుల కేన్సర్‌ మొదటిది, ముఖ్యమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.



             ఏడాదిలో అమెరికా వ్యాప్తంగా పలు రకాల కేన్సర్లతో మరణించిన వారి సంఖ్య 3.5 లక్షలు కాగా అందులో 1.67 లక్షల మరణాలకు సిగరెట్‌ పొగే కారణమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన రెబెక్కా సీగల్‌ వివరించారు. ఈ గణాంకాలు కేవలం పొగరాయుళ్లవేనని, వారు వదిలే పొగతో కేన్సర్‌ బారిన పడ్డ వారిని లెక్కలోకి తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు వాడకంపై చైతన్యం తీసుకొచ్చే దిశగా ఎంతో చేయాల్సి ఉందని తెలిపారు.

Wednesday 17 August 2016

బ్రెడ్డు తింటే కేన్సర్ బోనస్

ఆరోగ్యం బాగోలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్డు తినమని డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తుంటారు. కానీ భారత ఆరోగ్య శాఖ నివేదిక చదివితే మాత్రం బ్రెడ్డు తిన్నా కేన్సర్ వస్తుందని తెలిసి జనం అవాక్కవుతున్నారు. ఎక్కడో మారుమూల పల్లెల సంగతి దేవుడెరుగు.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ కంపెనీలు యథేచ్ఛగా కేన్సర్ కారక పదార్థాలతో బ్రెడ్ తయారుచేసి విక్రయిస్తున్నాయి. బ్రిటానియా, కేఎఫ్ సీ, మెక్ డొనాల్డ్స్, డొమినోస్, పిజ్జా హట్ లాంచి రెస్టారెంట్లో ప్యాక్ చేసిన బ్రెడ్లో పొటాషియం బ్రోమైడ్, పొటాషియం అయొడైడ్ అవశేషాలున్నాయి.
             


ఆరోగ్య శాఖ పరీక్షించిన శాంపిల్స్ లో 84 శాతం కేన్సర్ కారక పదార్థాలున్నట్లు తేలింది. ఇవి తింటే కేన్సర్ కొని తెచ్చుకున్నట్లేనని అధికారులు ప్రకటించారు. అయితే బ్రాండెడ్ కంపెనీలు మాత్రం తాము నిషేధిత పదార్థాలు వాడటం లేదని చెవిలో పువ్వులు పెడుతున్నాయి. కానీ తమ ల్యాబుల్లో కాకుండా బయట ల్యాబుల్లో కూడా పరీక్షించాకే ఈ నివేదిక విడుదల చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే ప్యాకేజ్డ్ బ్రెడ్ ను విదేశాల్లో నిషేధించారని, మన దేశంలో మాత్రం యథేచ్ఛగా అమ్ముతున్నారని తెలుస్తోంది. కాబట్టి.. బ్రెడ్డు తినేముందు పారాహుషార్. 

Tuesday 16 August 2016

వాయుకాలుష్యంతో కేన్సర్ ముప్పు

వాయు కాలుష్యంతో కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.  ఈ ముప్పు ఆగ్నేయ ఆసియా దేశాల్లో అధికంగా ఉందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20 కాలుష్య నగరాల్లో ఆగ్నేయాసియాలో 14 ఉన్నాయి. ప్రపంచంలో ఏటా 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నాని, వీటిల్లో మూడింట రెండో వంతు మరణాలు మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల్లోనే ఉన్నాయంది. మరణాల్లో 22 శాతం పొగాకు, దాని ఉత్పత్తులు వాడకంతో సంభవిస్తున్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా రీజియన్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, డీపీఆర్ కొరియా, ఇండోనేసియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఉన్నాయి.



ఈ ప్రాంతంలోని పరిశ్రమల్లో కార్మికులకు సూర్య కిరణాలు, కేన్సర్ కారక రసాయనాల నుంచి  రక్షణ లేదు. మద్యపానం, అనారోగ్యకర ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. పొగాకు, మద్యం వాడకం తగ్గించే దిశగా, పర్యావరణ పరిస్థితుల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేలా కఠిన చట్టాలు తేవాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా డెరైక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ చెప్పారు. ప్రపంచ కేన్సర్ దినం సందర్భంగా ఆమె ఈ వివరాలు వెల్లడించారు. అలాగే హెచ్ పీవీ, హెపటైటిస్ బి, సీ, హెలికోబక్టర్ పైలోరి వల్ల వచ్చే   వ్యాధులు కేన్సర్‌కు కారణాలుగా ఉన్నాయన్నారు.

Monday 15 August 2016

బాల్యంలో పండ్లు తింటే కేన్సర్ దూరం




బాల్యంలో పండ్లు ఎక్కువగా తింటే రొమ్ముకేన్సర్‌ బారిన పడే ముప్పు తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకుంటే ఈ కేన్సర్‌ మరింత అధికమయ్యే ముప్పుదని, అమెరికాలోని టిహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 90వేల మంది నర్సులను 20ఏళ్ల పాటు పరిశీలించారు. చిన్నతనంలో వాళ్ల ఆహారపు ఆలవాట్లు, పండ్లు అధికంగా తీసుకున్నారో లేదా వివరాలను సేకరించారు. చిన్నతనంలో ఎక్కువగా పండ్లు తీసుకున్న వారిలో రొమ్ముకేన్సర్‌ ముప్పు 25శాతం తక్కువగా ఉందని తెలిపారు.
                   



డాక్టర్లు సూచించే సమతులాహారంలో పండ్లు కూడా భాగంగా ఉంటాయి. చిన్నప్పుడే పండ్లు తినడం అలవాటైతే.. శరీరంలో రోగనిరోదశక శక్తి పెరిగి కేన్సర్ తో పాటు మరే వ్యాధులు త్వరగా దరిచేరవని సైంటిస్టులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. పోషకాహారం, బలవర్థకమైన ఆహారం, సమతులాహారం, సంతులిత ఆహారం.. ఇలా పేరేదైనా ఆ ఆహారంలో పండ్లు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. వెజ్ అయినా,. నాన్ వెజ్ అయినా పండ్లు తినకుండా వాటిలో దొరికే పోషకాలను మరో పదార్థాన్ని తినడం ద్వారా పొందలేమని పరిశోధనలు చెబుతున్నాయి. 

Sunday 14 August 2016

వక్కపొడితో కేన్సర్ డేంజర్



వివాహాలు, శుభకార్యాలప్పుడు వక్కపొడి ఇవ్వడం మనకు తెలుసు. కానీ ఆ వక్కపొడి కేన్సర్ కు కారకంగా మారుతుందని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఆ ఒక్కటే కాదు అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయట. పాన్‌లో ఉప‌యోగించే త‌మ‌ల‌పాకు, యాల‌కులు, దాల్చిన చెక్క వరకు సరే. మిగ‌తా ప‌దార్థాల‌న్నీ ప్రాణాంత‌క క్యాన్స‌ర్‌ల‌ను కలుగజేస్తున్నాయని ది ఇంట‌ర్నేష‌న‌ల్ ఏజెన్సీ ఫ‌ర్ రీసెర్చ్ సంస్థ‌  ప‌రిశోధ‌కులు తేల్చారు. ఈ విష‌యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ధృవీక‌రించారు. కేన్సర్ లను క‌లిగించే ప‌దార్థాల‌న్నింటిలో వ‌క్క ప‌లుకులు ప్ర‌థ‌మ స్థానంలో ఉందని చెబుతున్నారు వాళ్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ‌క్క‌పొడి తిన‌డం వ‌ల్ల కేన్సర్ వచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయని చెప్పింది.



అదే పనిగా వక్క నమలం వల్ల నోరు, అన్న వాహిక‌ల‌కు చెందిన క్యాన్స‌ర్లు వ‌స్తాయ‌ని తేలింది. వ‌క్క‌పొడి ఎక్కువ‌గా తింటే స‌బ్ మ్యూక‌స్ ఫైబ్రోసిస్ అధికంగా ఉత్ప‌త్తి చెందుతుంది. అది ద‌వ‌డ క‌ద‌లిక‌ల్లో అంత‌రాయం కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ద‌వ‌డ‌లు పూర్తిగా బిగుసుకుపోయి ఏమీ తిన‌డానికి, తాగ‌డానికి వీలు పడదట. నోటికి రంధ్రాలు ప‌డి తిన్న‌దంతా బ‌య‌టికి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. అలాంటి ప్ర‌మాద‌క‌ర నోటి క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. వ‌క్క ప‌లుకులను ఎక్కువ‌గా తింటే దంతాలు, చిగుళ్లు రంగు మారుతాయి. వాటికి అల్స‌ర్లు వ‌స్తాయి. వ‌క్క ప‌లుకుల‌ను తినే స‌మ‌యంలో జీర్ణాశ‌యంలోకి అది వెళితే స‌మస్య‌లు వస్తాయి. గుండె జ‌బ్బులు వ‌చ్చే వీలు ఉందని వారు చెబుతున్నారు. 

Saturday 13 August 2016

బ్రెడ్ తో కేన్సర్ ఖాయం



పిజ్జాలో బ్రెడ్‌... బర్గర్‌లో బ్రెడ్‌.... చాయ్‌లోకి బన్ను... బట్టర్‌, జామ్‌ రాసిన బ్రెడ్‌ ముక్కలు... జ్వరమొస్తే ఆహారంగా బ్రెడ్‌. ఇంకా... శాండ్‌విచ్‌లు, పావ్‌భాజీ, టోస్టులతోపాటు రకరకాల రూపాల్లో బ్రెడ్‌ను మింగేస్తున్నాం. మొత్తానికి బ్రెడ్‌తో మనిషికి అవినాభావ ఆహారబంధం. అయితే... ఇదే బ్రెడ్డులు, బన్నులలో కేన్సర్‌ కారక రసాయనాలున్నాయని తేలింది. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఈ సంగతి తేల్చింది. బ్రెడ్డు తయారీలో పొటాషియం బ్రోమేట్‌, పొటాషియం అయోడేట్‌ ఉపయోగిస్తారు. కేన్సర్‌ కారక రసాయనాల జాబితాలో పొటాషియం బ్రోమేట్‌కూడా ఒకటి. ఇక పొటాషియం అయేడేట్‌వల్ల శరీరంలో అయోడిన్‌ స్థాయి పెరిగి థైరాయిడ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతిమంగా... థైరాయిడ్‌ కేన్సర్‌ రావొచ్చు. ప్రము ఖ కంపెనీలుసహా మార్కెట్‌లోగల బ్రెడ్‌లు, బన్నులపై సీఎ్‌సఈ పరీక్షలు చేసింది. బేకరీల నుంచి సేకరించిన 84 శాతం శాంపిల్స్‌లో బ్రోమేట్‌, అయోడేట్‌ అవశేషాలున్నట్లు తెలిపింది.





                             పొడి లేదా గుళికల రూపంలో ఉండే పొటాషియం బ్రోమేట్‌కు రంగు, రుచి, వాసన ఉండవు. దీన్ని పులియబెట్టే ఉత్ప్రేరకంగా వాడతారు. దీనివల్ల కేన్సర్‌ ముప్పుందని అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధన సంస్థ నిర్ధారించింది. ఈ రసాయనాన్ని కేటగిరీ-2బీలో చేర్చింది. దీనివల్ల కడుపునొప్పి, డయేరియా, తల తిరగడం, వాంతులు, కిడ్నీ వైఫల్యం, చెవుడు, బీపీ, డిప్రెషన్‌వంటి సమస్యలూ తలెత్తుతా యని వివిధ పరిశోధనల్లో తేలింది. ఈ రసాయనాన్ని ఆహార పదార్థాల తయారీలో వినియోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్‌ఏవోల సంయుక్త నిపుణుల కమిటీ ఎప్పుడో స్పష్టం చేశాయి. బ్రోమేట్‌ను అనేక దేశాల్లో నిషేధించారు. పొరుగునే ఉన్న శ్రీలంక, చైనాల్లోనూ నిషేధం ఉంది.

సాఫ్ట్ డ్రింక్స్ తో ప్రోస్టేట్ కేన్సర్



సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఎక్కువుగా తాగే పురుషుకు ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయట. స్వీడన్‌కు చెందిన శాస్తవ్రేత్తల నూతన పరిశోధనలో ఈ విషయం వెల్లడెైంది. ఈ అంశంపెై పదిహేనేళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఒక రోజుకు సుమారు 300 ఎంఎల్‌ సాఫ్ట్‌డ్రింక్‌ను తాగే పురుషులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు 40 శాతం వరకు ఉన్నాయి. సాఫ్ట్‌ డ్రింక్‌ తాగని వారితో పోల్చి చూసినపుడు ఈ ఫలితాలు వచ్చాయి. రక్తపరీక్షల ద్వారా మాత్రమే ప్రొస్టేట్‌ కేన్సర్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుందని డెయిలీ మెయిల్‌లో పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇన్సులిన్‌ హార్మోన్‌ విడుదలకు షుగర్‌ కారణమవుతుంది. ఈ అధ్యయనానికి సంబంధించిన అం శాలను అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌లో ప్రచురించారు.



గత అధ్యయనంలో కూడా పలు అంశాలు వెల్లడయ్యాయి. సాఫ్ట్‌ డ్రింక్‌ మోతాదుకు మించి తాగే పురుషలలో గుండెనొప్పులు, మధుమేహం, ఒబెసిటీ, పెళుసుగా ఉండే ఎముకలు, పాంక్రియాటిక్‌ కేన్సర్‌, కండరాల బలహీనత, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. 45-73 సంవత్సరాల వయస్సు గల 8,000 మంది పురుషులపెై పదిహేనేళ్లపాటు శాస్తవ్రేత్తలు అధ్యయనం చేశారు. రెైస్‌, పాస్తా, కేక్‌లు, బిస్కెట్లు, తియ్యగా ఉండే తృణధాన్యాల అల్పాహారం తీసుకుంటే ప్రొస్టేట్‌ కేన్సర్‌ వ్యాధి తీవ్రత తగ్గేందుకు తోడ్పడతాయి. 

Thursday 11 August 2016

పోషకాహారంతో కేన్సర్ దూరం



పోషకాల సహాయంతో కేన్సర్ వ్యాధిని తగ్గించాలనుకుంటున్నారా? అయితే వీటితో పాటుగా మందుల సహాయం కూడా అవసరమే, ఎందుకంటే కేన్సర్ ఆరోగ్యకర కణాలకు సోకకుండా ఉండాలంటే మందుల సహాయం తప్పక అవసరం. పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు మరియు మందులు కలిస్తే కేన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే అద్భుతమైన ఆయుధమని చెప్పవచ్చు. వీటి వలన పూర్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.



            తినే ఆహారాన్ని సరైన పద్దతిలో వండుకోవాలి. శరీరంలో అనారోగ్యాలను కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ మాత్రమే కాకుండా, ఇంట్లోనే వండే నూనె, చక్కెర, అనారోగ్యకర కొవ్వు కలిగి ఉండే ఆహారాలకు ,శరీరానికి కావలసిన మినరల్ మరియు విటమిన్ లు లేని ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు మరియు ఫైబర్ ఇతర ఆహార పదార్థాలు కేన్సర్ వ్యాధి పెరుగుదలకు వ్యతిరేఖంగా పోరాడటమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

లంగ్ కేన్సర్ కు క్యూబా మందు

అమెరికా పక్కనే ఉండే చిన్న ద్వీపం క్యూబా. పంచదార ఎక్కువగా పండించే ఈ దేశం లంగ్ కేన్సర్ రోగులకు ఒక తీపి వార్తను వినిపించింది. క్యూబా రాజధాని హవానాలో ఉన్న సెంట్రో దీ ఇమ్యునలోజియా మాలిక్యూల్ అనే పరిశోధనా కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని పట్టి పీడిస్తున్న లంగ్ కేన్సర్ భూతానికి వేక్సిన్ ను కనుగొన్నారు. దీనితో ఈ పరిశోధనా కేంద్రం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల దృష్టి పడింది. సిం అవాక్స్ పేరుతో పిలిచే ఈ వేక్సిన్ ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 5 వేల మందిమీద ప్రయోగించి సంతృప్తికర ఫలితాలు సాధించారట. 

 
ఈ వేక్సిన్ తీసుకున్న కేన్సర్ రోగుల జీవిత కాలం తీసుకొని వారికంటే సగటున 11 నెలలు ఎక్కువగా ఉందని సమాచారం. ఈ వేక్సిన్ తీసుకున్న ఆల్బర్ట్ సాన్చేజ్ అనే 77 ఏళ్ల వృద్ధుడు మాత్రం 2002 లోనే లంగ్ కేన్సర్ బారిన పడినా ఇప్పటికీ జీవించే ఉన్నాడు. వేక్సిన్ తో పాటు తనకున్న మనోధైర్యమే అతని జీవిత కాలం పెరగటానికి కారనామని ఆ సైంటిస్టులు అన్నారు. ఈ వేక్సిన్ ఇతర కేన్సర్ ఔషదాలలాగా కేన్సర్ కణాలను నేరుగా చంపివేయదని, శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి అది కేన్సర్ కణాలను చంపేలా చేస్తుందని అంటున్నారు. క్యూబాలోని ఈ పరిశోధనా కేంద్రం ఇప్పటివరకు 21 ప్రాణాంతక రోగాలకు వేక్సిన్లను కనుగొన్నది.

Tuesday 9 August 2016

శ్వాసతో లంగ్ కేన్సర్ గుర్తింపు



ప్రాణాంతక ఊపిరితిత్తుల కేన్సర్‌ను మొదటిదశలోనే పసిగట్టేందుకు సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లంగ్‌ కేన్సర్‌ ఇండికేటర్‌ డిటెక్షన్‌, లూసిడ్  గా వ్యవహరిస్తున్న ఈ పరికరం.. శ్వాసను పరీక్షించడం ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌ జాడలను ఇట్టే పసిగడుతుందని అన్నారు. కేంబ్రిడ్జికి చెందిన ఓవల్‌స్టోన్‌ నానోటెక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. లంగ్‌ కేన్సర్‌ సోకిన తర్వాత బాధితుల జీవితకాలం ఐదేళ్లకు పడిపోతుంది.
                         



లంగ్ కేన్సర్ ను ముందుగా గుర్తించడం వల్ల బాధితులను రక్షించేందుకు అవకాశం లభిస్తుందని ఓవల్‌స్టోన్‌ సహ వ్యవస్థాపకుడు బిల్లీ బోయలే తెలిపారు. ప్రస్తుతం తుది పరిశీలన దశలో ఉన్న లుసిడ్‌ను ఏడాదిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ పరికరంతో లంగ్‌ కేన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించవచ్చని వివరించారు.

Monday 8 August 2016

ఫ్రూట్స్ తో లంగ్ కేన్సర్ దూరం





పొగతాగే అలవాటు ఉన్న వారు లంగ్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవాలంటే.. ప్రతిరోజూ ఎనిమిది రకాల ఫ్రూట్స్‌ తీసుకోవాలి. ప్రతిరోజూ రకరకాల ఫ్రూట్స్‌ తీసుకుంటే లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 23 శాతం మేర తగ్గుతాయి. ఈ విషయం ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో వెల్లడయింది. రోజూ ఐదు రకాల పళ్లు, కూరగాయలు తీసుకుంటే రూన్సర్‌ రాకుండా నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే.



               యూరప్ లోని ఒక సంస్థ పలు దేశాలలో లంగ్‌ క్యాన్సర్‌పై పరిశోధనలు నిర్వహించింది. ఇందులో ఎక్కువ ఫ్రూట్స్‌ తీసుకోవడమే కాకుండా, రకరకాల కూరగాయలు తీసుకునే వారిలో కూడా లంగ్‌ క్యాన్సర్‌ రిస్క్‌ చాలా వరకు తక్కువగా ఉందని వెల్లడయింది. పొగతాగే అలవాటు మానుకోలేకపోతే ఫ్రూట్స్‌నైనా ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు క్యూబాలో లంగ్ కేన్సర్ కు కొత్త వ్యాక్సిన్ కనిపెట్టారు. అయితే ఇదింకా పరిశోధన దశనలోనే ఉందని, త్వరలోనే ఫలితాలు వెల్లడలిస్తామని సైంటిస్టులు చెబుతున్నారు. 

Sunday 7 August 2016

గ్లాసు బీరుతో కేన్సర్ ఖాయం

ప్రతిరోజూ ఒక గ్లాసు బీరు లేదా వైన్‌ తాగితే.. అన్నవాహిక కేన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుందట. అలాగే స్థూలకాయం వల్ల కూడా భారతీయులకు కేన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉందట. శారీరక శ్రమలేని జీవనశైలి, స్థూలకాయం, పెరుగుతున్న మద్యపానం అలవాటు కారణంగా భారతీయుల ఆరోగ్యం దెబ్బతింటోందని బెంగళూరుకు చెందిన బేరియాట్రిక్‌, గ్యాసో్ట్రఎంటరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2007 నుంచి 31 వేల మంది కేన్సర్‌ రోగులపై జరిగిన 46 పరిశోధనలను విశ్లేషించిన వీరు.. ముఖ్యంగా ఊబకాయం, ఆల్కహాల్‌ వల్లే.. అన్నవాహిక, క్లోమ, పురీషనాళ, ఛాతీ, కిడ్నీ, థైరాయిడ్‌ వంటి భాగాలకు కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందని గుర్తించారు.





                 రోజుకు 10 గ్రాముల ఆల్కహాల్‌ తీసుకునేవారికి కేన్సర్‌ ముప్పు 25 శాతం పెరిగినట్లు వీరు వెల్లడించారు. ఆరోగ్యకర జీవనశైలి, పండ్లు, శాకాహారం తీసుకోవడం, వ్యాయామం ద్వారానే కేన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు. ఆల్కహాల్ తో కేన్సరే కాదు చాలా రోగాలు వస్తాయని నిపుణులు చెప్పడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలా అధ్యయనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. 

Saturday 6 August 2016

కేన్సర్ ను నయం చేసే రోబో

కేన్సర్ శస్త్రచికిత్సల కోసం త్వరలోనే హైదరాబాద్‌కు రోబో రాబోతోంది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రితోపాటు తమిళనాడులోని అడయార్ ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రికి, బెంగళూరులోని కిద్వాయ్ ప్రభుత్వ ఆస్పత్రికి కూడా కేంద్ర ప్రభుత్వం రోబోలను మంజూరు చేసింది. ఈ రోబో విలువ రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఎంఎన్‌జేకు మంజూరైన కేన్సర్ రోబో మెషీన్ అత్యంత ఆధునిక వైద్య సేవలకు ఉపయోగించేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.


               ప్రస్తుతం కేన్సర్ చికిత్సలో అత్యాధునిక సేవలంటే ల్యాప్రోస్కోపీ శస్త్రచికిత్సలే. చిన్నగాటు వేసి నొప్పిలేకుండా చేస్తున్న వాటినే ల్యాప్రోస్కోపీ చికిత్సలంటారు. దీనికి మించి మెరుగైన సేవలను రోబో అందిస్తుంది. రోబో మెషీన్ మంజూరైన విషయం వాస్తవమని, ఇది ఆస్పత్రికి వచ్చేందుకు ఏడాది సమయం పట్టే అవకాశముందని ఎంఎన్జే ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల కేన్సర్ రోగులకు అద్భుతమైన సేవలు అందుతాయన్నారు. ఏపీ నుంచి కూడా పేద రోగులు ఇప్పటికీ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికే వస్తున్నారు.
 

Friday 5 August 2016

అమ్మో కేన్సర్

కేన్సర్ మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. కేన్సర్ నివారణ పద్ధతులపై ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా.. కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో కేన్సర్‌తో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కేన్సర్ మరణాల్లో 34% మంది రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్ల కారణంగానే సంభవిస్తున్నాయి. కేన్సర్‌తో మరణించే మహిళల్లో 26.4% మంది రొమ్ము, గర్భాశయ కేన్సర్ల కారణంగానే చనిపోతున్నారని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి.. రాష్ట్రాలకు పంపించింది.


దీర్ఘకాలిక వ్యాధుల్లో ప్రధానంగా కేన్సర్, గుండె జబ్బులు,  మధుమేహం, హైబీపీ, వంటివి ఉన్నాయి. 2012లో దేశవ్యాప్తంగా 1.45 లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారినపడగా.. వారిలో 70,218 మంది చనిపోయారు. అలాగే ఏటా సగటున సుమారు 1.23 లక్షల మంది మహిళలు గర్భాశయ కేన్సర్ బారిన పడుతుండగా.. అందులో 67,500 మంది మరణిస్తున్నారు. 

Thursday 4 August 2016

బ్రెస్ట్ కేన్సర్ నివారణకు చిట్కాలు

స్థూలకాయం ఉన్నట్లయితే మెనోపాజ్‌ తరువాత బ్రెస్ట్‌కేన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. బాడీమా్‌స్ ఇండెక్స్‌  25 లోపల ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌, ఫ్యాటీ ఫుడ్స్‌ తక్కువగా తీసుకోవాలి. ధాన్యాలు ఎక్కువగా తినాలి. ప్రతిరోజు అరగంటపాటు వ్యాయామం చేయాలి. ఫిజికల్‌గా యాక్టివ్‌ ఉన్న వారిలో బ్రెస్ట్‌ కేన్సర్‌ రిస్క్‌ 30 శాతం వరకు తగ్గిపోతుంది. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరఫీ వల్ల బ్రెస్ట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తప్పనిసరిగా హార్మోన్‌ థెరపీ తీసుకోవాల్సి వస్తే ప్రొజెస్టిరాన్‌ ఉన్న మందులను తీసుకోకూడదు. తీసుకోవాల్సి వచ్చినా ఎక్కువ కాలం వాడకూడదు.
         

         బయోఐడెంటికల్‌ హార్మోన్స్‌, హార్మోనల్‌ క్రీమ్స్‌, జెల్స్‌కు దూరంగా ఉండాలి. ఒక ఏడాది పాటు పిల్లలకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి వీలైనంత వరకు బ్రెస్ట్‌ఫీడింగ్‌ను కొనసాగించాలి. కుటుంబసభ్యుల్లో బ్రెస్ట్‌కేన్సర్‌ వచ్చిన చరిత్ర ఉన్న మహిళలు, అరవై ఏళ్లు పైబడిన వారు ఈస్ర్టోజన్‌ బ్లాకింగ్‌ డ్రగ్స్‌ ఉపయోగించే ముందులు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.

Wednesday 3 August 2016

పసుపుతో కేన్సర్ కు చెక్

ప్రాణాంతక సమస్యల్లో పెద్దపేగు కేన్సర్ ఒకటి. ఇటీవల ఇలాంటి కేన్సర్ కేసులు పెరగటం ఏంతో ఆందోళన కలిగిస్తోన్న అంశం. తగిన జాగ్రత్తలు తీసుకొంటే ఈ సమస్యను నివారించటం సాధ్యమే. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత మిగిలిన వ్యర్ధాలు మలంగా మారతాయి. దీనిని బయటికి పంపటమే పెద్దపేగు పని. పెద్దపేగు)కు సోకిన కేన్సర్ ను కొలన్ కేన్సర్ అనీ, పెద్దపేగు చివరి భాగమైన పాయువుకు సోకితే రెక్టల్ కేన్సర్ అంటారు. పసుపుకు పెద్ద పేగు కేన్సర్‌ను నివారించే శక్తి ఉందని సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.



        పసుపు దుంపలను సిలిమారిన్ తో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. కాలేయ వ్యాధి నివారణకు సంబంధించి ఈ మిల్క్ తిస్టిల్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పరిశోధన ఇంకా కొనసాగుతోంది. త్వరలో అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.  పెద్ద పేగుకు కేన్సర్ సోకినప్పుడు పేగు బిగుసుకు పోవటం, పేగులోపల తిత్తులు(పాలిప్స్) ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు అసలు కనిపించక పోవచ్చు. పెద్దపేగు కేన్సర్ వంశపారంపర్యంగా వస్తుందని చెప్పే ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా రాదని మాత్రం గ్యారెంటీ లేదు. అందుకే పెద్దలకు ఈ సమస్య ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా 15 ఏళ్ళు నిండిన వారి పిల్లలకు ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించటం అవసరం. 

బ్రెస్ట్ కేన్సర్‌ లక్షణాలు

స్త్రీల పాలిట మహమ్మారి బ్రెస్ట్ కేన్సర్‌ నిరోధానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శక సూత్రాలు రూపొందించింది. మహిళలు రజస్వల అయిన అనంతరం నెలకు రెండుసార్లు చొప్పున తమ వక్షోజాలను పరిశీలిస్తూ, ఈకింది అంశాలేవీ లేవని నిర్ధారించుకోవాలి.  వక్షోజంలో గడ్డలు, కణుతులు వంటివి ఉన్నాయా?
ఒకవేళ ఏమైనా గడ్డవుంటే, దానిపై చర్మం కదులుతోందా? గట్టిగా కదలకుండా ఉందా?  గొంతు, మెడ, చంకల వద్ద ఏమైనా గడ్డలుగాని కణుతులుగాని ఉన్నాయా?


             వక్షోజంపై ప్రత్యేకించి ఒక ప్రదేశంలో చర్మం రంగు మారిందా? ఆ చనుమొననుంచి రక్తం స్రవిస్తోందా?  వక్షోజంలో అల్సర్‌ ఉందా? వక్షోజం రంగు పాలిపోయిన ఆరం జిరంగులోకి మారిందా? వక్షోజం ఒకవైపునుంచి మరోవైపుకు కదులుతోందా? లేదా? నొప్పిగా ఉందా? ఈ అంశాలలో ఏ ఒక్కటి గుర్తించినా.. వెంటనే కేన్సర్‌ స్పెషలిస్టును సంప్రదించండం తప్పనిసరి. అంతేకాకుండా కేన్సర్ స్పెషలిస్టులు చెప్పే ముఖ్యమైన జాగ్రత్తలు వెంటనే పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Monday 1 August 2016

పోషకాహారంతో కేన్సర్ దూరం

ఆరోగ్యమైన కొవ్వుతో ఉండే మధ్యధరా ఆహారమైన ఫ్యాటీ ఫిష్‌, గుడ్లు, ఆలీప్‌ అయిల్‌, అవకాడోస్‌, వివిధ రకాల గింజలు మొదలైన వాటిని తీసుకుంటే గుండె జబ్బు, టైప్‌-2 మధుమేహం, బ్రెస్ట్‌ కేన్సర్‌ వంటి జబ్బులు అభివృద్ధి కాకుండా ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది. అధిక కొవ్వు పదార్థలు సేవించడానికి వివిధ రుగ్మతలు తగ్గుముఖం పట్టాడానికి యాంటీ ఇన్‌ప్లెమేటరీ ప్రభావం కారణమని అమెరికాలోని క్రానిక్‌ డిసీజ్‌ ఔట్‌కమ్స్‌ రీసర్చ్‌ కేంద్రానికి చెందిన హన్నా బ్లూమ్‌ఫీల్డ్‌ తెలిపారు. అధిక కొవ్వు తీసుకోవానికి, మరణాలకు సంబంధం లేదన్నారు. కొవ్వును పరిమితంగా తీసుకునే వారు, చెక్కర, శుద్ధి చేయని ధన్యాల నుంచి కెలరీలను పొందుతుంటారని బ్లూమ్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు.
     

పండ్లు, కూరగాయలలో ఉండే విటమిన్, మినరల్స్ కేన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి. ఇవి కేన్సర్ వ్యాధి వలన ప్రమాదానికి గురైన కణాలను తిరిగి యధా స్థానానికి తీసుకురావటంలో సహాయపడతాయి.  మాంసం, రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా పోషకాలు అధికంగా గల పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.