Saturday 30 June 2018

వైద్యో నారాయణో హరి


మనిషి అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యుడు చికిత్స చేసి దాన్ని నయం చేయడమే కాదు.. కొన్నిసార్లు ప్రాణాలు పోయే విషమస్థితి నుంచి సర్వవిధాలుగా ప్రయత్నించి ఆ రోగికి ప్రాణం పోస్తాడు. అందుకే వైద్యున్ని వైద్యో నారాయణో హరి.. అనగా దేవుడుతో సమానంగా చూస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే లెక్కల ప్రకారం వారి ప్రమాణాల ప్రకారం 2022 నాటికి భారత్ జనాభాకు అదనంగా కావాల్సిన వైద్యుల సంఖ్య 4,00,000 అని తెల్చి చెప్పింది. పూర్వకాలంతో పోలిస్తే ప్రస్తుత గ్లోబల్ యుగంలో వైద్యుడు, వైద్యం చాలా ఖరీదైనాయి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న జనాలను వెళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాగే ఫిజీషియన్స్ అంతే బిజీగా ఉంటున్నారు.

బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లాలోని బంకింపుర్‌లో 1882 జూలై ఒకటిన జన్మించిన బీథార్ చంద్రరాయ్ అనేక శ్రమల కోర్చి పట్టుదలతో కలకత్తాలో వైద్య విద్యను అభ్యసించారు. అనంతరం కొన్నేళ్లు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాడు. సామాజిక వేత్తగా పేరొందిన ఆయన చిత్తరంజన్‌దాస్ అనుచరుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం అనేక పదవులు పొందా రు. 1948లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన జీవిత కాలంలో వివిధ పదవుల్లో ఉన్నప్పుడు చేసిన అపార సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 1961లో భారతరత్న అవార్డుతో సత్కరించింది. వైద్యుడిగా మొదలైన ఆయన జీవితం ప్రజాసేవతో ముగియడంతో ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును డాక్టర్స్ డేగా పరిగణించి, ప్రతి ఏటా జరుపుకుంటోంది.


వైద్య వృతి కత్తి మీద సాము లాంటిదే. ఏ మాత్రం డోస్ పెరిగినా, లేదా రోగి శరీరంలో ఆకస్మిక మార్పులు వచ్చినా డాక్టకే ఇబ్బంది. వైద్యం గురించి, దాని విధానం గురించి ఓనమాలు తెలియని సగటు మనిషి డాక్టర్నే నిందిస్తాడు. డాక్టర్నే టార్గెట్ చేస్తాడు. కారణం నమ్మకమంతా ఆయనపైనే పెడతారు కాబట్టి.. అవతలి వారి ప్రాణాలతో బాధ్యత వ్యవహరించాల్సి రావడం వల్ల మిగతా జీవితాల కంటే వైద్య వృత్తిలో తమకు మానసికంగా ఒత్తిళ్లుంటాయని పలువురు డాక్టర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆర్కెవ్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్‌లో బర్న్ అవుట్ అనే శీర్షికన సంపాదనాపరంగా కాకుండా మానసిక ఒత్తిళ్ల నేపథ్యంలో అధ్యయనాలు చేపట్టి డాక్టర్లపై కథనాలను ప్రచురించింది. దాదాపు 36 శాతం మంది ఫిజీషియన్లు బాధ్యతను భారంగా భావిస్తున్నారని 2,556 మంది డాక్టర్లపై జరిపిన అధ్యాయనంలో తేలింది. ఈ ఒత్తిడి 40 శాతం డాక్టర్లలో ఉంటుందని మరో తాజా నివేదిక వెల్లడించింది.


సగటు మనిషికి తన వృత్తిలో కానీ, ప్రవృత్తిలో కానీ సెలవులు ఉండొచ్చు. మాకు సరాదాలు లేవు.... సెలవులూ లేవు... ఉండవు.. చిన్న చిన్న సరదాలు మా హ్యాపీడేస్‌తో ఎండ్ అయ్యాయిని డాక్టర్ల మనస్సులోని మాట. ఇక మిగిలింది వృత్తిపరమైన ఆనందమే అదీనూ ప్రాణాపాయ స్థితిలో రోగికి తిరిగి ప్రాణాలను తీసుకొచ్చి వారి కళ్లలో ఆత్మీయ ఆనందం చూసినప్పుడు అని అ జర్నల్ ప్రచురించింది. వారు నిత్యం రోగులతోనూ రోగాన్ని కలిగించే క్రిములతో వివిధ డోస్‌ల్లో మందులు ఇచ్చి వ్యాధి కారక జీవులపై అప్రకటిత యుద్ధం చేస్తున్నారు. ఈ ధన్వంతరిలు కొన్నిసార్లు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలు కూడా మరిచి పోతూ..... ఆవిధంగా వారు రోగుల సేవలో మానసా, వాచా.. కర్మణా నిమగ్నమైతారు. స్నేహితులతో గడపడం, వేడుకలకు హాజరుకావడం వీరికి కష్టతరమే. జీవిత భాగస్వామి కంటే ధన్వంతరి తన వృత్తి జీవితానికే ప్రాధాన్యత ఇస్తాడు. ఇక వృత్తిలో ఇలాంటి సాధక బాధలను అర్ధం చేసుకోగలరనే ఉద్దేశంతో అదే వృత్తిలో అనగా డాక్టర్‌గా పనిచేసే వారినే జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటున్నారట!




Friday 29 June 2018

నానో కణాలతో కేన్సర్ కు చికిత్స


వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని నానుడి. ఇది కేన్సర్‌ విషయంలోనూ వర్తిస్తుందని అంటున్నారు పెన్‌ స్టేట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కేన్సర్‌ కణాలు రోగనిరోధక వ్యవస్థ కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతుందని.. తద్వారా వ్యాధి ముదిరిపోయేందుకు అవకాశముంటుందన్నది తెలిసిన విషయమే. కేన్సర్‌ కణితి చుట్టూ ఏర్పడే రక్తనాళాలు రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలను, మందులను కూడా అడ్డుకోవడం దీనికి కారణం.  ఈ సమస్యను అధిగమించేందుకు పెన్‌ స్టేట్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిపై ప్రయోగాలు చేశారు.

కేన్సర్‌ కణితిలోని కణాలను తీసుకుని వాటిల్లోకి కేన్సర్‌ చికిత్సకు వాడే మందులను జొప్పించారు. ఈ కణాలను మళ్లీ శరీరంలోకి జొప్పించినప్పుడు అవి కేన్సర్‌ కణాల రక్షణ వ్యవస్థలను తప్పించుకుని నేరుగా కణితిపై దాడి చేయగలిగింది. సాలెగూడు పోగులు, బంగారు నానో కణాలు, తెల్ల రక్తకణాలతో గతంలో ఇలాటి ప్రయత్నం జరిగినప్పటికీ అంతగా ప్రభావం లేకపోయింది. తాజాగా మెటల్‌ ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌’తో తయారైన నానో కణాల్లోకి గెలోనిన్‌ అనే మందును జొప్పించి తాము ప్రయోగాలు చేశామని కణితినుంచి సేకరించిన గొట్టంలాంటి నిర్మాణాల్లోకి వీటిని చేర్చి ప్రయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సియాంగ్‌ ఝెంగ్‌ తెలిపారు.

Thursday 28 June 2018

కేన్సర్ చికిత్సకు సులువైన మార్గం



కేన్సర్‌ చికిత్సలో ఓ చిత్రమైన చిక్కు ఉంది. మరీ ముఖ్యంగా కీమోథెరపీ విషయంలో. ఏ మందు ఎవరికి పనిచేస్తుందో కచ్చితంగా చెప్పడం కష్టం. మందు వాడాలి. పనిచేయకపోతే మళ్లీ కణితి నమూనా సేకరించి ఇంకో మందును ఉపయోగించాలి. ఇదీ ఇప్పటివరకూ జరుగుతున్న పద్ధతి. ఇకపై మాత్రం ఈ అవస్థల అవసరం ఉండదు. జర్మనీలోని హైడల్‌బర్గ్‌ యూనివర్సిటీ అధ్యాపకుడు, భారతీయ సంతతి శాస్త్రవేత్త ఉత్తరాల రమేశ్‌ పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు అతితక్కువ కాలంలో బోలెడన్ని కీమోథెరపీ మందులను పరీక్షించవచ్చు.



అతిసూక్ష్మమైన గొట్టాలతో తయారైన ఓ యంత్రంతో ఒకట్రెండు మందులు కలిపి, లేదా విడివిడిగా రాత్రికిరాత్రి పరీక్షించవచ్చు, అరచేతిలో ఇమిడిపోయే ఈ యంత్రం ఏకంగా వెయ్యి రకాల కాంబినేషన్లను పరిశీలించగలదు. దీనివల్ల పదేపదే బయాప్సీలు చేయాల్సిన అవసరం ఏర్పడదని.. రోగులకు సరిపడే మెరుగైన మందును ఎంచుకోవడం సాధ్యమవుతుందని రమేశ్‌ అంటున్నారు. రోగి శరీరం నుంచి సేకరించిన కణితి కణాలు అతితక్కువ సంఖ్యలో వాడుకుంటూ మందులు పరిశీలించవచ్చునని చెప్పారు. ఈ పరికరాన్ని తాము ఇప్పటికే నలుగురు కేన్సర్‌ రోగులపై పరీక్షించి మెరుగైన ఫలితాలు సాధించామని వివరించారు.

Wednesday 27 June 2018

నాన్ స్టిక్ తో కేన్సర్



వంట సులువుగా పూర్తి చేయడమే కాకుండా, శుభ్రం చేయడానికి కూడా

తేలికగా ఉండటంతో ఇటీవలి కాలంలో నాన్‌స్టిక్‌ పాత్రల వాడుక బాగా

పెరిగింది. అయితే, వీటితో కేన్సర్‌ ముప్పు పొంచి ఉందని అమెరికన్‌

నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్‌స్టిక్‌ పాత్రల తయారీలో వాడే

రసాయనాలు ఆహార పదార్థాల్లో కలిసిపోయి, అవి కేన్సర్‌కు దారితీసే

అవకాశాలు ఉన్నాయని వాషింగ్టన్‌లోని ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌

ఏజెన్సీకి చెందిన నిపుణులు చెబుతున్నారు.



నాన్‌స్టిక్‌ పాత్రల్లోని ‘పీఎఫ్‌ఓఏ’, బిస్‌ఫెనాల్‌–ఏ (బీపీఏ) రసాయనాలకు

కేన్సర్‌ కలిగించే లక్షణం ఉందని, నాన్‌స్టిక్‌ పాత్రల్లో వండే పదార్థాల్లో

పీఎఫ్‌ఓఏ, బీపీఏ రసాయనాలు మోతాదుకు మించి ఉంటున్నాయని తమ

పరిశీలనలో తేలినట్లు వారు వెల్లడించారు. ఈ రసాయనాల ప్రభావం వల్ల

కేన్సర్‌తో పాటు ఆటిజం, స్థూలకాయం, ఏడీహెచ్‌డీ, టైప్‌–2 డయాబెటిస్,

థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో అవాంఛితమైన మార్పులు, హార్మోన్ల

సమతుల్యత దెబ్బతినడం వంటి ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు

కూడా ఎక్కువగా ఉంటాయని వాషింగ్టన్‌ నిపుణులు వివరిస్తున్నారు.

Monday 25 June 2018

వంకాయలో ఏముంది?




మనం ప్రతిరోజు రకరకాల కూరగాయలు తింటూ ఉంటాం. ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. వీటన్నింటిలో రారాజు అయినటువంటి వంకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంకాయ వంటి కూర, శంకరుని వంటి దైవం లేదని అంటారు. నోరూరించే రుచితో పాటు వంకాయ వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

ఇందులో విటమిన్స్, మినరల్స్‌తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వంకాయ తొక్కులో ఉండే యాంధోసియానిన్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్ కారకాలతో పోరాడతాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారికి వంకాయ ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.



1. వంకాయ శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ కె శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్సడకుండా నిరోధిస్తుంది.

2. వంకాయలో క్యాలరీస్ అస్సలు ఉండవు. కనుక బరువు తగ్గాలి అనుకుంటే మనం తరచూ వంకాయ తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలు బాగా జరిగేలా చేస్తుంది.

3. వంకాయ రక్తంలోని చక్కెర స్ధాయిలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో రక్తప్రసరణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.

4. వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగా ఉప్పుతో తింటే గ్యాస్ ట్రబుల్, ఎసిడిటి, కఫము తగ్గుతాయి.

5. వంకాయలు ఆకలిని పుట్టిస్తాయి. వాతాన్ని తగ్గిస్తాయి. శుక్రాన్ని వృద్ధిచేస్తాయి. శరీరంలో వాపు, నరాల బలహీనతను తగ్గించే శక్తి వంకాయకు ఉంది. అంతేకాకుండా ఇది వృద్ధాప్య చాయలు దరిచేరనీయదు.

విటమిన్ డీతో బ్రెస్ట్ కేన్సర్ కు సంబంధం



మహిళలను ఎక్కువగా బలి తీసుకుంటున్న వ్యాధుల్లో బ్రెస్ట్ కేన్సర్ ముందు వరుసలో ఉంటుంది. ఈ వ్యాధిని ఆరంభ దశలో గుర్తిస్తే సులువుగా అరికట్టొచ్చు. కానీ నిర్ధారణ ఆలస్యమైతే మాత్రం ఈ మహమ్మారి చికిత్సకు లొంగదు. రొమ్ము కేన్సర్‌ రిస్క్ బారిన పడకుండా ఉండటానికి విటమిన్-డిని ఎక్కువగా తీసుకుంటే ఫలితం ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. కాలిఫోర్నియాలోని శాన్ డియిగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధలో ఈ విషయం వెల్లడైంది.

ఇందుకోసం 55 ఏళ్ల పైబడిన 3323 మంది మహిళలను 2002 నుంచి 2017 మధ్య నిశితంగా పరిశీలించారు. రక్తంలోని ప్లాస్మాలో 25(OH)D గా పిలిచే సీరం 25-హైడ్రాక్సీ విటమిన్ డి మోతాదు మిల్లీ లీటర్‌కు 60 నానో గ్రాములు ఉన్నవారిలో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే ముప్పు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. సాధారణంగా ప్లాస్మాలో 25(OH)D మోతాదు 20 ng/ml ఉంటే ఆరోగ్యకరమని పరిశోధకులు చెబుతారు. కానీ వారితో పోలిస్తే 25(OH)D మోతాదు 60 ng/ml ఉన్నవారిలో రొమ్ము కేన్సర్ బారిన పడే ముప్పు ఐదో వంతు మాత్రమేనని గుర్తించారు. సీరం విటమిన్ డి మోతాదు పెరిగే కొద్దీ కేన్సర్ ముప్పు తగ్గుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.



అయితే ఈ పరిశోధనలో భాగమైన వాళ్లంతా శ్వేత జాతి మహిళలు మాత్రమే. ఆసియా, ఆఫ్రికా తదితర దేశాల మహిళలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇంకా తేలాల్సి ఉంది. అంతేగాకుండా.. ఈ పరిశోధనలు మెనోపాజ్ దశ దాటిన వారిపైన చేసినవేనని పరిశోధకులు తెలిపారు. 

Sunday 24 June 2018

వయసు మీదపడినా యవ్వనంగా కనిపించాలా..?





చాలా మందికి వయసు మీదపడుతున్నా తామింకా యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం చేయని ప్రయత్నాలంటూ ఉండవు. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే వారు అనుకున్నట్టుగానే కనిపించవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.

వయస్సు మీద పడినా తెలియకుండా ఉండాలంటే ప్రతి రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటిని తీసుకోవడం ద్వారా యవ్వనంగా కనిపించడంతో పాటు స్కిన్ కేన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చునని వారంటున్నారు.



ముఖ్యంగా, సూర్య కిరణాల నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల రేడియేషన్ ప్రభావంతో కలిగే చర్మ వ్యాధులను నియంత్రించడంలో ద్రాక్ష పండ్లు ఎంతగానో సహకరిస్తాయట. అతినీలలోహిత కిరణాలు(యూవీ) చర్మ కణాలను సత్తువ లేకుండా చేస్తాయి.

తద్వారా చర్మం పాలిపోవడంతో పాటు వయసుమీద పడినట్లు స్కిన్ కనిపిస్తుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా యూవీ ప్రభావాన్ని చర్మంపై సోకకుండా చాలావరకు నియంత్రిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Saturday 23 June 2018

గర్భాశయ కేన్సర్‌ చికిత్సకు బ్లూబెర్రీ



గర్భాశయ కేన్సర్‌ నివారణ కోసం చేసే రేడియేషన్‌ చికిత్సకు కేన్సర్‌ కణాలు బాగా స్పందించేలా బ్లూబెర్రీలు ఉపయోగపడుతాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరీ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్లూబెర్రీల సారం రేడియోసెన్సిటైజర్లలా వ్యవహరిస్తాయని, హానికరం కాని ఈ రసాయనం.. కేన్సర్‌ కణాలు రేడియేషన్‌ చికిత్సకు స్పందించేలా చేస్తాయని వెల్లడించారు.



బ్లూబెర్రీలలో రెస్వెట్రాల్‌(ప్రొస్టేట్‌ కేన్సర్‌ను అడ్డుకునే రేడియోసెన్సిటైజర్‌), ఫ్లెవొనాయిడ్స్‌ అనే రసాయనాలు ఉంటాయని, అందులో ఫ్లెవొనాయిడ్స్‌ ప్రతిక్షకారినిలా, శోథ నిరోధకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.



















































Friday 22 June 2018

నానోకణాలతో కేన్సర్‌కు కొత్త చికిత్స..



వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని నానుడి. ఇది కేన్సర్‌ విషయంలోనూ వర్తిస్తుందని అంటున్నారు పెన్‌ స్టేట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కేన్సర్‌ కణాలు రోగనిరోధక వ్యవస్థ కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతుందని.. తద్వారా వ్యాధి ముదిరిపోయేందుకు అవకాశముంటుందన్నది తెలిసిన విషయమే. కేన్సర్‌ కణితి చుట్టూ ఏర్పడే రక్తనాళాలు రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలను, మందులను కూడా అడ్డుకోవడం దీనికి కారణం.  ఈ సమస్యను అధిగమించేందుకు పెన్‌ స్టేట్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిపై ప్రయోగాలు చేశారు.



కేన్సర్‌ కణితిలోని కణాలను తీసుకుని వాటిల్లోకి కేన్సర్‌ చికిత్సకు వాడే మందులను జొప్పించారు. ఈ కణాలను మళ్లీ శరీరంలోకి జొప్పించినప్పుడు అవి కేన్సర్‌ కణాల రక్షణ వ్యవస్థలను తప్పించుకుని నేరుగా కణితిపై దాడి చేయగలిగింది. సాలెగూడు పోగులు, బంగారు నానో కణాలు, తెల్ల రక్తకణాలతో గతంలో ఇలాటి ప్రయత్నం జరిగినప్పటికీ అంతగా ప్రభావం లేకపోయింది. తాజాగా మెటల్‌ ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌’తో తయారైన నానో కణాల్లోకి గెలోనిన్‌ అనే మందును జొప్పించి తాము ప్రయోగాలు చేశామని కణితినుంచి సేకరించిన గొట్టంలాంటి నిర్మాణాల్లోకి వీటిని చేర్చి ప్రయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సియాంగ్‌ ఝెంగ్‌ తెలిపారు.





Thursday 21 June 2018

గ్రీన్ టీ తో కేన్సర్ దూరం



గ్రీన్‌ టీలో బోలెడన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని, తరచూ ఈ పానీయాన్ని సేవించడం ద్వారా కేన్సర్‌ను నివారించవచ్చునని మనం తరచూ వింటుంటాం. ఇందులో వాస్తవం లేకపోలేదు.  భారతియార్, స్వాన్‌సీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి తేయాకులోకి కొన్ని ప్రత్యేక కణాల ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌కు సమర్థమైన చికిత్స ఇవ్వవచ్చని నిరూపించారు. ఈ క్వాంటమ్‌ డాట్‌ కణాలు అతి సూక్ష్మమైనవి. ధర్మాలూ అనూహ్యం. కొన్ని రసాయనాలతో కలిసి వేర్వేరు రంగుల్లో ప్రతిదీప్తిని కనబరుస్తాయి. అందువల్లనే వీటిని ఇప్పటికే సోలార్‌ సెల్స్‌ మొదలుకొని వైద్య పరీక్షల్లోనూ వాడుతున్నారు. కేన్సర్‌ చికిత్సలోనూ, యాంటీబయాటిక్‌ నిరోధకతను ఎదుర్కొనేందుకూ ఈ క్వాంటమ్‌ డాట్స్‌ ఉపయోగపడుతున్నాయి.



ఈ నేపథ్యంలో భారతియార్, స్వాన్‌సీ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు తేయాకు నుంచి క్వాంటమ్‌ డాట్‌ కణాలను వెలికి తీశారు. వీటి సమక్షంలో ఊపిరితిత్తుల కేన్సర్‌ కణాలు వెలిగిపోవడమే కాకుండా.. వాటిని నాశనం కూడా చేసేశాయి. కేన్సర్‌ కణాల్లోకి చొచ్చుకుపోయిన క్వాంటమ్‌ డాట్స్‌ 80 శాతం కణాలను నిర్వీర్యం చేసినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సుధాకర్‌ పిచ్చయి ముత్తు తెలిపారు. క్వాంటమ్‌ డాట్స్‌ను కేన్సర్‌ చికిత్సకు మాత్రమే కాకుండా యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలున్న రంగుల తయారీలోనూ వాడవచ్చునని, తేయాకు నుంచి వీటిని మరింత చౌకగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. 

Wednesday 20 June 2018

మధుమేహం.. క్లోమ కేన్సర్‌కు సూచి



జీవనశైలిలో మార్పులు.. అతిగా జంక్‌ ఫుడ్‌ తినడం.. నిద్రలేమి.. వాతావరణ కాలుష్యం.. వల్ల మనిషిని మధుమేహం(టైప్‌-2) ఆవహిస్తోంది. మధ్య వయస్కులే కాదు.. యువకులూ దీని బాధితులవుతున్నారు. దాని ప్రభావంతో అధిక రక్తపోటు, నరాల బలహీనత, కిడ్నీ సంబంధ వ్యాధులు, గ్లకోమా తదితర వ్యాధులు చుట్టుముడతాయి. అయితే, 50 ఏళ్ల తర్వాత మధుమేహం వస్తే క్లోమ కేన్సర్‌ కూడా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ప్రభావం 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వయసు పైబడి మధుమేహానికి గురైన 36 నెలల్లో క్లోమం చుట్టూ కేన్సర్‌ కణితులు పుట్టి కణాలను హరిస్తుందని, దాంతో వాపు ఏర్పడి ఆ అవయవాన్ని పాడు చేస్తుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌతర్న్‌ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు.


65-85 మధ్య వయసున్న దాదాపు 49 వేల మంది ఆఫ్రికన్‌-అమెరికన్లు, లాటిన్లపై పరిశోధనలు చేయగా మధుమేహ వ్యాధిగ్రస్తులంతా క్లోమ కేన్సర్‌ బారిన పడ్డారన్నారు. ఈ కేన్సర్‌కు గురై ఐదేళ్ల పాటు జీవించింది కేవలం 8 శాతం కంటే తక్కువేనని తెలిపారు. వృద్ధాప్యంలో మధుమేహ సమస్య వస్తే వెంటనే క్లోమ కేన్సర్‌కు చికిత్స తీసుకుంటే మంచిదని సూచించారు. వయసు పైబడ్డాక మధుమేహం వస్తే రొమ్ము కేన్సర్‌, ప్రొస్టేట్‌, పేగు కేన్సర్లు వచ్చే అవకాశం ఉందా అని పరిశోధనలు చేయగా వాటి ప్రభావం లేదని తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Tuesday 19 June 2018

విటమిన్ డీ తో కేన్సర్ ముప్పు



విటమిన్‌ డీ ఎక్కువగా ఉంటే రొమ్ము కేన్సర్‌ ముప్పు తగ్గుతుందని శాన్‌డీగోలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా కేన్సర్‌ నిర్మూలన కోసం తమ పేర్లను నమోదు చేసుకున్న 3,325 మంది మహిళలకు సంబంధించిన రిపోర్టులను పరిశీలించారు. వీరిలో విటమన్‌ డీ ఎక్కువగా ఉన్నవారికి రొమ్ము కేన్సర్‌ ముప్పు తక్కువగా అని గుర్తించారు.

ప్రాణాంతక కంతులతో కేన్సర్‌ దాడి చేస్తోంది. పెరుగుతున్న కేన్సర్‌ కేసులకు మొబైల్‌ ఫోన్‌ రేడియేషన్‌ కూడా ప్రధాన కారణమని తేల్చారు యూకే పరిశోధకులు. జర్నల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ లో ప్రచురితమైన వారి పరిశోధనా పత్రంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

రిపోర్టు ప్రకారం, గ్లియో బ్లాస్టామా మల్టీఫోర్మే (జీబీఎం)గా పిలిచే మెదడులో ప్రాణాంతక ట్యూమర్లకు మొబైల్‌ రేడియేషన్‌ ప్రధాన కారణం! తమ పరిశోధనలో భాగంగా యూకేలో గత 21 ఏళ్లలో నమోదైన 79,241 జీబీఎం కేసులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఇంగ్లండ్‌లో గత 20 ఏళ్లలో ప్రాణాంతక ట్యూమర్‌ కేసులు రెట్టింపు అయ్యాయని గుర్తించారు.

1995లో 1250 ఉన్న కేసులు ఇప్పుడు 3వేలకు పెరిగాయని వెల్లడించారు. మెదడులో జ్ఞాపకశక్తిని, మాటను ప్రభావితం చేసే భాగంలోనే కణతులు ఎక్కువగా ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్‌ ఫోన్‌ రేడియేషన్‌ ఇందుకు చాలావరకూ కారణమని వెల్లడించారు. ఇంగ్లండ్‌లో బ్రెయిన్‌ ట్యూమర్‌ కేసులు పెరగడానికి మొబైల్‌ ఫోన్లు కారణమని అభిప్రాయపడుతున్నారు. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌తోబాటు ఎక్స్‌రేలు, సిటి స్కాన్లు, అణు పరీక్షల అవశేషాలు జీబీఎం ట్యూమర్‌ కేసులకు కారణమని పరిశోధకులు వివరిస్తున్నారు.


Sunday 17 June 2018

గంటలో కేన్సర్ గుర్తింపు

సరికొత్త రక్తపరీక్ష ద్వారా కేవలం గంట వ్వవధిలోనే పాంక్రియాటిక్‌ కేన్సర్‌ను గుర్తించే వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం ఒక రక్తపు బొట్టుతో గుట్టు పట్టుకోవచ్చునని ఏసీఎస్‌ నానో అనే జర్నల్‌లో వివరించారు.



ప్రాథమిక దశలోనే ఈ పరీక్షలో వ్యాధి బయపటడితే మెరుగైన చికిత్స చేయవచ్చునని యూనివర్సిటీ కాలిఫోర్నియా ప్రతినిధి లీన్‌ లూయిస్‌ తెలిపారు. రక్తంలో నానో సైజ్‌లో ఉండే ఎక్సోజోమ్స్‌లో కేన్సర్‌ కణాలు గుర్తిస్తే వ్యాధి ఏ దశలో ఉందో తెలిసిపోతుందన్నారు.

Saturday 16 June 2018

విటమిన్ డీ లోపంతో రొమ్ము కేన్సర్

రోజూ  కాసేపు ఎండలో నిలబడితే ఆరోగ్యానికి మేలని మీరు చాలాసార్లు విని ఉంటారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. శరీరం స్వయంగా తయారు చేసుకోవడం సాధ్యం కాని విటమిన్‌ డీని సూర్య కిరణాలతో చేసుకోవచ్చు. ఎముకల దృఢత్వం మొదలుకొని అనేక సమస్యల పరిష్కారానికి విటమిన్‌ డీ దోహదపడుతుందని ఇప్పటికే అనేక పరిశోధనలు స్పష్టం చేశాయి. తాజాగా శరీరంలో విటమిన్‌ డీ ఎక్కువ మోతాదులో ఉంటే రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. విటమిన్‌ డీతో ఆరోగ్య ప్రయోజనాలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థతో కలిపి ఈ అధ్యయనం జరిగింది. దాదాపు అయిదు వేల మందిపై ఇప్పటికే జరిగిన రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ నుంచి  సమాచారాన్ని సేకరించి విశ్లేషించినప్పుడు తమకు ఈ కొత్త విషయం తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.



2002 – 2017 మధ్యకాలంలో జరిగిన ఈ దీర్ఘ అధ్యయనంలో అప్పుడప్పుడూ విటమిన్‌ డీ మోతాదులను పరిశీలించామని, మొత్తమ్మీద చూసినప్పుడు వీరిలో 77 మంది రొమ్ము కేన్సర్‌ బారిన పడ్డారని ఆయన చెప్పారు. కేన్సర్‌బారిన పడని వారిలో విటమిన్‌ డీ మోతాదు 60 నానోగ్రామ్స్‌/లీటర్‌గా ఉన్నట్లు గుర్తించామని.. సాధారణంగా 20 నానోగ్రాముల విటమిన్‌ డీ ఉంటే చాలని వైద్యం చెబుతుందని వివరించారు.

ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన విటమిన్‌ డీ మోతాదును గణనీయంగా పెంచేందుకు అమెరికన్‌ వైద్యరంగం ప్రయత్నాలు చేస్తోంది. అరవై నానోగ్రాముల కంటే ఎక్కువ విటమిన్‌ డీ ఉన్న వారికి రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశం 20 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు.

అధ్యయనంలో పాల్గొన్న వారి వయసు, బాడీ మాస్‌ ఇండెక్స్, ధూమపానం వంటి అలవాట్లు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పటికీ విటమిన్‌ డీ ఎక్కువగా ఉన్నవారికి రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువని తమ అధ్యయనం చెబుతోందని వివరించారు. కొన్ని రకాల ఇతర కేన్సర్ల విషయంలోనూ విటమిన్‌ డీ ప్రభావం ఎంతో ఉన్నట్లు గతంలో జరిగిన పరిశోధనలు చెబుతూండటం ఇక్కడ గమనార్హం.

Friday 15 June 2018

ప్లాస్టిక్ తో కేన్సర్ ఖాయం

పర్యావరణంతోపాటు.. జంతుజాలం, మానవాళి పట్ల ప్లాస్టిక్‌ అత్యంత ప్రమాదకరమైనదని  సైంటిస్టులు చెబుతున్నారు. ప్రజలు నిత్యం తమకు తెలియకుండానే ప్లాస్టిక్‌ను తినేస్తున్నారు. నీళ్లు, పాలు, ఆహారం, నూనె, చివరికి ఇడ్లీ, సాంబర్‌లు కూడా ప్లాస్టిక్‌ కవర్లలోనే విక్రయిస్తున్నారు. ప్రజలు ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌తో చేసిన వాడిపారేసే ప్లేట్లలో తింటున్నారు. అలా శరీరంలోకి వెళ్లే ప్లాస్టిక్‌ మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచూపుతోంది. ఏకకాలంలో ఒక్కో వ్యక్తి రెండు మూడు జబ్బులతో బాధపడడానికి ఇదే కారణం అని వివరించారు.



ప్లాస్టిక్‌ కారణంగా చిన్నారులు మొదలు.. వృద్ధులదాకా అనేక వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డెయిరీ పాలు, చక్కెర, తిపి పదార్ధాలు, కోలాలు, ఛాయ్‌, కాఫీ, చిరుతిండి కారణంగా శరీరంలో గ్లూకోజ్‌ శాతం మరింత పెరుగుతుందని, తద్వారా రోగాలు సంక్రమిస్తున్నాయని వివరించారు. కల్తీ ఆహారం కారణంగా చిన్నారులు కూడా కేన్సర్‌ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌ కవర్లలోని పదార్థాలను తినడం మాని.. ప్రతిరోజూ శారీరక వ్యాయామం, జాగింగ్‌, నడక వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. టెంకాయ, కొబ్బరి నీళ్లు, మట్టికుండలో నీళ్లను తాగాలని, మట్టి పాత్రల్లో వంట చేయడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నారు.

Thursday 14 June 2018

టూత్ పేస్టులతో పేగు కేన్సర్.. నిజమా?



ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకుని దంతాలను శుభ్రం చేసుకుంటారు. ఇందుకోసం మనకు ఇష్టమైన కంపెనీ టూత్‌పేస్టును వినియోగిస్తుంటాం. నిద్రలేవగానే దుర్వాసనను పోగొట్టి నోట్లోని బ్యాక్టీరియాను తరిమేసి పళ్లను శుభ్రంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ టూత్‌పేస్టులను వినియోగిస్తుంటాం.

అయితే, టూత్‌పేస్టులో ట్రైక్లోసన్‌ అనే బ్యాక్టీరియాను చంపే పదార్థం ఉంటుందట. అది కాసింత కడుపులోకి వెళ్లినా.. పేగుల్లో ఉండే ఆరోగ్యకర, అవసరమైన బ్యాక్టీరియాను చంపేయడం వల్ల పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఆమ్‌హెర్ట్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.



ఇందుకోసం వారు తొలుత ఎలుకలపై ప్రయోగం చేశారు. ఎంపిక చేసిన ఎలుకలకు ట్రైక్లోసన్‌ తినిపించారు. ఆ తర్వాత ఆ ఎలుకలను పరిశీలించగా వాటిలో జీర్ణవ్యవస్థకు అవసరమయ్యే బ్యాక్టీరియా (గట్‌ బ్యాక్టీరియా) చనిపోయినట్లు గుర్తించారు.

అమెరికాలో కొన్ని ఉత్పత్తులపై నిషేధం ఉన్నా మిగతా దేశాల్లో ఈ రసాయనంపై ఎక్కడా నిషేధం లేదని వివరించారు. ఇప్పటికే ఈ రసాయనం ప్రపంచం నలువైపులా సబ్బులు, టూత్‌పేస్టుల రూపంలో వ్యాపించిందని, దీనివల్ల మరింత నష్టం జరగకముందే తక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.

Wednesday 13 June 2018

కేన్సర్ రోగులు ఏం తినాలి..?



కేన్సర్ వ్యాధి బారిన పడిన వారు మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతారు. కీమోథెరపీ కారణంగా జుట్టు రాలిపోవడంతోపాటు శారీరకంగా బలహీనం అవుతారు. మానసికంగా కుంగుబాటుకు లోనవడం క్యాన్సర్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. కేన్సర్ పేషెంట్లు వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం కూడా కీలకమే. వీరు టమాట, క్యారెట్, గుమ్మడి లాంటి కాయగూరలు తినొచ్చు. ఆపిల్, కివీ, అరటి, నారింజ లాంటి పండ్లను తీసుకోవచ్చు. వీరు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.



ఇది సాధారణ సమాచారం కోసమే చెబుతారు. కానీ ప్రతి కేన్సర్ పేషెంట్ ఆరోగ్య స్థితి డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి డాక్టర్ చెప్పిన డైట్ కచ్చితంగా ఫాలో కావాలి. మందులతో తగ్గించలేని రోగాలు కూడా ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో సాధ్యమని చాలా రోగాలకు చెబుతారు. అదే సూత్రం కేన్సర్ కు కూడా వర్తిస్తుంది. కేన్సర్ రోగులు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసీ తెలియకుండా తినే ఆహారపదార్ధాలు ఒక్కోసారి చాలా డ్యామేజ్ చేసే ఛాన్సుంటుంది.










































































Tuesday 12 June 2018

స్మార్ట్ ఫోన్ తో బ్రెయిన్ కేన్సర్



ఓ పదిహేను నిమిషాలు సెల్‌ఫోన్‌లో మాట్లాడితేనే చాలామందికి తలనొప్పి వస్తుంది. అలాంటిది 20 ఏళ్లుగా రోజూ గంటలకు గంటలు మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో సెల్‌ రేడియేషన్‌ మెదళ్లను తూట్లు పొడుస్తోంది. ప్రాణాంతక కంతులతో కేన్సర్‌ దాడి చేస్తోంది. పెరుగుతున్న కేన్సర్‌ కేసులకు మొబైల్‌ ఫోన్‌ రేడియేషన్‌ కూడా ప్రధాన కారణమని తేల్చారు యూకే పరిశోధకులు. జర్నల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ లో ప్రచురితమైన వారి పరిశోధనా పత్రంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.




రిపోర్టు ప్రకారం, గ్లియో బ్లాస్టామా మల్టీఫోర్మే (జీబీఎం)గా పిలిచే మెదడులో ప్రాణాంతక ట్యూమర్లకు మొబైల్‌ రేడియేషన్‌ ప్రధాన కారణం! తమ పరిశోధనలో భాగంగా యూకేలో గత 21 ఏళ్లలో నమోదైన 79,241 జీబీఎం కేసులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఇంగ్లండ్‌లో గత 20 ఏళ్లలో ప్రాణాంతక ట్యూమర్‌ కేసులు రెట్టింపు అయ్యాయని గుర్తించారు.

1995లో 1250 ఉన్న కేసులు ఇప్పుడు 3వేలకు పెరిగాయని వెల్లడించారు. మెదడులో జ్ఞాపకశక్తిని, మాటను ప్రభావితం చేసే భాగంలోనే కణతులు ఎక్కువగా ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్‌ ఫోన్‌ రేడియేషన్‌ ఇందుకు చాలావరకూ కారణమని వెల్లడించారు. ఇంగ్లండ్‌లో బ్రెయిన్‌ ట్యూమర్‌ కేసులు పెరగడానికి మొబైల్‌ ఫోన్లు కారణమని అభిప్రాయపడుతున్నారు. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌తోబాటు ఎక్స్‌రేలు, సిటి స్కాన్లు, అణు పరీక్షల అవశేషాలు జీబీఎం ట్యూమర్‌ కేసులకు కారణమని పరిశోధకులు వివరిస్తున్నారు.

Monday 11 June 2018

పొగ తాగితే ప్రాణం పోతుంది



ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగిపోతున్నాయి. పొగతాగే అలవాటుకు తోడు విపరీతంగా దుమ్మూ, ధూళితో కూడిన పరిసరాల్లో ఉండేవారు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నారు. స్త్రీలలో కంటే పురుషుల్లో కేన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు అమెరికాలోని మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలో ఊపిరితిత్తుల కేన్సర్ విజృంభణపై వారు పరిశోధన చేశారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల కేన్సర్లు, రావడానికి కారణమైన అధ్యయనాలను పరిశీలించి క్రోడీకరించారు. పొగతాగే అలవాటు, ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు వంటి పొగ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నట్లు తేల్చారు.ఈ కేన్సర్ బారిన పడితే దగ్గుతున్నప్పుడు నోట్లో నుంచి రక్తం రావడం, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం, తల నొప్పి, ఎముకల నొప్పి, గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి. వీటితోపాటు దీర్ఘకాలంగా దగ్గు ఉండడం, శ్వాస తీసుకోవడం, వదలడంలో ఇబ్బందిగా ఉండడం, ఆకలి మందగించడం, గొంతు బొంగురు పోవడం, అలసట, బలహీనంగా తయారవడం, ఏదైనా తినేటప్పుడు మింగడానికి కష్టమవడం వంటి లక్షణాలు ఉంటాయి.



ఊపిరితిత్తుల కేన్సర్ ను పల్మనరీ కార్సినోమా అని కూడా అంటారు. ముఖ్యంగా మూడు రకాల ఊపిరితిత్తుల కేన్సర్లు ఉన్నాయి. ఒకటి స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ (ఎస్ సీఎల్ సీ), రెండోది నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ (ఎన్ఎస్ సీఎల్ సీ), మూడోది మాలిగ్నెంట్ మేసోథెలియోమో కేన్సర్. ఇందులో స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ ఎక్కువగా వస్తుంది. మాలిగ్నెంట్ మేసోథెలియోమో కేన్సర్ చాలా అరుదుగా వస్తుంది. ఊపిరితిత్తుల కేన్సర్ కు ప్రధాన కారణం పొగతాగే అలవాటే. ముఖ్యంగా చైన్ స్మోకర్లు, బీడీలు వంటివి తాగేవారికి ప్రమాదం ఎక్కువ.

Sunday 10 June 2018

కేన్సర్ నివారణలో తిరుగులేని దివ్యౌషధం



విటమిన్‌ - డి అంటే, ఎముకలను వ్యాధిగ్రస్తం కాకుండా కాపాడటానికీ, వాటిని దృఢపరచడానికి మాత్ర మేని ఇప్పటిదాకా అనుకుంటూ ఉండిపోయాం. అయితే, కేన్సర్‌ వ్యాధి నివారణలోనూ విటమిన్‌ - డి పాత్ర కీలకమేనని ఇటీవలి పరిశోధనలో బయటపడింది. ఇటీవలి బి.ఎమ్‌. జె .జర్నల్‌లో ప్రచురితమైన ఒక వ్యాసంలో ఈ విషయానికి సంబంధించిన వివరాలే ఉన్నాయి. టోక్యోలోని నేష్నల్‌ కేన్సర్‌ సెంటర్‌ వారు జరిపిన ఓ అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలే ఆ వ్యాసంలో వివరంగా ఉన్నాయి.



ఒకరకం విటమిన్‌ -డి లోని ‘ 25- హైడ్రోక్సివిటమిన్‌ డి- కాన్సెంట్రేషన్‌’ అనే ఒక మూలకం కొన్ని రకాల కేన్సర్లను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వారు ఆ వ్యాసంలో పేర్కొన్నారు. వీరు తమ అధ్యయంలో విటిమిన్‌ డి నిల్వలు తక్కువగా ఉన్నవారినీ, ఎక్కువగా వారినీ పోల్చి చూశారు. అయితే, విటమిన్‌- డి నిల్వలు ఎక్కువగా ఉన్న వారిలో కేన్సర్‌ బారిన పడే వారి సంఖ్య 20 శాతం తక్కువగా ఉందని వారు వివరించారు. ప్రత్యేకించి కాలేయ కేన్సర్‌ బారిన పడే ప్రమాదం కూడా 50 శాతం దాకా తగ్గుతోందని కూడా పేర్కొన్నారు. ఉదయ కిరణాలు ఇంట్లోకి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. పూర్తిగా గది గోడల మధ్యనో ఆఫీసు గోడల మధ్యనో ఉండిపోయే వారి ఒంటి మీద ఆ కిరణాలు పడే అవకాశం ఎక్కడుంది? పనిగట్టుకుని వీధిలోకి వస్తే గానీ, ఎంతో కొంత నీరెండ మన మీద పడే వీల్లేకుండా పోతోంది. ఏమైనా ప్రకృతి సహజ ప్రభావాలకు దూరం కావడం వల్ల వచ్చి పడుతున్న ప్రమాదాలేమిటో ఒక్కొక్కటిగా ఇలా బయటడపుతున్నాయి.

Saturday 9 June 2018

బ్లాక్ కాఫీతో కేన్సర్ దూరం



ప్రతిరోజు 2 లేక 3 కప్పుల బ్లాక్‌ కాఫీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దెమెంతియా, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు రాకుండా ఉండడంతో పాటు మెదడు చురుగ్గా ఉంటుందని చెబుతున్నారు. బ్లాక్ కాఫీ వల్ల రక్తంలోకి అడ్రినలిన్ విడుదలవుతుందని, దీంతో కొవ్వు కరుగుతుందని పేర్కొన్నారు. అలాగే, లివర్ కేన్సర్, హెపటైటిస్ వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చట.



ప్రతిరోజు కాఫీ తాగితే శరీర మెటబాలిజం 50 శాతం వరకు పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు రెండు కప్పుల కంటే ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయని అంటున్నారు. అంతేగాక, బ్లాక్ కాఫీ తాగితే ఒత్తిడికి కూడా దూరంగా ఉండొచ్చని పేర్కొన్నారు.

Friday 8 June 2018

బరువు తగ్గితే కేన్సర్ దూరం


మన చర్మంపై ఎన్నో రకాల మచ్చలు వస్తుంటాయి. కొన్ని పుట్టుమచ్చలు పెద్దయ్యాక కూడా వస్తుంటాయి. వీటితో ఎలాంటి సమస్య లేదు. కానీ కొన్ని రకాల మచ్చలు కొంచెం దురద పుట్టిస్తూ.. అసహనానికి గురిచేస్తుంటాయి. అలాంటి మచ్చల్ని తొలిదశలోనే డాక్టర్ కు చూపించాలి. ఎందుకంటే అవి ప్రమాదకరమైన కేన్సర్ కణాలు కావచ్చు. అలాంటి చర్మ కేన్సర్ కూడా తగ్గించుకోవడానికి చిట్కాలున్నాయంటున్నారు డాక్టర్లు. చాలా వ్యాధులకు కారణమైన అధిక బరువు.. చర్మ కేన్సర్ కు కూడా దారితీస్తుందని భయపెడుతున్నారు.



చర్మకేన్సర్‌తో బాధపడుతున్నారా? వెంటనే బరువు తగ్గేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అవును..! బరువు తగ్గితే చర్మ కేన్సర్‌ దూరమవుతుందని స్వీడన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ గోథెన్‌బర్గ్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 2వేల మంది చర్మ కేన్సర్‌ రోగులపై పరిశోధనలు చేయగా బరువు తగ్గినవారిలో వ్యాధి 61శాతం తగ్గినట్లు వెల్లడించారు.

Thursday 7 June 2018

చిటికెలో కేన్సర్ గుర్తింపు


కేన్సర్ ఎంత ప్రమాదకరమైన  వ్యాధి అనే సంగతి ఇప్పుడు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ వ్యాధిపై అవగాహన కూడా పెరుగుతుండటంతో.. గతంతో పోలిస్తే ముందుగానే ఆస్పత్రికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. కేన్సర్ మొదటి స్టేజ్ లో ఉంటే తగ్గించవచ్చనే డాక్టర్ల మాటలు జనాన్ని ఆస్పత్రులకు రప్పిస్తున్నాయి. అయితే కేన్సర్ ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకోవాలంటే టెస్టులు కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటున్నాయనే వారి కోసం మరింత సులభమైన టెక్నిక్ డెవలప్ చేశారు.




సరికొత్త రక్తపరీక్ష ద్వారా కేవలం గంట వ్వవధిలోనే పాంక్రియాటిక్‌ కేన్సర్‌ను గుర్తించే వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం ఒక రక్తపు బొట్టుతో గుట్టు పట్టుకోవచ్చునని ఏసీఎస్‌ నానో అనే జర్నల్‌లో వివరించారు. ప్రాథమిక దశలోనే ఈ పరీక్షలో వ్యాధి బయపటడితే మెరుగైన చికిత్స చేయవచ్చునని యూనివర్సిటీ కాలిఫోర్నియా ప్రతినిధి లీన్‌ లూయిస్‌ తెలిపారు. రక్తంలో నానో సైజ్‌లో ఉండే ఎక్సోజోమ్స్‌లో కేన్సర్‌ కణాలు గుర్తిస్తే వ్యాధి ఏ దశలో ఉందో తెలిసిపోతుందన్నారు.

Wednesday 6 June 2018

డిస్పోజబుల్ కప్పులతో కేన్సర్ ముప్పు


ప్లాస్టిక్‌ కప్పులతో మాత్రమే కాదు, చాలా షాపుల్లో, టీ, కాఫీలు సర్వ్‌ చేయడానికి వాడే డిస్పోజబుల్‌ కప్పులు కూడా కేన్సర్‌ ముప్పును కలిగిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఒకసారి వాడి పడేసేందుకు ఉపయోగపడే డిస్పోజబుల్‌ కప్పుల తయారీలో కూడా ప్లాస్టిక్, కృత్రిమ రబ్బర్‌ వస్తువుల తయారీలో వాడే ‘స్టైరిన్‌’ అనే రసాయనం కేన్సర్‌ను కలిగించగలదని వెల్లడించింది. నిజానికి ఈ రసాయనాన్ని ‘ బహుశ కేన్సర్‌కు దారితీసే అవకాశాలు గల రసాయనం’గా డబ్ల్యూహెచ్‌ఓ నలభై ఏళ్ల కిందటే గుర్తించింది.



ఈ రసాయనం వల్ల కేన్సర్‌ ముప్పు అవకాశాలు మరింతగా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలడంతో ఇప్పుడు దీనిని మరింత ప్రమాదకర పదార్థాల జాబితాలో చేర్చింది. డేనిష్‌ ప్లాస్టిక్‌ పరిశ్రమలో పనిచేసే 70 వేల మంది ఉద్యోగులపై ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ కేన్సర్‌ (ఐఏఆర్‌సీ) నిపుణులు మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ పరిశోధనలు కొనసాగించిన తర్వాత, డిస్పోజబుల్‌ కప్పుల తయారీకి ఉపయోగించే ‘స్టైరిన్‌’ రసాయనం కేన్సర్‌ ముప్పును కలిగించగలదని నిగ్గు తేల్చారు.

Tuesday 5 June 2018

కేన్సర్ కు సంజీవని ఇమ్యునోథెరపీ


బ్రెస్ట్ కేన్సర్‌ను ఆరంభంలోనే గుర్తిస్తే సరైన చికిత్స అందించి పేషెంట్ ప్రాణాలు నిలపొచ్చు. కానీ వ్యాధిని గుర్తించడం ఆలస్యమైతే చికిత్స కష్టమై రోగిని కాపాటం అసాధ్యం అవుతుంది. కానీ యూఎస్ నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మూడు నెలలకు మించి బతకదని చెప్పిన మహిళలో కేన్సర్‌ను పూర్తిగా నయం చేశారు.

ఇందుకోసం పరిశోధకులు సరికొత్త ఇమ్యునోథెరపీ విధానాన్ని అనుసరించారు. ఆమె శరీరంలో నుంచి లింఫోసైట్లను బయటకు తీసి లేబోరేటరీలో వాటికి మార్పులు చేశారు. తర్వాత తిరిగి పేషెంట్ శరీరంలో ప్రవేశపెట్టారు. ఇలా.. కేన్సర్ కణాలను మట్టుబెట్టే సామర్థ్యం ఉన్న 90 బిలియన్ల ఇమ్యూన్ సెల్స్‌ను ఆమె ఒంట్లోకి పంపారు.



వాస్తవానికి మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్ కారక కణాలు సహా హానికారకమైన, దాడి చేసే ఇతర కణాలను చంపేస్తుంది. కానీ పేషెంట్ డీఎన్ఏతో ఉండే కేన్సర్ కణాలను రోగ నిరోధక వ్యవస్థ గుర్తించలేదు. దీంతో కేన్సర్ కణాలు విస్తరిస్తాయి. కేన్సర్‌ కణాలను గుర్తించి, వాటితో పోరాడేలా రోగ నిరోధక వ్యవస్థకు ఇమ్యునోథెరపీ ట్రైనింగ్ ఇస్తుంది.

ఇలా ఇమ్యూనోథెరపీ చేయడం వల్ల సదరు మహిళలో రెండేళ్లలో కేన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. ఆమె లివర్లో టెన్నిస్ బాల్ పరిమాణంలో కేన్సర్ కణితి ఏర్పడినప్పటికీ.. ఇతర అవయవాలకు వ్యాధి విస్తరిస్తున్నప్పటికీ.. ఈ చికిత్స విధానం ద్వారా ఆమె కేన్సర్‌ను జయించింది. అడ్వాన్స్‌డ్ స్టేజిలో బ్రెస్ట్ కేన్సర్‌ను నయం చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం‘‘ఇమ్యూనోథెరపీ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ, అందరికీ ఒకేలా ఉపయోగించలేం. ఇది ఇప్పటికీ పరిశోధన స్థాయిలోనే ఉంది. కానీ ఈ విధానం ద్వారా ఇతర కేన్సర్లను కూడా నయం చేయొచ్చ’’ని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Monday 4 June 2018

ప్రోస్టేట్ కేన్సర్ అంత డేంజరా..?



వ్యాధి నిర్ధారణ జరిగి 6 ఏళ్లు. వ్యాధి ముదిరి మంచం పట్టి సరిగ్గా 40 రోజులే! అయినా మెరుగైన చికిత్సలన్నీ చిటికెలో పొందే వీలున్న ఓ ప్రజా ప్రతినిధి ఇటీవలే ప్రోస్టేట్‌ కేన్సర్‌ చేతిలో ఓడిపోయారు. మరి, అన్ని వసతులు లేని సాధారణ వ్యక్తుల పరిస్థితేంటి? ప్రోస్టేట్‌ కేన్సర్‌ పట్ల అందర్లో ఇలాంటి భయాలెన్నో! అయుతే నిజంగానే ఈ వ్యాధి అంత ప్రాణాంతకమైనదా?

ప్రోస్టేట్‌ కేన్సర్‌ అన్ని కేన్సర్‌లలాంటిదే! కాకపోతే లక్షణాలను తీవ్రంగా పరిగణించకపోవడం వల్ల దశలు దాటేసి, మూడు, నాలుగు దశల్లో వైద్యులను కలుస్తూ ఉండడం వల్ల ప్రాణాంతక కేన్సర్‌గా పేరు తెచ్చుకుంది. కానీ తొలి దశలోనే గుర్తించి అప్రమత్తమైతే అన్ని కేన్సర్‌లలాగే దీన్ని కూడా సమూలంగా నయం చేసే వీలుంటుంది. పురుషుల్లో మూత్రాశయం దగ్గర వాల్‌నట్‌ ఆకారంలో ఉండే ఈ ప్రోస్టేట్‌ గ్రంథిలో కేన్సర్‌ పుడుతుంది. కొన్ని కేన్సర్లు ప్రోస్టేట్‌ వరకే పరిమితమై అత్యంత నెమ్మదిగా పెరిగితే మరికొన్ని వేగంగా పెరుగుతూ ప్రోస్టేట్‌ దాటి ఇతర అవయవాలకూ వ్యాపిస్తాయి. లింఫ్‌ గ్రంథులు, ఎముకల్లోకి పాకిన ప్రోస్టేట్‌ కేన్సర్‌ను నయం
చేయడం కొంత కష్టం. అయితే ప్రోస్టేట్‌ వరకే పరిమితమై ఉండి ప్రారంభంలోనే గుర్తించగలిగితే సమర్థమైన చికిత్సతో ఈ కేన్సర్‌ను తేలికగానే నయం చేయొచ్చు.



ఓ కన్నేసి ఉంచండి!
లక్షణాలను పసిగట్టి వెంటనే వైద్యులను కలవడం వల్ల వ్యాధి అదుపులోకొస్తోంది. కానీ మన దేశంలో వ్యాధి ముదిరిపోయిన తర్వాత మూడు లేదా నాల్గవ దశలో వైద్యులను కలవడం వల్ల అప్పటికే కేన్సర్‌ ఇతర శరీర భాగాలకు పాకిపోయి చికిత్సకు లొంగకుండా తయారవుతోంది. కాబట్టి ప్రోస్టేట్‌ కేన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా నయం చేయవచ్చు. ఇందుకోసం 40 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడూ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి. అవేంటంటే...

-తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం
-మూత్రం చుక్కలుగా రావడం, మూత్రాశయం ఖాళీ కాకపోవడం
-నడుము భాగంలో ఇబ్బంది, నొప్పి
-మూత్రంలో రక్తం
-ఎముకల నొప్పులు
-పురుషాంగం గట్టిపడకపోవడం



Sunday 3 June 2018

లంగ్ కేన్సర్ కు తేయాకు మందు

గ్రీన్‌ టీలో బోలెడన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని, తరచూ ఈ పానీయాన్ని సేవించడం ద్వారా కేన్సర్‌ను నివారించవచ్చునని మనం తరచూ వింటుంటాం. ఇందులో వాస్తవం లేకపోలేదు.  భారతియార్, స్వాన్‌సీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి తేయాకులోకి కొన్ని ప్రత్యేక కణాల ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌కు సమర్థమైన చికిత్స ఇవ్వవచ్చని నిరూపించారు. ఈ క్వాంటమ్‌ డాట్‌ కణాలు అతి సూక్ష్మమైనవి. ధర్మాలూ అనూహ్యం. కొన్ని రసాయనాలతో కలిసి వేర్వేరు రంగుల్లో ప్రతిదీప్తిని కనబరుస్తాయి. అందువల్లనే వీటిని ఇప్పటికే సోలార్‌ సెల్స్‌ మొదలుకొని వైద్య పరీక్షల్లోనూ వాడుతున్నారు. కేన్సర్‌ చికిత్సలోనూ, యాంటీబయాటిక్‌ నిరోధకతను ఎదుర్కొనేందుకూ ఈ క్వాంటమ్‌ డాట్స్‌ ఉపయోగపడుతున్నాయి.



ఈ నేపథ్యంలో భారతియార్, స్వాన్‌సీ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు తేయాకు నుంచి క్వాంటమ్‌ డాట్‌ కణాలను వెలికి తీశారు. వీటి సమక్షంలో ఊపిరితిత్తుల కేన్సర్‌ కణాలు వెలిగిపోవడమే కాకుండా.. వాటిని నాశనం కూడా చేసేశాయి. కేన్సర్‌ కణాల్లోకి చొచ్చుకుపోయిన క్వాంటమ్‌ డాట్స్‌ 80 శాతం కణాలను నిర్వీర్యం చేసినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సుధాకర్‌ పిచ్చయి ముత్తు తెలిపారు. క్వాంటమ్‌ డాట్స్‌ను కేన్సర్‌ చికిత్సకు మాత్రమే కాకుండా యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలున్న రంగుల తయారీలోనూ వాడవచ్చునని, తేయాకు నుంచి వీటిని మరింత చౌకగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.  

Saturday 2 June 2018

గంధంతో కేన్సర్ కు చెక్



మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి. మన పెద్దవాళ్లు చెప్పే మాటల్ని మనం తేలిగ్గా తీసుకుంటాం కానీ.. ఇప్పుడు పరిశోధకులు సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసి అవే నిజమని తేలుస్తున్నారు. తులసి, వేప ఆరోగ్యానికి చాలా మంచివని మనందరికీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కానీ గంధంలో కేన్సర్ తగ్గించే గుణం ఉందని తెలిస్తే మనమంతా ఆశ్చర్యపోవాల్సిందే. గంధం కనీసం వాడక్కర్లేదని కేవలం వాసనకే కేన్సర్ దూరమౌతుందని రీసెర్చులు చెబుతున్నాయి.





     కేన్సర్‌ కణితులను అంతం చేయాలంటే రేడియేషన్‌ చికిత్స తప్పనిసరి. అయితే, మూత్రాశయ కేన్సర్‌ను అదుపులో పెట్టడానికి జర్మనీ శాస్త్రవేత్తలు వినూత్న ఆవిష్కరణ చేశారు. గంధపు సువాసనతో కేన్సర్‌ను అదుపులో పెట్టవచ్చని గుర్తించారు. గం ధపు వాసనలో ఉండే సాండ్రనాల్‌, సాంటనాల్‌ సమ్మేళనాలు కణితులపెరుగుదలను నిరోధిస్తాయని తేల్చారు.

Friday 1 June 2018

కేన్సర్ సర్వైవల్ మంత్ జూన్




కేన్సర్ లక్ష మంది మహిళల్లో పల్లెల్లో 8మందికి, పట్టణాల్లో 27మందికి వస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది
-దేశ వ్యాప్తంగా ఏటా 5లక్షల మందిని బలిగొంటున్న మహమ్మారి
-ఆడవారిలో సర్వైకల్ కేన్సర్, మగవారిలో నోటి కేన్సర్లు పెరుగుతున్నాయని తేల్చిన పలు నివేదికలు
-సహజ జీవన శైలి, ముందస్తు పరీక్షలే శరణ్యమంటున్న వైద్యులు..




కేన్సర్ అనేది ఒక వ్యాధి కాదు. ఇది సోకిందని తెలిసే నాటికే దాని తీవ్రత పెరిగి ఉండడం కేన్సర్ వ్యాధికి ఉన్న ప్రధాన లక్షణం. శరీరంలోని ట్రిగ్గర్ కణాలు కణవిభజనపై నియంత్రణ కోల్పోవడంతో కేన్సర్ ప్రారంభమవుతుంది. సంబంధిత పరీక్షల ఆధారంగా వ్యాధి ఉందని, అవయవం ఆధారంగా రకాన్ని తెలుసుకొని సరైన చికిత్స అందిస్తే కేన్సర్‌ను అరికట్టొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

కేన్సర్ అనేది అనేక వ్యాధుల సముదాయం. వాటన్నింటికి ఒకే సాధరణ లక్షణాలుంటాయి. శరీరంలోని ఏ భాగం నుంచి కేన్సర్ వచ్చిందో దాని ఆధారంగా వైద్యులు కేన్సర్ రకాన్ని నిర్ధారిస్తారు. తీవ్ర ఒత్తిడికి గురవ్వడం, పొగ తాగడం, ప్రతికూల పరిసరాల ప్రభావం, కొన్ని అంటువ్యాధులు, జన్యుపరంగా వచ్చే కొన్ని లక్షణాలు కేన్సర్‌కి కారణమవుతాయి.