Saturday 30 June 2018

వైద్యో నారాయణో హరి


మనిషి అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యుడు చికిత్స చేసి దాన్ని నయం చేయడమే కాదు.. కొన్నిసార్లు ప్రాణాలు పోయే విషమస్థితి నుంచి సర్వవిధాలుగా ప్రయత్నించి ఆ రోగికి ప్రాణం పోస్తాడు. అందుకే వైద్యున్ని వైద్యో నారాయణో హరి.. అనగా దేవుడుతో సమానంగా చూస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే లెక్కల ప్రకారం వారి ప్రమాణాల ప్రకారం 2022 నాటికి భారత్ జనాభాకు అదనంగా కావాల్సిన వైద్యుల సంఖ్య 4,00,000 అని తెల్చి చెప్పింది. పూర్వకాలంతో పోలిస్తే ప్రస్తుత గ్లోబల్ యుగంలో వైద్యుడు, వైద్యం చాలా ఖరీదైనాయి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న జనాలను వెళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాగే ఫిజీషియన్స్ అంతే బిజీగా ఉంటున్నారు.

బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లాలోని బంకింపుర్‌లో 1882 జూలై ఒకటిన జన్మించిన బీథార్ చంద్రరాయ్ అనేక శ్రమల కోర్చి పట్టుదలతో కలకత్తాలో వైద్య విద్యను అభ్యసించారు. అనంతరం కొన్నేళ్లు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాడు. సామాజిక వేత్తగా పేరొందిన ఆయన చిత్తరంజన్‌దాస్ అనుచరుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం అనేక పదవులు పొందా రు. 1948లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన జీవిత కాలంలో వివిధ పదవుల్లో ఉన్నప్పుడు చేసిన అపార సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 1961లో భారతరత్న అవార్డుతో సత్కరించింది. వైద్యుడిగా మొదలైన ఆయన జీవితం ప్రజాసేవతో ముగియడంతో ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును డాక్టర్స్ డేగా పరిగణించి, ప్రతి ఏటా జరుపుకుంటోంది.


వైద్య వృతి కత్తి మీద సాము లాంటిదే. ఏ మాత్రం డోస్ పెరిగినా, లేదా రోగి శరీరంలో ఆకస్మిక మార్పులు వచ్చినా డాక్టకే ఇబ్బంది. వైద్యం గురించి, దాని విధానం గురించి ఓనమాలు తెలియని సగటు మనిషి డాక్టర్నే నిందిస్తాడు. డాక్టర్నే టార్గెట్ చేస్తాడు. కారణం నమ్మకమంతా ఆయనపైనే పెడతారు కాబట్టి.. అవతలి వారి ప్రాణాలతో బాధ్యత వ్యవహరించాల్సి రావడం వల్ల మిగతా జీవితాల కంటే వైద్య వృత్తిలో తమకు మానసికంగా ఒత్తిళ్లుంటాయని పలువురు డాక్టర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆర్కెవ్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్‌లో బర్న్ అవుట్ అనే శీర్షికన సంపాదనాపరంగా కాకుండా మానసిక ఒత్తిళ్ల నేపథ్యంలో అధ్యయనాలు చేపట్టి డాక్టర్లపై కథనాలను ప్రచురించింది. దాదాపు 36 శాతం మంది ఫిజీషియన్లు బాధ్యతను భారంగా భావిస్తున్నారని 2,556 మంది డాక్టర్లపై జరిపిన అధ్యాయనంలో తేలింది. ఈ ఒత్తిడి 40 శాతం డాక్టర్లలో ఉంటుందని మరో తాజా నివేదిక వెల్లడించింది.


సగటు మనిషికి తన వృత్తిలో కానీ, ప్రవృత్తిలో కానీ సెలవులు ఉండొచ్చు. మాకు సరాదాలు లేవు.... సెలవులూ లేవు... ఉండవు.. చిన్న చిన్న సరదాలు మా హ్యాపీడేస్‌తో ఎండ్ అయ్యాయిని డాక్టర్ల మనస్సులోని మాట. ఇక మిగిలింది వృత్తిపరమైన ఆనందమే అదీనూ ప్రాణాపాయ స్థితిలో రోగికి తిరిగి ప్రాణాలను తీసుకొచ్చి వారి కళ్లలో ఆత్మీయ ఆనందం చూసినప్పుడు అని అ జర్నల్ ప్రచురించింది. వారు నిత్యం రోగులతోనూ రోగాన్ని కలిగించే క్రిములతో వివిధ డోస్‌ల్లో మందులు ఇచ్చి వ్యాధి కారక జీవులపై అప్రకటిత యుద్ధం చేస్తున్నారు. ఈ ధన్వంతరిలు కొన్నిసార్లు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలు కూడా మరిచి పోతూ..... ఆవిధంగా వారు రోగుల సేవలో మానసా, వాచా.. కర్మణా నిమగ్నమైతారు. స్నేహితులతో గడపడం, వేడుకలకు హాజరుకావడం వీరికి కష్టతరమే. జీవిత భాగస్వామి కంటే ధన్వంతరి తన వృత్తి జీవితానికే ప్రాధాన్యత ఇస్తాడు. ఇక వృత్తిలో ఇలాంటి సాధక బాధలను అర్ధం చేసుకోగలరనే ఉద్దేశంతో అదే వృత్తిలో అనగా డాక్టర్‌గా పనిచేసే వారినే జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటున్నారట!




No comments:

Post a Comment