Wednesday 3 January 2018

మూత్రపరీక్ష ద్వారా కేన్సర్ గుర్తింపు

శరీరాన్ని కబళించి క్రమంగా ప్రాణాలు తోడేసే కేన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే చికిత్స ద్వారా బయటపడొచ్చు. దీనికి బోలెడంత శ్రమ, నిరీక్షణ కావాలి. బయాప్సి ద్వారానే కేన్సర్‌ ఎలాంటి స్థితిలో ఉందో...అసలు అది కేన్సరో కాదో తెలుసుకునే వీలుంది. 
ఇకపై అంత శ్రమ అవసరం లేదంటున్నారు జపాన్‌ శాస్త్రవేత్తలు. కేవలం మూత్ర పరీక్ష ద్వారానే కేన్సర్‌ను గుర్తించ వచ్చని చెబుతున్నారు. నానోవైర్‌ పరికరం ద్వారా దీనిని కనిపెట్టవచ్చని జపాన్‌లోని నగోయా విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ విధానంలో రోగి నుంచి ఒక మిల్లీలీటరు మూత్రం సేకరిస్తే సరిపోతుందని టకాయో తెలిపారు.

Tuesday 2 January 2018

కేన్సర్.. వర్రీ వద్దు



ఒకప్పుడు దాని పేరు రాచపుండు. అదే ఇవాళ మనందరికీ తెలిసిన కేన్సర్. మందులకు లొంగని మొండి రోగం అనుకునే రోజులు పోయి. కాన్సర్ చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ రంగంలో ఎంతో కృషి చేసి ఎందరికో కేన్సర్ నుంచి  విముక్తి కలిగించారు.  కేన్సర్ కన్నా కేన్సర్ ట్రీట్‌మెంట్ చాలా భయంకరమైందని అపోహలు పడి చాలా మంది చికిత్స తీసుకునే వారు కాదు. ఇప్పుడు కేన్సర్‌కు చాలా రకాలైన నూతన వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.




             అందులో వైద్య పద్ధతుల్లో కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రివెల్యూషన్ ఏంటంటే.. కేన్సర్ పేషెంట్‌ని సర్జనో, మెడికల్ ఆంకాలజిస్టో, రేడియేషన్ ఆంకాలజిస్టో కాకుండా ఒక టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్స్ కలిసి చూడాలి. ఇప్పుడు కొత్తగా పెట్ స్కాన్ అందుబాటులోకి వచ్చింది..

Monday 1 January 2018

బ్లూబెర్రీతో గర్భాశయ కేన్సర్ కు చెక్

గర్భాశయ కేన్సర్‌ నివారణ కోసం చేసే రేడియేషన్‌ చికిత్సకు కేన్సర్‌ కణాలు బాగా స్పందించేలా బ్లూబెర్రీలు ఉపయోగపడుతాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరీ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్లూబెర్రీల సారం రేడియోసెన్సిటైజర్లలా వ్యవహరిస్తాయని, హానికరం కాని ఈ రసాయనం.. కేన్సర్‌ కణాలు రేడియేషన్‌ చికిత్సకు స్పందించేలా చేస్తాయని వెల్లడించారు.






బ్లూబెర్రీలలో రెస్వెట్రాల్‌(ప్రొస్టేట్‌ కేన్సర్‌ను అడ్డుకునే రేడియోసెన్సిటైజర్‌), ఫ్లెవొనాయిడ్స్‌ అనే రసాయనాలు ఉంటాయని, అందులో ఫ్లెవొనాయిడ్స్‌ ప్రతిక్షకారినిలా, శోథ నిరోధకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.