Monday 7 August 2017

బ్లడ్ కేన్సర్ కు కొత్త మందు

లడ్ కేన్సర్ బాధితులకు గుడ్ న్యూస్. వ్యాధితో బాధ పడుతున్న వారికి మెరుగైన చికిత్సను అందించేందుకు ఓ కొత్త మెడిసిన్ ను సైంటిస్టులు తయారు చేశారు. ఈ మందును విడిగా వాడినా.. కిమోథెరపీతో పాటు అందించినా మంచి ప్రభావం చూపిస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో స్పష్టమైంది. ఈ డ్రగ్ ను అభివృద్ధి చేసిన టీంకు భారత సంతతి పరిశోధకురాలు,యూనివర్శిటీ ఆఫ్ యూటా పోస్ట్ డాక్టొరల్ శ్రీవిద్య భాస్కర  నేతృత్వం వహించారు. అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా(ALL) గా వ్యవహరించే బ్లడ్ కేన్సర్ చిన్నా పెద్దా తేడాలేకుండా అందరిపైనా దాడిచేస్తుంది.











దీని బాధితుల్లోని 30% మందిలో ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. క్రోమోజోమ్ లోని రెండు విభాగాలు వాటి స్వభావానికి భిన్నంగా అతుక్కుపోతే దాన్ని ఫిలడెల్పియా క్రోమోజోమ్ గా వ్యవహరిస్తారు. కొత్తగా ఏర్పడిన ఈ క్రోమోజోమ్ DNA ను మరమ్మతు చేయడం ప్రారంభిస్తుంది. DNA  రిపేర్ అంటే వినడానికి ఏదేదో మంచి విషయంలాగానే అనిపించవచ్చు. కానీఈ క్రమోజోమో చే మరమ్మతు ఫలితం చెడుకే దారి తీస్తుంది. ఆ ప్రక్రియ వ్యసనంగా మారి నిరంతరం కొనసాతుంది. ఈ ప ర్రక్రియ కోసం ఆక్రోమోజోమ్ వినియోగించే రకరకాల ప్రోటీన్లను అడ్డుకోడానికి పలు రకాల మందలను వాడాలి. అలా వాడితే అవి విషపూరితంగా మారి సాధారణ కణాలపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే ఈ వ్యసనాన్ని నిరోధించేందుకు విస్తృతంగా ప్రయోగాలు చేసి హిస్టోన్ డియాసిటైలసిస్ అనే రెండు ప్రొటీన్లపై ప్రధానంగా దృష్టి సారించి సరికొత్త మెడిసిన్ ను ఆవిష్కరించినట్లు పరిశోధకులు తెలిపారు.

Sunday 6 August 2017

కేన్సర్ కు పసుపుతో చెక్

పసుపులో ఔషధ గుణాలున్నాయని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. ఇప్పుడు దీనికున్న మరో అద్భుతమైన గుణాన్ని శాస్త్రవేత్తలు పరిశోధించి కనుగొన్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే పసుపు కేన్సర్‌ నిరోధించడానికీ సాయపడుతుందని అమెరికా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం. పసుపులో ఉండే కర్కమిన్‌ సాయంతో పసికందులలో వచ్చే కేన్సర్‌ను సమర్థమంతంగా నిరోధించవచ్చట.



కాగా, పదేళ్లలోపు చిన్నారులకు ఈ కేన్సర్‌ ముప్పు ఎక్కువ. ఇందులో కణుతులు మందులకు లొంగవని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా మొండి కణుతులే లక్ష్యంగా సూక్ష్మ అణువులను పంపించేందుకు కర్కమిన్‌ తోడ్పడుతుందన్నారు. కణితిని అణిచివేసే సూక్ష్మ అణువులను కర్కమిన్‌కు జతచేసి నేరుగా లక్ష్యానికి చేర్చవచ్చన్నారు. ఇలా ఓ ప్రత్యేక పద్ధతిలో దాడి చేసి కేన్సర్‌ను నియంత్రించవచ్చని చెప్పారు. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీలో కేన్సర్ చికిత్స

జిల్లాకు ఒక యూనిట్‌, ప్రాంతానికి ఒక సూపర్‌ స్పెషాలిటీ, ఉన్న దగ్గర ఉన్నతంగా మెరుగులు.. ఏపీ అంతా కేన్సర్‌ వైద్య అవకాశాలను పెద్దఎత్తున పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. రాష్ట్రంలో కేన్సర్‌ వైద్య చికిత్సకు అవకాశాలు తక్కువ. ఉన్నదగ్గర కూడా, ప్రాథమికస్థాయిలోని కేసులకే వైద్యం అందించే వీలుంది.  విజయవాడలో ఈరోజుకీ ఒక్క కేన్సర్‌ సెంటర్‌ కూడా లేదు. విశాఖ, గుంటూరులలో స్టేజ్‌-1 కేసులను చూడగలుగుతున్నారు. దీంతో, అయితే హైదరాబాద్‌ లేదంటే చెన్నై, బెంగళూరుకు రోగులు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలో వారికి వారు ఉన్నదగ్గరే పూర్తిస్థాయిలో పరీక్షలు, చికిత్సను అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా.. 13 జిల్లాల్లోనూ జిల్లాకు ఒక చొప్పున కేన్సర్‌ యూనిట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.



విశాఖ కేజీహెచ్‌లో ఆంకాలజీ విభాగంలో రేడియేషన్‌ థెరపీతో కేన్సర్‌ రోగులకు వైద్యం చేస్తున్నారు. సాధారణ స్టేజ్‌లో ఉన్న రోగులకు మాత్రమే ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ విభాగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది పక్కా ప్రణాళిక రూపొంచింది. కర్నూలు జిల్లాలో రూ.120 కోట్ల నిధులతో స్టేట్‌ కేన్సర్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించే ఈ ఆసుపత్రి.. రిఫరల్‌ సేవలు అందిస్తుంది. రాష్ట్రంలోని అన్ని కేన్సర్‌ ఆసుపత్రులు, ఓపీ బ్లాక్‌ల నుంచి చివరి దశ రోగులను ఇక్కడకు తరలిస్తారు. ఇక..నెల్లూరు జిల్లాలో రూ. 40కోట్లతో థెర్సికేర్‌ కేన్సర్‌ సెంటర్‌ ఏర్పాటు కాబోతుంది. తిరుపతి స్విమ్స్‌లో ఆంకాలజీ విభాగం అద్భుతంగా కొనసాగుతోంది. విజయవాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో ప్రత్యేకంగా సూపర్‌ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.

Saturday 5 August 2017

బ్రెడ్డుతో కేన్సర్ ఖాయమా..?

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) అనేది విశ్వసనీయ సంస్థ. ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో బ్రెడ్, బర్గర్, పిజ్జాలలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ ఉన్నట్టు తెలిసింది. మార్కెట్లో ఉన్న 38 ప్రముఖ బ్రాండ్ల బ్రెడ్లు, బన్ లు, బర్గర్, పిజ్జాల శాంపిల్స్ ను సేకరించి తన పరిధిలోని ల్యాబ్ లోను, మూడో పక్షానికి చెందిన ల్యాబ్ లలోను పరీక్షింపజేసింది. వీటిలో 84 శాతం శాంపిల్స్ లలో ఈ ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని సీఎస్ఈ వెల్లడించింది.






దేశీయ తయారీదారులు బ్రెడ్ తయారీలో ఈ రసాయనాలను వినియోగిస్తున్నట్టు తెలిపింది. పొటాషియం బ్రోమేట్ కేటగిరీ 2బి కార్సినోజెన్... అంటే ఇది కేన్సర్ కు దారితీయగలదు. థైరాయిడ్ కేన్సర్, మూత్రపిండాలు, ఉదర సంబంధ కేన్సర్లకు కూడా కారణమవుతుంది. పొటాషియం అయోడేట్ రసాయనం థైరాయిడ్ సమస్యకు దారితీస్తుంది. వీటితో ఆరోగ్యానికి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకున్న సీఎస్ఈ తక్షణమే వీటిని నిషేధించాలని దేశీయ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థను కోరింది.

Friday 4 August 2017

బోన్ కేన్సర్ వ్యాధి విద్యార్థి సీబీఎస్ఈ పరీక్షల్లో టాపర్

అతడి పట్టుదల ముందు భయంకరమైన కేన్సర్ వ్యాధి తలవంచింది ప్రాణాంతకమైన కేన్సర్‌తో పోరాటం చేస్తూ ఓ పందొమ్మిదేళ్ల విద్యార్థి ప్లస్‌ 2లో 95 శాతం మార్కులు సాధించాడు. ఇటీవలే ప్రకటించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ ప్లస్ 2 ఫలితాల్లో రాంచీకి చెందిన తుషార్ రిషి 95 శాతం మార్కులు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేన్సర్ వ్యాధికి చికిత్స కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌‌కు వెళ్తూ ఎలాంటి శిక్షణ లేకుండానే ఇంగ్లిష్‌లో 95, ఫిజిక్స్‌లో 95, మ్యాథ్‌మెటిక్స్‌లో 93, కంప్యూటర్స్‌లో 89, ఫైన్ఆర్ట్స్‌లో 100 మార్కులు సాధించాడు.








2014లో కేన్సర్ బారిన పడిన తుషార్ రిషి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయలేకపోయాడు. పరీక్షలకు ముందే బోన్ కేన్సర్ సోకినట్లు నిర్ధరణ కావడంతో 11 నెలల పాటు కిమోథెరపీ చేయించుకున్నాడు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తుషార్ 2015లో పదో తరగతి పరీక్షలకు హాజరై 10కి పది పాయింట్లు సాధించాడు. సైన్స్ విద్యార్థి అయిన రిషి ఇంజినీరింగ్ కోర్సు కాకుండా ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లేదా ఎకనమిక్స్‌ డిగ్రీ చేస్తానని పేర్కొన్నాడు.

Thursday 3 August 2017

పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే..

పెద్దపేగు, మలద్వారాలకు వచ్చే కేన్సర్‌ను కోలోరెక్టల్, కోలన్ కేన్సర్ అని అంటారు. ఈ వ్యాధిలో పెద్దపేగు, మలద్వారం, అపెండిక్స్ భాగాల్లో కేన్సర్ కంతులు ఏర్పడి క్రమంగా పెరుగుతూ వుంటాయి. కేన్సర్ వ్యాధుల్లో దీనిని మూడవ అతి పెద్ద కేన్సర్‌గా చెపుతారు. కేన్సర్ వల్ల వచ్చే మరణాలకు ఇది రెండవ అతి పెద్ద కారణం. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 6,55,000 మంది కోలన్ కేన్సర్‌వల్ల మృత్యువు బారిన పడుతున్నారని ఎన్నో సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ మధ్య ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.



     

పెద్దపేగులో పెరిగి- కేన్సర్ కాని కంతులైన అడినోమాటస్ పాలిప్స్ నుంచి ఈ కేన్సర్ కంతులు ఉద్భవిస్తాయని భావిస్తున్నారు. కుక్కగొడుగులలాగా ఉండే ఈ అడినోమాటస్ పాలిప్స్.. మామూలుగా బినైన్ కంతులే అయి ఉంటాయి. కాని వాటిలోని కొన్ని మాత్రం తర్వాత కాలంలో కేన్సర్లుగా పరిణామం చెందుతాయి. పెద్దపేగులో వచ్చే కేన్సర్లను కొలనోస్కోపీ పరీక్ష ద్వారా నిర్థారించడం జరుగుతుంది.

Wednesday 2 August 2017

అన్ని జబ్బులకు ఒకటే మందు

మనకు తెలుసు మానవ శరీరం దానికదే రోగ నివారిణి గా పనిచేస్తుంది. అది ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. అమెరికా లోని ఒక వ్యక్తి దీన్ని స్ఫూర్తి గా తీసుకొని సర్వరోగ నివారిణి గా ఒక మందు తయారు చేసాడు. అతని పేరు డాక్టర్ సెబి. అతనొక్కడే రోగ నిర్దారక వైద్యుడు,జీవ శాస్త్రవేత్త,ఔషద శాస్త్రవేత్త. ఆటను హోండురాస్ నుంచి వలస వచ్చి అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. రోగం ఏదైనప్పటికీ ప్రజలకు తన సేవలను అందించాడు. అతను ప్రకృతి వైద్యం ఉపయోగించి నయం కాని రోగాలను నయం చేస్తున్నాడు. అయితే 1988 లో న్యూయార్క్ సుప్రీం కోర్టులో అతనిపై విచారణకు ఉపక్రమించారు.





లైసెన్స్ లేకుండా అతను ప్రాక్టీస్ చేస్తున్నాడని, న్యూయార్క్ పోస్ట్ వంటి వార్తా పత్రికల్లో ప్రచారం చేస్తున్నదనేది అతనిపై అభియోగం. విచారణలో జడ్జి అతన్ని ఒక్క సాక్ష్యమైనా చూపించమని అడగ్గా 77 మంది సాక్షులు అతని తరపున సాక్ష్యం చెప్పేందుకు వచ్చారు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం జడ్జి వంతయింది. ఆటను నిజంగా నయం చేయగలదని రుజువు కావడంతో న్ర్దోశిగా విడుదల చేసారు. అతని దగ్గర వైద్యం చేయించుకున్న ప్రముఖుల్లో మైఖేల్ జాక్సన్, మాజిక్ జాన్సన్, ఎడ్డీ మర్ఫీ, జాన్ ట్రవోల్టా వంటి ప్రముఖులు ఉన్నారు.

Tuesday 1 August 2017

కేన్సర్ కు టీకా మందు

ప్రాణాంతక కేన్సర్‌కు విరుగుడు కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నంలేదు. రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్‌ కణాలపై దాడి చేసే విధానాన్ని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ప్రయత్నించలేదు. అయితే చర్మ కేన్సర్లపై ఇటీవల జరిగిన రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ కేన్సర్‌ కణితులకు అనుగుణంగా టీకాలను అభివృద్ధి చేయగలమన్న భరోసా శాస్త్రవేత్తల్లో కల్పిస్తున్నాయి. కేన్సర్‌ కణాల ఉపరితలంపై కనిపించే నియో యాంటీజెన్స్‌ ద్వారా ఇది సాధ్యం కావచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని బోస్టన్‌లోని డానా ఫార్బర్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్, జర్మనీకి చెందిన బయో ఫార్మాసూటికల్‌ న్యూ టెక్నాలజీస్‌లు వేర్వేరుగా నిర్వహించిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది.









కేన్సర్‌ కణితుల్లో ఉండే యాంటీజెన్లను కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసి రోగి శరీరాల్లోకి ఎక్కించినప్పుడు దీర్ఘకాలం పాటు కేన్సర్‌ తిరిగి రాలేదని నిపుణులు గుర్తించారు. కొంతమందిలో కేన్సర్‌ కణాల ఆనవాళ్లు లేకుండా పోయాయని.. ఈ రెండు ప్రయోగాల్లో వాడిన టీకాలు సత్ఫలితాలివ్వడంతో కేన్సర్‌కు విరుగుడుగా టీకా అభివృద్ధి చేసే అవకాశాలు పెరిగాయంటున్నారు. ఈ టీకా ఒక్కో రోగికి ప్రత్యేకంగా తయారవుతుందట. కేన్సర్‌ కణాల్లోని నియోయాంటీజెన్లతో టీకాలను అభివృద్ధి చేయడానికి ప్రస్తుతం అధిక మొత్తంలో ఖర్చు కావడమే కాకుండా ఎక్కువ సమయం పడుతుందని తెలిపిన శాస్త్రవేత్తలు.. ఇది అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టొచ్చు అని వెల్లడించారు.