ప్రాణాంతక ఊపిరితిత్తుల కేన్సర్‌ను మొదటిదశలోనే పసిగట్టేందుకు సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లంగ్ కేన్సర్ ఇండికేటర్ డిటెక్షన్, లూసిడ్ గా వ్యవహరిస్తున్న ఈ పరికరం.. శ్వాసను పరీక్షించడం ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్ జాడలను ఇట్టే పసిగడుతుందని అన్నారు. కేంబ్రిడ్జికి చెందిన ఓవల్‌స్టోన్ నానోటెక్ లిమిటెడ్ కంపెనీ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. లంగ్ కేన్సర్ సోకిన తర్వాత బాధితుల జీవితకాలం ఐదేళ్లకు పడిపోతుంది.
లంగ్ కేన్సర్ ను ముందుగా గుర్తించడం వల్ల బాధితులను రక్షించేందుకు అవకాశం లభిస్తుందని ఓవల్‌స్టోన్ సహ వ్యవస్థాపకుడు బిల్లీ బోయలే తెలిపారు. ప్రస్తుతం తుది పరిశీలన దశలో ఉన్న లుసిడ్‌ను ఏడాదిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ పరికరంతో లంగ్ కేన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించవచ్చని వివరించారు.
No comments:
Post a Comment