అమెరికా
పక్కనే ఉండే చిన్న ద్వీపం క్యూబా. పంచదార ఎక్కువగా పండించే ఈ దేశం లంగ్
కేన్సర్ రోగులకు ఒక తీపి వార్తను వినిపించింది. క్యూబా రాజధాని హవానాలో
ఉన్న సెంట్రో దీ ఇమ్యునలోజియా మాలిక్యూల్ అనే పరిశోధనా కేంద్రంలో పనిచేసే
శాస్త్రవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని పట్టి పీడిస్తున్న లంగ్
కేన్సర్ భూతానికి వేక్సిన్ ను కనుగొన్నారు. దీనితో ఈ పరిశోధనా కేంద్రం పై
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల దృష్టి పడింది. సిం అవాక్స్ పేరుతో
పిలిచే ఈ వేక్సిన్ ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 5 వేల మందిమీద ప్రయోగించి
సంతృప్తికర ఫలితాలు సాధించారట.
ఈ వేక్సిన్ తీసుకున్న కేన్సర్ రోగుల జీవిత కాలం తీసుకొని వారికంటే సగటున 11 నెలలు ఎక్కువగా ఉందని సమాచారం. ఈ వేక్సిన్ తీసుకున్న ఆల్బర్ట్ సాన్చేజ్ అనే 77 ఏళ్ల వృద్ధుడు మాత్రం 2002 లోనే లంగ్ కేన్సర్ బారిన పడినా ఇప్పటికీ జీవించే ఉన్నాడు. వేక్సిన్ తో పాటు తనకున్న మనోధైర్యమే అతని జీవిత కాలం పెరగటానికి కారనామని ఆ సైంటిస్టులు అన్నారు. ఈ వేక్సిన్ ఇతర కేన్సర్ ఔషదాలలాగా కేన్సర్ కణాలను నేరుగా చంపివేయదని, శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి అది కేన్సర్ కణాలను చంపేలా చేస్తుందని అంటున్నారు. క్యూబాలోని ఈ పరిశోధనా కేంద్రం ఇప్పటివరకు 21 ప్రాణాంతక రోగాలకు వేక్సిన్లను కనుగొన్నది.

No comments:
Post a Comment