వెంట్రుకలను తొలగించే లేజర్ ట్రీట్‌మెంట్లు కేన్సర్‌కు దారి తీస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. లేజర్ ట్రీట్‌మెంట్ చేసేటప్పుడు విడుదలయ్యే పొగ వల్ల ఈ ప్రమాదం ఉంటుందట. రోజూ ఈ పొగను పీల్చేవాళ్లకయితే ప్రమాదం మరీ ఎక్కువట. వెంట్రుకలు కాలడం వల్ల వచ్చే పొగలో గాలిని కాలుష్యం చేసే రసాయనిక కారకాలున్నాయి. ఇవే కేన్సర్‌కు దారితీస్తాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. సరైన శిక్షణ లేని ప్రొఫెషనల్స్‌తో లేజర్ ట్రీట్‌మెంట్ చేయించడం వల్ల, కావలసిన పరికరాలు లేకపోవడం వల్ల చాలామంది పేషెంట్లు కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు.
ఎయిర్ ఫిల్టరైజేషన్ సిస్టమ్, స్మోక్ ఎవాక్యుయేటర్‌లు ఉన్నచోట లేజర్ ట్రీట్‌మెంట్‌ను నిర్వహించాలని పరిశోధకులు చెబుతున్నారు. ఇద్దరు వలంటీర్ల నుంచి హెయిర్ శాంపిల్స్‌ను సేకరించి, వాటిని గాజు సీసాల్లో ఉంచి సీల్ చేశారు. తర్వాత ఆ వలంటీర్లకు లేజర్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఆ సమయంలో 30 సెకండ్ల ఫ్యూమ్‌ను సేకరించారు. దానిలో మొత్తం 377 రసాయన కారకాలు ఉన్నాయి. వాటిల్లో పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ మోనాక్సైడ్‌లాంటి 20 రకాల టాక్సిన్స్ కూడా ఉన్నాయి. 13 రకాల కెమికల్స్‌లో కేన్సర్ కారకాలు ఉన్నాయని వెల్లడైంది.

No comments:
Post a Comment