పిజ్జాలో బ్రెడ్... బర్గర్‌లో బ్రెడ్.... చాయ్‌లోకి బన్ను... బట్టర్, జామ్ రాసిన బ్రెడ్ ముక్కలు... జ్వరమొస్తే ఆహారంగా బ్రెడ్. ఇంకా... శాండ్‌విచ్‌లు, పావ్‌భాజీ, టోస్టులతోపాటు రకరకాల రూపాల్లో బ్రెడ్‌ను మింగేస్తున్నాం. మొత్తానికి బ్రెడ్‌తో మనిషికి అవినాభావ ఆహారబంధం. అయితే... ఇదే బ్రెడ్డులు, బన్నులలో కేన్సర్ కారక రసాయనాలున్నాయని తేలింది. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఈ సంగతి తేల్చింది. బ్రెడ్డు తయారీలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ ఉపయోగిస్తారు. కేన్సర్ కారక రసాయనాల జాబితాలో పొటాషియం బ్రోమేట్‌కూడా ఒకటి. ఇక పొటాషియం అయేడేట్‌వల్ల శరీరంలో అయోడిన్ స్థాయి పెరిగి థైరాయిడ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతిమంగా... థైరాయిడ్ కేన్సర్ రావొచ్చు. ప్రము ఖ కంపెనీలుసహా మార్కెట్‌లోగల బ్రెడ్‌లు, బన్నులపై సీఎ్‌సఈ పరీక్షలు చేసింది. బేకరీల నుంచి సేకరించిన 84 శాతం శాంపిల్స్‌లో బ్రోమేట్, అయోడేట్ అవశేషాలున్నట్లు తెలిపింది.
పొడి లేదా గుళికల రూపంలో ఉండే పొటాషియం బ్రోమేట్‌కు రంగు, రుచి, వాసన ఉండవు. దీన్ని పులియబెట్టే ఉత్ప్రేరకంగా వాడతారు. దీనివల్ల కేన్సర్ ముప్పుందని అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ నిర్ధారించింది. ఈ రసాయనాన్ని కేటగిరీ-2బీలో చేర్చింది. దీనివల్ల కడుపునొప్పి, డయేరియా, తల తిరగడం, వాంతులు, కిడ్నీ వైఫల్యం, చెవుడు, బీపీ, డిప్రెషన్‌వంటి సమస్యలూ తలెత్తుతా యని వివిధ పరిశోధనల్లో తేలింది. ఈ రసాయనాన్ని ఆహార పదార్థాల తయారీలో వినియోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్‌ఏవోల సంయుక్త నిపుణుల కమిటీ ఎప్పుడో స్పష్టం చేశాయి. బ్రోమేట్‌ను అనేక దేశాల్లో నిషేధించారు. పొరుగునే ఉన్న శ్రీలంక, చైనాల్లోనూ నిషేధం ఉంది.
No comments:
Post a Comment