మీరు ప్రొస్టేట్ కేన్సర్‌కు దూరంగా ఉందామనుకుంటున్నారా? ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్షా డబ్బై వేల మంది ఈ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని “వరల్డ్ కేన్సర్ రీసెర్చ్ ఫండ్ సంస్థ” తెలియజేసింది. తాజాగ ప్రొస్టేట్ క్యాన్సర్ పై చేసిన పరిశోదనలో ప్రతి రోజు శృంగారంలో పాల్గొంటే ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించవచ్చు అంటున్నారు వైద్యులు.
నెలలో దాదాపు 21 సార్లు వీర్య స్ఖలనం చేసే వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 23 శాతం వరకు తగ్గుతుందని హార్వర్డ్ పరిశోధకులు ఇటీవల వెల్లడించారు. రోజూ వీర్యం బయటకు పోతుండడంతోపాటు ఆక్సిటోసిన్, సెరటోనిన్, ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ల విడుదల ప్రొస్టేట్ కేన్సర్‌ను అడ్డుకుంటాయని వారు తెలిపారు. అయితే, ఈ సరస శృంగారాలను మీ జీవితభాగస్వామితో మాత్రమే నెరపడం,సురక్షితం అని వైద్యులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment