సన్నని నడుం అందానికి చిహ్నమనుకుంటాం. ముఖ్యంగా నాజూకైన నడుము మగువల అందానికి తార్కాణంగా భావిస్తుంటాం. అందానికే కాదు ఆరోగ్యానికి కూడా నడుము సన్నగానే ఉండాలంటున్నారు పరిశోధకులు. నడుము లావుగా పెరిగితే నడి వయసులో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకనే జీవన రీతులను మెరుగుపరుచుకుని, ఆహారపు అలవాట్లను నియంత్రించుకుని, శారీరక వ్యాయామం చేస్తూ నడుము లావు
కాకుండా చూసుకోవాలని బ్రిటన్ లోని న్యూ కేస్ట్లే యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ జాన్ మెతెర్స్ సూచిస్తున్నారు.
నడుము లావు ఐదు శాతం పెరిగితే కేన్సర్ ప్రమాదం 18 శాతం పెరిగినట్లు పరిశోధకులు కనుగొన్నారు. మగవారికి పదేళ్ళ కాలంలో నడుము కనీసం 10 సెంటీమీటర్లు లావు పెరిగితే కేన్సర్ ప్రమాదం 60 శాతం పెరుగుతుందని నిర్ధారణకు వచ్చారు.

No comments:
Post a Comment