కేన్సర్ బాధితుల వ్యాధి నిరోధక కణాలతోనే.. కేన్సర్‌ను సమర్థంగా నియంత్రించే విధానాన్ని అమెరికాకు చెందిన నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సాధారణ కణాలు కేన్సర్ కణాలుగా మారడం వల్ల విడుదలయ్యే ఒక ప్రొటీన్‌ను గుర్తించగలిగే వ్యాధినిరోధక కణాలను వారు గుర్తించారు. సాధారణంగా మానవ చర్మంలోని మెలనోమా కణితుల్లో ఈ టీఐఎల్‌లు ఉంటాయి.
ఒక ఊపిరితిత్తులు, కాలేయ కేన్సర్లతో బాధపడుతున్న మహిళ నుంచి ఈ కణాలను సేకరించిన శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో భారీ సంఖ్యలో అభివృద్ధి చేసి, తిరిగి ఆమె శరీరంలో ప్రవేశపెట్టారు. కొద్ది రోజుల అనంతరం పరిశీలించగా ఆమె ఊపిరితిత్తులు, కాలేయంలోని కేన్సర్ కణితులు.. కొంతవరకూ కుచించుకుపోయినట్లు గుర్తించారు. ఆరు నెలల అనంతరం మళ్లీ ఇదే తరహా చికిత్స చేసి చూడగా.. మరింత అద్భుతమైన ఫలితాలు వచ్చాయని పరిశోధనకు నేతృత్వం వహించిన స్టీవెన్ రోసెన్‌బర్గ్ చెప్పారు. దీనిని మరింతగా అభివృద్ధి చేసి, మెరుగైన చికిత్సను రూపొందిస్తామని… కేన్సర్ చికిత్సలో ఇదొక గొప్ప ముందడుగని పేర్కొన్నారు.

No comments:
Post a Comment