Sunday, 29 January 2017

అక్కడి నీరు త్రాగితే కేన్సర్ గ్యారెంటీ

నీరు.. పంచభూతాల్లో ఒకటి. మనిషికి అత్యంత అవసరమైన వనరు. ఇదిలేకుండా మనిషి ఉండలేడు. సాధారణంగా ఎవరైనా ఒక ఇంటిని నిర్మించుకున్నాముందు నీటితోనే ప్రారంభిస్తారు. అంటే ఇంటి నిర్మాణానికి ముఖ్యమైన వాటిలో నీరు కూడా ఒకటి కనుక. కానీ ఇక్కడ మనం త్రాగే నీటి గురించి మాట్లాడుకుంటే, ఏదైనా అద్దె ఇంటికి వెళితే అక్కడ నీటి సౌకర్యం ఎలా ఉంటుందని ఆరా తీస్తారు. అందరూ మంచినీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కొన్ని చోట్ల మంచినీరు లేకపోతే వస్తున్న నీటినే పలు విధాలుగా శుభ్రం చేసుకుని త్రాగుతారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ మంచినీరు లభ్యం కాకపోవడంతో అక్కడి ప్రజలు ప్రమాదం అంచున జీవిస్తున్నారనే చెప్పాలి. దీని వలన వారు తరచూ అనారోగ్యాలకు గురి కావడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.


చాలా పెద్ద నగరాలు, పట్టణాలు సైతం నీటి కాలుష్యంలో కూరుకుపోవడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు కొన్ని ప్రధాన పట్టణాల్లో నీటిని త్రాగితే ఆ నీటి వలన ప్రజలు ప్రాణాంతక వ్యాధులకు గురి కావచ్చనేది విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్.. దక్షిణాదిలోని ఈ నాలుగు ప్రధాన నగరాల్లో నీళ్లు తాగితే కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేసిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైంది. ఈ నాలుగు నగరాల్లో ఉన్న భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ అనే విషపదార్థం చాలా ఎక్కువ స్థాయిలో ఉందని, ఎక్కువ కాలం పాటు ఈ నీళ్లు వాడటం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు ఎక్కువవుతాయని అన్నారు.

1 comment:

  1. Good post sir
    తెలుగు డబ్బింగ్ సినిమాల సునామీ!
    Nice Blog for All Telugu Dubbed Movies

    ReplyDelete