ప్రాణాంతక కేన్సర్‌కు చికిత్స లభించిందా? ఒళ్లు గుల్ల చేసే థెరపీలు లేకుండానే రోజుకో మాత్రతో నయమవుతుందా? ఈ ప్రశ్నలకు ఆస్ట్రేలి యా శాస్త్రవేత్తలు ఔననే సమాధానమే ఇస్తున్నారు. వెన్‌క్లెక్‌స్టా పేరుతో తాము తయారు చేసిన ఈ మా త్రలను రోజుకొకటి వేసుకుంటే చాలు.. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుం డానే కేన్సర్‌ను మటుమాయం చేయవచ్చని మెల్‌బోర్న్ కేంద్రంగా పనిచే స్తున్న వెనెటోక్లాక్స్ కంపెనీ ప్రకటించింది. ఈ ఔషధానికి ఆస్ట్రేలియా థెరప్యూటిక్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి కూడా లభించిందట. కేన్సర్‌కు శస్త్రచికిత్స, కీమో, రేడియోథెరపీల వంటి వైద్య విధానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఇవన్నీ వ్యయ, ప్రయాసలతో కూడుకున్నవే. ఈ నేపథ్యంలో వెనెటోక్లాక్స్ ఆవిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంది. కేన్సర్ కణాల్లో బీసీఎల్–2 ప్రొటీన్ ఉంటుంది. వ్యాధి కారక కణాలు బతికి ఉండేందుకు ఈ ప్రొటీనే కారణం. దాన్ని నిర్వీర్యం చేసేందుకు 30 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. ఫలితం రాలేదు. అయితే వెనెటోక్లాక్స్‌కు చెందిన డాక్టర్ డేవిడ్ హువాంగ్ ఈ విషయంలో విజయం సాధించారు. బీసీఎల్–2 ప్రొటీన్ పనిచేయకుండా చేయడమే కాకుండా.. కేన్సర్ కణం మరణించేలా ఔషధాన్ని రూపొందించారు. దీన్ని రోజుకో మాత్ర రూపంలో తీసుకుంటే సరిపోతుందని హువాంగ్ అంటున్నారు.

No comments:
Post a Comment