సర్వైకల్ కేన్సర్ ప్రపంచంలో మరెక్కడా లేనంతగా భారతదేశంలో మహిళలను హతమారుస్తోంది. కేన్సర్ రాకుండా వాక్సిన్ ద్వారా ముందుగానే నిరోధించే అవకాశం రూపొందిన తొలి కేన్సర్ రకం ఇదే. ఇందుకుగాను ఒకటి కాదు రెండు వ్యాక్సీన్లు ఉన్నాయి. అయినా కూడా భారతదేశంలో ఇది ఏటా 1,32,000 మంది మహిళలకు సోకుతోందని, ఇందులో 72వేల మంది దీనితో పోరాటంలో చనువు చాలిస్తున్నట్టు సర్వైకల్ కేన్సర్ ప్రీ కొలియేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని పూర్తిగా నిరోధించలేనప్పటికీ చక్కటి అవగాహన పెంపొందించుకోవడం ద్వారా దీనివల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
దేశంలో ఏటా 7 లక్షల మేరకు కేన్సర్ నూతన కేసులు బయటపడుతుండగా 3.5 లక్షలమంది కేన్సర్ కారణంగా మరణిస్తున్నారు. ఈ 7 లక్షల నూతన కేసుల్లో 2.3 లక్షలకుపైగా కేసులు పొగాకు వినియోగానికి సంబంధించినవి. గర్భాశయాన్ని మరియు జననాంగాన్ని కలిపే సెర్విక్స్ యొక్క కణజాలంలో చోటుచేసుకునే కేన్సర్‌ను సర్వైకల్ కేన్సర్ అని అంటారు. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఎలాంటి లక్షణాలను కనబరచకపోవచ్చు. క్రమం తప్పని పాప్ టెస్ట్‌ల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్‌ఫెక్షన్ దీనికి ప్రధాన కారణం.

No comments:
Post a Comment