రొమ్ము కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపంగా పరిణమించింది. ఎందుకు, ఎప్పుడు వస్తుందో కారణాలు తెలియడం లేదు. ఒకప్పుడు నలభై ఐదేళ్లు దాటితేగానీ మహిళల్లో రొమ్ము కేన్సర్ పెద్దగా కనిపించేది కాదు. ఇప్పుడు ముప్ఫై దాటితే చాలు వస్తోంది. మన దేశంలో ఏటా రెండు లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలోనూ రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతోంది.
ముఖ్యంగా రొమ్ము కేన్సర్ బాధితులు నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రొమ్ము కేన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కొద్దిపాటి అవగాహన ఉంటే చాలని అంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర కారణంగా వచ్చే అవకాశాలున్నాయి. పొగతాగడం, మద్యం సేవించే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. చిన్నవయసులోనే పెళ్లిళ్లు, పిల్లలు పుట్టడం వల్ల కూడా ఈ ప్రభావం ఉంటుంది.

No comments:
Post a Comment