తినే తిండి కల్తీ! పీల్చే గాలి కల్తీ! తాగే నీరు కూడా కల్తీ! వీటితోపాటు అనారోగ్యకరమైన జీవనశైలి! కారణమేదైనా గానీ.. తెలంగాణ రాష్ట్రంలో కేన్సర్ రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతుందన్నది మాత్రం చేదునిజం! ఆరోగ్యశ్రీ పథకంలో కేన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ప్రభుత్వం గత నెలలో నిర్వహించిన బ్రెస్ట్‌కేన్సర్ స్ర్కీనింగ్ పరీక్ష ల్లోనూ కేన్సర్ రోగులు పెరుగుతున్నట్లు తేలుతోంది. మరోవైపు కేన్సర్ చికిత్సల వల్ల ప్రజలపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా ఆర్థికంగా భారం అధికం అవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లోని మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే.. రాష్ట్రంలో కేన్సర్ వ్యాధి ఆందోళన కలిగించేలా విస్తరిస్తోందని తెలుస్తోంది.

No comments:
Post a Comment