Wednesday, 11 January 2017

వైట్ వైన్ తో కేన్సర్ గ్యారెంటీ

వైట్‌ వైన్‌ తాగే అలవాటు ఉందా? అయితే దానికి స్వస్తి చెప్పండి. మద్యం ముఖ్యంగా వైట్‌ వైన్‌ తాగేవారికి చర్మ సంబంధమైన కేన్సర్‌ వస్తుందిట. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎండవేడిమి తగలని భాగాలపై ఈ రిస్కు మరింత ఎక్కువగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెప్పారు. వైట్‌ వైన్‌ తాగే వారికి మెలనొమా కేన్సర్‌ రిస్కు ఎక్కువగా పొంచి ఉందట. అమెరికాలోని రోడె ఐలండ్స్‌లోని వారల్‌ అల్‌పర్ట్‌ మెడికల్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ యూనీయంగ్‌ ఛో ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు.


ప్రపంచ వ్యాప్తంగా 3.6 శాతం కేన్సర్‌ కేసులు ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల వస్తున్నాయి. ఆల్కహాల్‌ వినియోగం వల్ల డిఎన్‌ఎ దెబ్బతినడమే కాకుండా డెన్‌ఎ రిపైర్‌ కూడా అసాధ్యమవుతుందిట. రోజూ వైట్‌వైన్‌ తీసుకుంటే మెలనోమా కేన్సర్‌ బారినపడే అవకాశం 13 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment