Friday, 27 January 2017

గ్రీన్ టీ తో కేన్సర్ పరార్

ప్రపంచంలో నీరు తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం టీ మాత్రమే. ఇటీవలి కాలంలో గ్రీన్ టీ విస్తృత ప్రచారంలో ఉంది. ఇప్పుడు గ్రీన్ టీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతున్నారు సైంటిస్టులు. గ్రీన్ టీ ఓ అద్భుత ఆరోగ్య సంపద. ఏకంగా కేన్సర్ లాండి డెడ్లీ డిసీజెస్ కూడా గ్రీన్ టీ పేరు చెబితే ఆమడ దూరం పారిపోతాయట. గ్రీన్ టీ లో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.





             
 అయితే ఈ ప్రయోజనాలన్నీ దక్కాలంటే టీ సరిగ్గా చేయాలంటున్నారు నిపుణులు. కప్పు టీ కోసం ఓ టీ బ్యాగ్ లేదా నాలుగు గ్రాముల టీ పొడి వాడాలి. రోజుకు మూడు కప్పుల గ్రీన్ టీ తాగిన పురుషుల జోలికి కేన్సర్ రాలేదట. ఇక నాలుగు కప్పుల గ్రీన్ టీ తో రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ కూడా మాయమౌతుంది. ఐదు కంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ మళ్లీ రాకపోవడమే కాకుండా.. వ్యాధి వ్యాప్తి చెందే సమయం కూడా బాగా తగ్గినట్లు గుర్తించారు పరిశోధకులు.

No comments:

Post a Comment