Thursday 26 January 2017

గర్భ నిరోధక మాత్రలతో కేన్సర్‌ నుంచి రక్షణ

 గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల మహిళలకు అండాశయ కేన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 2002 నుంచి 2012 మధ్య అండాశయ కేన్సర్‌ వల్ల చనిపోయే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిందని, గర్భనిరోధక మాత్రలు వాడటమే ముఖ్య కారణమని ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిలన్‌ పరిశోధకులు వెల్లడించారు.

అమెరికా, ఈయూ, బ్రిటన్‌, జపాన్‌, తదితర దేశాల్లో 1970 నుంచి జరిగిన పలు అధ్యయనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. ఈ కేన్సర్‌ మరణాల రేటు బాగా తగ్గిందని గుర్తించారు. 2002-12 మధ్య ఈ కేన్సర్‌ మరణాల రేటు ఈయూలో 10 శాతం, అమెరికాలో 16 శాతం, కెనడాలో 8 శాతం, జపాన్‌లో 2 శాతం, ఆసే్ట్రలియా, న్యూజీలాండ్‌లలో 12 శాతం, బ్రిటన్‌లో 22 శాతం తగ్గినట్లు గుర్తించారు.

No comments:

Post a Comment