కేన్సర్ అనేది ఒక వ్యాధి కాదు. ఇది సోకిందని తెలిసే నాటికే దాని తీవ్రత పెరిగి ఉండడం కేన్సర్ వ్యాధికి ఉన్న ప్రధాన లక్షణం. శరీరంలోని ట్రిగ్గర్ కణాలు కణవిభజనపై నియంత్రణ కోల్పోవడంతో కేన్సర్ ప్రారంభమవుతుంది. సంబంధిత పరీక్షల ఆధారంగా వ్యాధి ఉందని, అవయవం ఆధారంగా రకాన్ని తెలుసుకొని సరైన చికిత్స అందిస్తే కేన్సర్‌ను అరికట్టొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
కేన్సర్ అనేది అనేక వ్యాధుల సముదాయం. వాటన్నింటికి ఒకే సాధరణ లక్షణాలుంటాయి. శరీరంలోని ఏ భాగం నుంచి కేన్సర్ వచ్చిందో దాని ఆధారంగా వైద్యులు కేన్సర్ రకాన్ని నిర్ధారిస్తారు. తీవ్ర ఒత్తిడికి గురవ్వడం, పొగ తాగడం, ప్రతికూల పరిసరాల ప్రభావం, కొన్ని అంటువ్యాధులు, జన్యుపరంగా వచ్చే కొన్ని లక్షణాలు కేన్సర్‌కి కారణమవుతాయి.
No comments:
Post a Comment