Wednesday, 4 January 2017

వాక్సిన్‌తో గర్భాశయ కేన్సర్‌ నివారణ



కేన్సర్‌ ప్రాణాంతక వ్యాధే అయినా అది రాకుండా అడ్డుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ ప్రయత్నాలు చేసే వారే తక్కువ. మిగతా కేన్సర్ల మాట ఎలా ఉన్నా, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ రాకుండా నిరోధించే వాక్సిన్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది. కాకపోతే ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందుకే వాక్సిన్లు తీసుకునే వారి సంఖ్య ఈ రోజుకీ చాలా తక్కువే ఉంది.


            ఇండియాలో వేగంగా విస్తరిస్తోన్న కేన్సర్‌లలో గర్భాశయ ముఖ ్దద్వార కేన్సర్‌ ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కేన్సర్‌ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు మెనోపాజ్‌ తరువాత కనిపించే ఈ కేన్సర్‌ ఇప్పుడు యుక్తవయస్సుల్లోనూ కనిపిస్తోంది. సర్వైకల్‌ కేన్సర్‌ నివారణకు వాక్సినేషన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే  వాక్సిన్‌పై చాలా మందికి అవగాహన లేదు. నిజానికి ఈ వాక్సిన్‌ వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. చాలా సురక్షితమైనది. ఈ వాక్సిన్‌ను పెళ్లికి ముందు తీసుకుంటే చాలా మంచిది.  9 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సులో బాలికలకు ఇప్పిస్తే వారు సర్వైకల్‌ కేన్సర్‌ బారినపడకుండా ఉంటారు. 40 ఏళ్ల వయస్సు లోపు వారు కూడా వాక్సిన్‌ తీసుకోవచ్చు.

No comments:

Post a Comment