లివర్ కేన్సర్ కు పవర్ ఫుల్ వైద్యం
శరీరంలోని కీలక అవయవాల్లోకెల్లా అతి పెద్దది, అతి ముఖ్యమైనది కాలేయం. ఆ అవయవమే కేన్సర్ బారిన పడితే? ఒకప్పుడైతే ఇది కలవరపెట్టే విషయమే. కానీ, ఆధునిక వైద్య విధానాలు ప్రవేశించాక ఇప్పుడా సమస్య మునుపటిలా కలవరపెట్టే అంశం కాకుండా పోయింది. ప్రత్యేకించి సర్జరీలోనూ, కీమో, రేడియేషన్ థెరపీల్లో
వచ్చిన ఆధునిక రీతులు కాలేయ సంబంధమైన కేన్సర్‌ను అధిగమించడం సులభతరం చేశాయి. కాకపోతే, లివర్ కేన్సర్ అనగానే డిప్రెషన్‌లోకి జారిపోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, విధిగా వైద్య చికిత్సలు తీసుకుంటే లివర్ కేన్సర్ నుంచి సంపూర్ణంగా విముక్తి పొందడం సాధ్యమేనంటున్నారు కేన్సర్ వ్యాధి నిపుణులు.
కేన్సర్ వ్యాపించిన పరిధిని అనుసరించి వేరు వేరు సర్జరీ విధానాలు ఉంటాయి. కాకపోతే, లివర్ కేన్సర్ వచ్చిన వారిలో ఎక్కువ మంది సిరోసిస్ సమస్య ఉన్నవారే ఉంటారు. వారిలో లివర్‌లోని మిగతా భాగం కూడా దెబ్బ తినిపోయి ఉంటుంది. పైగా రక్తస్రావానికి సంబంధించి, రక్తం గడ్డ క ట్టడానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉంటాయి. అందుకే వీరిలో చాలా మందికి శస్త్ర చికిత్స చేయలేం. సర్జరీ ద్వారా కణితినీ, దెబ్బ తిన్న భాగాన్నంతా తొలగిస్తే మిగతా లివర్ శరీరానికి సరిపోదు. ఇలాంటి స్థితిలో లివర్ మార్పిడి చికిత్సే మార్గంగా ఉంటుంది. ఒకవేళ కేన్సర్ కణితి ఉన్నా, మిగతా లివర్ అంతా బాగానే ఉంటే అప్పుడు ఆ కణితిని మాత్రమే తొలగించే హెపాటిక్ రిసెక్షన్ సరిపోతుంది.

No comments:
Post a Comment