నవంబర్ ను లంగ్ కేన్సర్ అవేర్ నెస్ మంత్ గా జరుపుకుంటున్నారు. కేన్సర్ మూలంగా చనిపోవడానికి కారణం ఆలస్యంగా వ్యాధి నిర్ధారణ జరగడమే. తొలిదశలో గుర్తిస్తే కేన్సర్‌ను జయించే అవకాశాలు 99 శాతం ఉంటాయి. అయితే కొన్ని కేన్సర్లలో వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడవు. వ్యాధి నిర్ధారణ చేయడానికి అవసరమైన పరీక్షలు కూడా కష్టంగా ఉంటాయి. అలాంటి వాటిలో లంగ్ కేన్సర్ కూడా ఒకటి. అయితే ఈ కేన్సర్‌ను పసిగట్టేందుకు ఓ కొత్త మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో కేన్సర్ నిర్ధారణలో ఉపయోగించే బాధాకరమైన పద్ధతులకు వీడ్కోలు పలకవచ్చని వారు భావిస్తున్నారు.
లంగ్ కేన్సర్ బాధితులలో తాజాగా గుర్తించిన ఓ బయోమార్కర్ ద్వారా కేన్సర్‌ను ఖచ్చితంగా గుర్తించవచ్చని కనుగొన్నారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల కేన్సర్ నిర్ధారణకు ఉపయోగించే బ్రోంకోస్కోపీ పరీక్ష ఖర్చుతో కూడుకోవడంతో పాటు బాధాకరమైంది కూడా. ఈ నేపథ్యంలో కేన్సర్ సోకిందేమోననే అనుమానం కలిగితే వైద్యులు ఈ కొత్త విధానం ద్వారా తక్కువ ఖర్చుతో తేలిగ్గా వ్యాధినిర్ధారణ చేయవచ్చు.
No comments:
Post a Comment