Wednesday, 16 December 2015

చికెన్‌ తింటే కేన్సర్‌ వస్తుందా?



చికెన్‌ తింటాం…చాలా బాగుంటుంది. మంచిగా వండితే దీనంతటి రుచికరమైన కూర ఇంకొకటి లేదుమరి! అయితే చికెట్‌ తింటే కేన్సర్‌ వచ్చే ప్రమాదముందని మీకు తెలుసా? ఇది నిజం! చికెన్‌ తింటే కేన్సర్‌ అనేది ఏదో ఒక రూపేణా వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. దానికి కారణమేమిటేంటే, కోడిమాంసంలో కేన్సర్‌ వ్యాధికి కారకమయ్యే ‘ఆర్సనిక్‌’ అనే విషపూరితమైన రసాయనం వుంటుంది. ఈ రసాయనమే కేన్సర్‌కు కారణమవుతుంది. ఈ విషయాన్ని ఎఫ్‌డిఎ (అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌)ను ఉటంకిస్తూ అసోసియేటెడ్‌ ప్రెస్‌ న్యూస్‌ ఏజెన్సీ ఒక కథనాన్ని ప్రచురించింది.


ప్రపంచంలో చికెన్‌ తినేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. భారత్‌లో 10 శాతం మినహాయిస్తే దాదాపు అందరూ చికెన్‌ తింటారు. ఆర్సనిక్‌ అనేది ఒక విషపూరితమైన రసాయన పదార్థం. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి కోడిలోనూ ఇది కచ్చితంగా వుంటుంది. ఎందుకంటే ఈ కోళ్ళు స్పీడ్‌గా ఎదగడానికి ఇచ్చే మందులతో ఆర్సనిక్‌ మరింత శక్తివంతమవుతుంది. దీంతో కేన్సర్‌ కలిగించే ఈ రసాయన కణాలు కూడా పెరుగుతాయి. తద్వారా చికెన్‌ తిన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. శరీరంలో ఎర్రరక్తకణాలను ఇవి తినేస్తాయి. అదన్నమాట సంగతి! అందుకే చికెన్‌ తినేటప్పుడు కాస్త ఆలోచించి తినండి!

No comments:

Post a Comment