Monday, 21 December 2015

బ్రెస్ట్‌ కేన్సర్‌ కేరాఫ్‌ బెంగళూరు

బ్రెస్ట్‌ కేన్సర్‌కు కేరాఫ్‌ అడ్రస్సుగా బెంగళూరు మారింది. అవును ఐటిసిటీగా ఖ్యాతిగాంచిన బెంగళూరులో బ్రెస్ట్‌ కేన్సర్‌ కూడా వేగంగా విస్తరిస్తూ ప్రమాద ఘంటి కలను మోగిస్తోంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చికు అనుబంధంగా నడుస్తున్న పాపులేషన్‌ బేస్డ్‌ కేన్సర్‌ రిజిష్ట్రీ  ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. భారతదేశంలోని మొత్తం 11 ప్రముఖ నగరాల్లో ఈ సర్వేను నిర్వహించగా మొదటిస్థానం బెంగుళూరుదే.
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చికి అనుబంధంగా పనిచేస్తున్న పాపులేషన్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌ రిజిస్ట్రీ సంస్థ 2013 ఏడాదికిగాను తన సర్వే నివేదికను ఇటీవల వెల్లడిం చింది. బెంగళూరుతో పాటు ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌, భోపాల్‌, తిరువనంతపురం, చెన్నై, నాగపూర్‌, కోల్‌కత్తా, కొల్లం, పూణె నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వెల్లడైన విషయాల ప్రకారం బెంగళూరు నగరంలో ప్రతి లక్షమంది జనాభాకు 36.5 బ్రెస్ట్‌ కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ జాబితాలో 35.1 బ్రెస్ట్‌ కేన్సర్‌ కేసులతో తిరువనంతపురం రెండవస్థానంలో
ఉండగా, 32.6 కేసులతో చెన్నై 3వ స్థానంలో నిలిచింది. 23.3 కేసులతో చివరిస్థానంలో పూణె ఉంది. మారుతున్న ఆహారపు అలవాట్లతో ముప్పు : పదేళ్ళ క్రితం వరకు సాధారణంగా మహిళల్లో బ్రెస్ట్‌ కేన్సర్‌ ప్రమాదం ఎక్కువగా 45-55 ఏళ్ళ మధ్యన ఉండేది. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం 35-45 మధ్యకు తగ్గిపోయింది.

No comments:

Post a Comment