Tuesday 8 December 2015

ఎముకల కేన్సర్ తో ప్రమాదం

ఆస్టియో సర్కోమా అనేది ఎముకల్లో ప్రారంభమై.. వాటి చుట్టూ ఉన్న సున్నిత టిష్యూల్లోకి అత్యంత వేగంగా వ్యాపించే భయంకరమైన వ్యాధి. ఎముకల్లో నీలి రంగులో వచ్చే సాధారణ కేన్సర్లలో ఇది రెండో రకం. ఎముకలకు సంబంధించిన అపాయకరమైన ట్యూమర్లలో ఇది 15 శాతం కలిగి ఉంటుంది. ఆస్టియో సర్కోమా ముఖ్యంగా పురుషుల్లో 30 ఏళ్ల లోపు సోకుతుంది. ఇది ఐదేళ్ల లోపువారికి, నలభై ఏళ్లు పైబడ్డవారికి రావడం అరుదు.

            ఆస్టియో సర్కోమా రకరకాలుగా కనబడుతుంది. మెడికల్, రేడియాలజీ పరీక్షల్లో భిన్నంగా దర్శనమిస్తుంది. మోకాలి కీలు చుట్టూ కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. తొడ ఎముక కింది భాగాన కానీ, కాలి ఎముక పైభాగంలో కానీ వస్తుంది. దీని ప్రాథమిక లక్షణం నొప్పి. నొప్పి క్రమంగా పెద్దదై పిల్లలకు జ్వరం వస్తుంది. పిల్లలు క్షీణించిపోతుంటారు. గుర్తించడంలో ఆలస్యం చేస్తే ఎముకలకు ప్రమాదం.

No comments:

Post a Comment