Monday, 28 December 2015

ఇవి తింటే కేన్సర్‌ దూరం

పొగతాగే అలవాటు ఉన్న వారు లంగ్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? రోజూ ఎనిమిది రకాల ఫ్రూట్స్‌ తీసుకోవాలి. ప్రతిరోజూ రకరకాల ఫ్రూట్స్‌ తీసుకుంటే లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 23 శాతం మేర తగ్గుతాయి. ఈ విషయం ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో వెల్లడయింది. రోజూ ఐదు రకాల పళ్లు, కూరగాయలు తీసుకుంటే రూన్సర్‌ రాకుండా నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే.

యూర్‌పలోని ఒక సంస్థ పలు దేశాలలో లంగ్‌ క్యాన్సర్‌పై పరిశోధనలు నిర్వహించింది. ఇందులో ఎక్కువ ఫ్రూట్స్‌ తీసుకోవడమే కాకుండా, రకరకాల కూరగాయలు తీసుకునే వారిలో కూడా లంగ్‌ క్యాన్సర్‌ రిస్క్‌ చాలా వరకు తక్కువగా ఉందని వెల్లడయింది. పొగతాగే అలవాటు మానుకోలేకపోతే ఫ్రూట్స్‌నైనా ఎక్కువగా తినండి.

No comments:

Post a Comment