బ్రెస్ట్ క్యాన్సర్‌పై జరిపిన ఒక అధ్యయనంలో ఈ క్యాన్సర్ బారిన ఎక్కువగా కోస్తాంధ్రలోని మహిళలు గురవ్ఞతున్నట్టు తేలింది. దీనికి కారణం ప్రొటీన్లు, ఖనిజాలు, లోపమే అంటున్నారు నిపుణులు. అంతేకాదు ఈ ప్రాంతాల్లో సెర్వికల్ క్యాన్సర్ బారిన కూడా ఇక్కడ మహిళలు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వారు అనుమానిస్తున్నారు. బ్రెస్ట్‌క్యాన్సర్ బ్రెస్ట్‌లో టిష్యూ కారణంగా వస్తుంది. కాని కొన్ని కేసుల్లో ఆస్ట్రోజెన్ రిసెప్టర్, ప్రొజెస్టిరాన్ రిసెప్టర్ నెగిటివ్‌గా ఉండడంతో హార్మోన్ థెరపీ ప్రభావితం కావటం లేదు. అలాగే బయోమార్కర్ హెర్2, న్యూ కూడా నెగటివ్ ఉంటే హెర్‌సెప్టిన్ డ్రగ్ థెరపీ కూడా ప్రభావితం కావటం లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించేసరికి వారు 3, 4 స్టేజులలో ఉంటున్నారని, అందువల్ల వారిని కాపాడలేకపోతున్నామని నిపుణులు తెలిపారు. ఐహెచ్‌సి చేసిన పరిశోధనలో 52మంది పేషంట్ల ను పరిశీలించగా వారిలో ఎక్కువ మందికి రెండు సెంటీమీటర్ల ట్యూమర్‌ని కనుగొంటున్నారు. అది కూడా చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంటుంది. ఇది ఎక్కువగా 45 సంవత్సరాలు వయస్సు గల మహిళల్లో కనబడుతుంది. 95శాతం మహిళలకు ఒకరే సంతానం ఉంటున్నారు. బిడ్డలకు పాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment