Tuesday, 22 December 2015

తక్కువ ఖర్చుతో కేన్సర్‌ గుర్తింపు

కేన్సర్‌ సాధారణoగా ఏ భాగంలోనైనా వచ్చేఅవకాశం వున్నది.కేన్సర్‌ నిర్ధారణ అనేది అంత తేలికగా పూర్తైయ్యే ప్రక్రియ కాదు.ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అంటారు. అదీకాకుండా కేన్సర్‌ను మొదటి దశల్లో గుర్తించడం అనేది కూడా కష్టమైందే. అందుకు ప్రస్తుతం బయాప్సీ ద్వారా కేన్సర్‌ నిర్ధారణ చేస్తున్నారు.ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో ప్ర్యత్యామ్నాయాన్ని రూపొందించినట్లు తెలిపారు. అదీ అన్నవాహిక కేన్సర్‌ నిర్ధారణకు చేసే ఖరీదైన బయాప్సీకి మరో విధానమని వారంటున్నారు.

రైస్‌యూనివర్సిటీకి చెందిన ఈ శాస్త్రవేత్తల బృందంలో ఓ భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం అన్నవాహిక కేన్సర్‌ నిర్ధారణకు వైద్యులు అనుసరిస్తున్న ఎండోస్కోపిక్‌ స్క్రీనింగ్‌ కాస్త ఖర్చుతో కూడుకున్నది.ఇప్పుడు తయారుచేసిన  మైక్రోఎండోస్కోపిక్‌ పరికరం తక్కువ ఖర్చుతో కేన్సర్‌ జాడలను ఖచ్ఛితంగా గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు అoటున్నారు. దీంతో 147 మందిని పరీక్షించి చూసి సత్ఫలితాలను సాధించామని వారంటున్నారు. దీని వల్ల కేన్సర్‌ భయంతో -అవసరం లేకున్నా జరిపే బయాప్సీలను 90 శాతం తప్పించవచ్చని ఈ పరిశోధనకు సహ నేతృత్వం వహిచిన డాక్టర్‌ షర్మిల ఆనందసభాపతి వివరించారు.

No comments:

Post a Comment