ఇన్నాళ్లుగా ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలతో కూడిన
ఆహారం తింటే నిండు నూరేళ్ల జీవితానికి మాదీ గ్యారంటీ అని ఆహార పరిశోదనా
నిపుణులు టముకు వాయించేవారు. కానీ ఇప్పుడు తెల్ల కూరగాయలను ఆహారంలోకి
తీసుకుంటే పొట్ట కేన్సర్‌ని అవి మీ దరిదాపుల్లోకి కూడా రానీయవని మరో హామీ
ఇచ్చేస్తున్నారు. ఈ గొప్ప సత్యాన్ని కనుగొన్నది జెజియాంగ్ యూనివర్శిటీకి
చెందిన చైనా శాస్త్రవేత్త.
ఈ కొత్త అధ్యయనం ప్రకారం కాలిఫ్లవర్, ఆలుదుంపలు, ఉల్లిపాయలను తీసుకుంటే
పొట్ట కేన్సర్ వచ్చే అవకాశాన్ని పూర్తిగా అదుపు చేస్తాయని తేలింది. కానీ
బీరు, మత్తుపానీయాలు, ఉప్పు, నిల్వచేసిన ఆహార పదార్థాలను తిన్నట్లయితే
కేన్సర్ వచ్చే అవకాశం మెండుగా ఉందంటూ ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది.
బ్రిటన్‌లో ప్రతి రోజూ పొట్ట కేన్సర్ వ్యాధి కనీసం 13 మంది రోగులను బలి
తీసుకొంటోందని, ఈ వ్యాధి వచ్చిన వాళ్లు పదేళ్ల కాలంలో 85 శాతం మంది
మృత్యుముఖంలోకి వెళుతున్నారని కనుగొన్నారు.
మరో తెల్ల కూరగాయ అయిన
క్యాబేజీకి కూడా కేన్సర్‌ని అదుపు చేసే శక్తి ఉందని చెబుతున్నారు.
తెల్ల రంగులోని కూరగాయలన్నింటిలో సీ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది
పొట్టలో కణజాల ఒత్తిడికి వ్యతిరేకంగా యాంటి
ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సీ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రతి
రోజూ 50 గ్రాముల వరకు తీసుకున్నట్లయితే పొట్ట కేన్సర్ వచ్చే అవకాశాన్ని
8శాతానికి తగ్గిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతి రోజూ వంద
గ్రాముల పళ్లను ఆహారంగా తీసుకుంటే పొట్ట కేన్సర్‌ని 5 శాతానికి
తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
No comments:
Post a Comment