భవిష్యత్తులో కేన్సర్ వ్యాధిని కూడా పూర్తిగా మాత్రలతో నివారించడానికి వీలు కాబోతోంది. ఇది నిజంగా కేన్సర్ రోగులకు శుభవార్తే. ఈ మహమ్మారి సోకిందని ఆందోళన చెందాల్సిన అగత్యం ఉండకపోవచ్చు. బీపీ, షుగర్ మాదిరిగానే కేన్సర్ వ్యాధిని కూడా అదుపులో పెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు హైదరాబాద్ నగరంలో ఒక సమావేశంలో మాట్లాడుతూ, ఈ రకం మందులు ఇప్పటికే కొన్ని మార్కెట్లో ప్రవేశించాయని చెప్పారు. మరో అయిదేళ్ళలో మరికొన్ని కూడా రాబోతున్నాయని ఆయన తెలిపారు.
ఈ రకం మాత్రలపై ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలు పూర్తి చేశారని, ఇక భారతీయ మార్కెట్లోకి రావడమే మిగిలి ఉందని ఆయన చెప్పారు. మరో నాలుగైదు ఏళ్ల తరువాత కీమొథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సల కన్నా పూర్తిగా మాత్రల సహాయంతో దీన్ని నియంత్రించ వచ్చనీ, ఈ వ్యాధికి భయపడాల్సిన అవసరం ఉండదనీ, ఇక ఇది ప్రాణాంతకం కాకపొవచ్చనీ ఆయన చెప్పారు. కణాలపై కేన్సర్ కారకాలు పడకుండా ఈ మాత్రలు పనిచేస్తాయని ఆయన వివరించారు.
No comments:
Post a Comment