Friday, 25 December 2015

కేన్సర్ భారం భరించేదెలా..?

కేన్సర్‌.. ఒకప్పుడు సినిమాల్లో ఏదైనా కేరక్టర్‌కు పెద్ద జబ్బు ఉన్నట్టుగా చూపించాలంటే దీన్నే ప్రస్తావించేవారు. సినిమా పాత్రలకు తప్ప నిజజీవితంలో అరుదుగా వచ్చేది. కానీ, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా కేన్సర్‌ కేసులు, కేన్సర్‌ మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. గడచిన రెండేళ్లలో చాలామంది ప్రముఖులు ఈ వ్యాధి బారినపడి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. మనదేశంలో ఏటా 10 లక్షల కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి ఐదుగురు కేన్సర్‌ బాధితుల్లో ఒకరు 36 నుంచి 45 ఏళ్లలోపువారే. కేన్సర్‌ మరణాల సంఖ్య ఇంతగా ఉండటానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి.. దాన్ని తొలిదశలోనే గుర్తించలేకపోవడం. రెండోది.. గుర్తించినా చికిత్స చేయించుకునేంత ఆర్థిక స్థోమత చాలామందికి లేకపోవడం. బాధితులను శారీరకంగా, మానసికంగానే కాదు.. ఆర్థికంగానూ కుంగదీసే వ్యాధి ఇది.


 2004నాటి ఒక అధ్యయనం ప్రకారం… ఇంట్లో కేన్సర్‌ బాధితుడు/బాధితురాలు ఉంటే ఆ ఇంటి నెలవారీ బడ్జెట్‌ సాధారణంకన్నా గరిష్ఠంగా 44 శాతం పెరిగిపోతుంది. సాధారణ ఆరోగ్య బీమా పాలసీ కొంతవరకూ ఉపయోగపడుతుందిగానీ.. పరిమితి దాటితే మళ్లీ మన జేబులోంచే డబ్బు పెట్టుకోవాలి. పైగా ప్రీమియం కూడా ఎక్కువే. అదే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ అయితే ప్రీమియం తక్కువ ఉండి కొంతవరకూ ఆర్థిక భారం తగ్గుతుంది. మామూలు ఆరోగ్య బీమా పాలసీ అయితే.. కనీసం 24 గంటలపాటు హాస్పిటల్‌లో ఉంటేనే కవర్‌ అవుతుంది. అదే, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ అయితే.. ఆ వ్యాధి ఉన్నట్లు డయాగ్నసి్‌సలో తేలితే చాలు. చికిత్స వ్యయాలతో నిమిత్తం లేకుండా బీమా మొత్తాన్నీ ఒకేసారి చెల్లిస్తారు.

1 comment:

  1. ట్రై టూ ఈట్ హాఫ్ పోమేగ్రనేట్ ఫ్రూట్ ఈరి అల్తార్నట్ డే..టో అవొఇద్ ఎనీ కింద అఫ్ కాన్సర్స్.... [దానిమ్మ కాయ..]

    ReplyDelete