ప్రపంచం మొత్తం ఇష్టంగా వాడుతున్న సెల్
ఫోన్‌తో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. ఈ విషయం నిర్ధారించడానికి సంస్ధ
ప్రత్యేక పరిశోధనలేవీ చేయనప్పటికీ ఇప్పటికే ప్రపంచంలోని వివిధ సంస్ధలు
చేసిన పరిశోధనలను క్రోడీకరించిన డబ్ల్యు.హెచ్.ఓ సెల్ ఫోన్ ని అతిగా వాడ్డం
వల్లా, చెవికి దగ్గరగా పెట్టుకుని వాడడం వలనా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని
హెచ్చరించింది. ప్రమాదానాన్ని నివారించడానికి సెల్ ఫోన్‌ని చెవి దగ్గరగా
కాకుండా హేండ్స్ ఫ్రీ సెట్ వాడాలని లేదా టెక్ట్సు మెసేజ్‌లపై ఆధారపడాలని
సంస్ధ సలహా ఇచ్చింది.
సెల్ ఫోన్లలో వాడే పదార్ధాల నుండి
రేడియేషన్ వెలువడుతుందనీ, ఇవి మెదడు కణాల డి.ఎన్.ఏ లతో చర్య జరపడం వలన
మ్యుటేషన్ జరిగే అవకాశాలున్నట్లుగా గతంలో కొన్ని సంస్ధలు పరిశోధన చేసి
ప్రకటించాయి. మ్యుటేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే కణాలే కేన్సర్ కణాలనీ సేల్
ఫోన్ వాడకం పెరిగే కొద్దీ ఈ కణాల విస్తరణ పెరిగి కేన్సర్ వ్యాధి
సంక్రమిస్తుందనీ పరిశోధనలు తెలిపాయి. కొన్ని పరిశోధనలు సెల్ ఫోన్ ల వలన
ఎట్టి ప్రమాదం లేదనీ శుభ్రంగా వాడుకోవచ్చని కూడా ప్రకటించిన
సందర్భాలున్నాయి. పరిశోధన నిర్వహించిన స్వతంత్ర పరిశోధనలన్నీ కేన్సర్
ప్రమాదాన్ని హెచ్చరించడం గమనార్హం.
No comments:
Post a Comment