Friday, 4 December 2015

రొమ్ము కేన్సర్ కు కారణాలు అనేకం

అనేకమంది మహిళల్ని వేధిస్తున్న సమస్యల్లో రొమ్ము కేన్సర్ ప్రదానమైనది. ఈ కేన్సర్ 40 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అంతకు తక్కువ వయసున్న స్త్రీలలో ఈ కేన్సర్ రాదన్న నియమం లేదు. ఇది యువతులకు కూడా వచ్చే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. మన దేశంలో ప్రతి లక్ష మంది మహిళల్లో 50 మందికి రొమ్ము కేన్సర్ వస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.

           పాశ్చాత్య దేశాలైన స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, డెన్మార్క్, యుగోస్లావియా, ఇజ్రాయెల్ లో రొమ్ము కేన్సర్ బాగా ఎక్కువ. రొమ్ము కేన్సర్ రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఎవరికీ తెలియవు. వయసు మళ్లిన స్త్రీల్లో సంతానం కలగడం, అధిక సంతానం, పిల్లలకు స్తనమివ్వకపోవడం, రేడియేషన్ కు ఎక్కువగా లోనుకావడం, ఈస్ట్రోజన్ హార్మోన్ల వాడకం తదితర కారణాల వల్ల రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఉంది.

No comments:

Post a Comment