కొబ్బరి
బోండాం ఫుల్ ఎనర్జీని కలిగివుంటుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మినరల్స్
ఉన్నాయి. ఇవి అలసటను దూరం చేసి మిమ్మల్ని చురుగ్గా ఉండేలా చేస్తాయి. ఎనర్జీ
కలిగిన ఈ కొబ్బరి బొండాం వంద గ్రాముల నీటిలో 312 మిల్లీ గ్రాముల పొటాషియం,
30 మిల్లీ గ్రాముల మ్యాగ్నీషియం ఉన్నాయి. ఇవి ధాతువుల్ని ఎముకలకు,
కండరాలకు అందించడం ద్వారా కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శరీరానికి ఉత్సాహం
లభిస్తుంది.
తెల్లవారుజామున
పరగడుపున కొబ్బరి బొండాం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కిడ్నీలో రాళ్లు
చేరకుండా ఉండాలంటే రోజూ ఓ కొబ్బరి బొండాంను తీసుకోవడం మంచిది. అలాగే
కామెర్లకు కూడా కొబ్బరి నీళ్లు చెక్ పెడతాయి. కొబ్బరిబొండాంలో కొవ్వు శాతం
తక్కువ. డయాబెటిస్‌ను నియంత్రించే శక్తి ఎక్కువ. ఇంకా కేన్సర్ రాకుండా
నిరోధిస్తుంది. వైరస్‌తో పోరాడే శక్తి కొబ్బరి నీళ్లకుందని ఆరోగ్య నిపుణులు
సూచిస్తున్నారు.
No comments:
Post a Comment