Sunday, 27 December 2015

మగవారికి రొమ్ము కేన్సర్


అరుదైన వ్యాధుల్లో ఒకటిగా చెప్పుకొనే వ్యాధి 'మగవాళ్లలో బ్రెస్ట్ కేన్సర్'. సాధారణంగా బ్రెస్ట్‌కేన్సర్అనే మాట  వింటే గుర్తుకొచ్చేది మహిళలే. ఈ వ్యాధి వాళ్లలోనే ఉంటుందనేది నిన్నటి వరకూ ఉన్న నమ్మకం. కానీ నేటి పరిస్థితుల్లో అనేక కారణాల వల్ల మగవాళ్లు కూడా బ్రెస్ట్‌కేన్సర్ బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. వంశపారంపర్యత, ఊబకాయం వంటి సాధారణ కారణాలే తప్ప మగవాళ్లలో బ్రెస్ట్‌కేన్సర్‌కు సంబంధించిన ప్రత్యేక కారణాలంటూ వేటిని గుర్తించకపోవడం ఆందోళన కలిగించే విషయం.

ఆడవాళ్లలో బ్రెస్ట్ కేన్సర్ గురించి అనేకసార్లు వినడం, చూడటం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో చిక్కుకునే మగవాళ్ల సంఖ్య పెరుగుతోందని వైద్యరంగం చెబుతోంది. ఆడవాళ్లతో పోలిస్తే మొత్తం రొమ్ము కేన్సర్ కేసులలో మగవాళ్లది ఒక్క శాతమే అయినప్పటికీ ఇది ఆశ్చర్యపరిచే విషయమే. మగవారికి బ్రెస్ట్‌క్యాన్సర్ రావడానికి వైద్యరంగం ప్రత్యేకంగా సూచించిన కారణాలు ఏవీ లేకపోవడం విచిత్రం. ఇప్పటి వరకు చూస్తున్న కేసుల్లో మగవారిలో యాభై ఏళ్ల వయసు దాటిన వారిలోనే ఈ వ్యా«ధి ఎక్కువగా కనిపిస్తోంది. కానీ బ్రెస్ట్ కేన్సర్ ఏ వయసు వారికైనా రావచ్చు అని వైద్యరంగం చెబుతుండటం గమనార్హం.

No comments:

Post a Comment