కేన్సర్ నిర్ధారణ ఖర్చుతో కూడకున్న వ్యవహారం.. రోజుల తరబడి పరీక్ష
కేంద్రాలకు, ఆస్పత్రులకు తిరగడం విసుగుపుట్టిస్తుంటే, మరోవైపు ఫలితం ఎలా
వస్తుందోననే ఆందోళన పట్టిపీడిస్తుంది. తాజాగా ఈ చికాకులకు త్వరలో కాలం
చెల్లనుంది. కేన్సర్ నిర్ధారణకు సంబంధించి కచ్చితమైన ఫలితాన్ని అందించే ఓ
పరికరాన్ని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ
కోసం దీనికి కావాల్సిందల్లా హై రిజల్యూషన్‌తో ఫొటో తీయగల కెమెరా ఉన్న
స్మార్ట్‌ఫోన్ మాత్రమే!
ఈ పరికరం సాయంతో మీ స్మార్ట్‌ఫోనే ఓ పరీక్ష కేంద్రంగా మారనుందట. ఈ పరీక్షతో కేవలం అరవై నిమిషాల్లో కేన్సర్ ఉందో లేదో తెలుసుకోవచ్చని బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు చెప్పారు. స్మార్ట్‌ఫోన్ కెమెరాతో తీసిన హైరిజల్యూషన్ చిత్రాలను విశ్లేషించి కేన్సర్ సోకింది లేనిదీ ఈ పరికరం ఓ గంటలో తేల్చేస్తుందని చెప్పారు.

No comments:
Post a Comment